Home /News /telangana /

KHAMMAM YOUNGER BROTHER GAVE GIFTS TO AN ELDER SISTER WITH WEIGHED IN KHAMMAM ON THE OCCASION OF RAKHI FESTIVAL PRV

Rakhi: ఇదో అపురూప ఘట్టం.. రాఖీ పండుగకు అక్కకి తులాభారంతో తమ్ముడి బహుమతి..

తులాభారం

తులాభారం

రాఖీ పండుగకు తన అక్కకు జీవితాంతం గుర్తుండిపోయేలా చేయాలనుకున్నాడు ఓ తమ్ముడు. అంతే ఇప్పటివరకు ఎవరూ చేయని పనితో అద్భుతమైన సర్‌ప్రైజ్ ఇచ్చాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Khammam, India
    రాఖీ పండుగ (Rakhi festival). అన్నా చెల్లెలు, అక్కా తమ్ముడి మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా చేసుకునే ప్రత్యేక పండగే రక్షాబంధన్. రాఖీ పౌర్ణమి రోజు ప్రత్యేకంగా చేసుకునే ఈ పండగను తన అక్కకు జీవితాంతం గుర్తుండిపోయేలా చేయాలనుకున్నాడు ఓ తమ్ముడు (Brother). అంతే ఇప్పటివరకు ఎవరూ చేయని పనితో అద్భుతమైన సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఖమ్మంలో జరిగిన ఈ రక్షాబంధన్ వేడుక గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు.

    మహబూబాబాద్‌ (Mahabubabad) జిల్లా గార్ల బయ్యారానికి చెందిన బొలగాని బసవనారాయణ 15 ఏళ్ల క్రితం కుటుంబంతో కలిసి ఖమ్మం (Khammam) నగరంలో స్థిరపడ్డాడు. ప్రస్తుతం కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనకు కుమార్తె రణశ్రీ (Rana Sri), కుమారుడు త్రివేది (Trivedhi) ఉన్నారు. కుమార్తె రణశ్రీకి గతేడాది వివాహమైంది. కుమారుడు నగరంలోని ఓ ప్రైవేటు స్కూలులో పదోతరగతి చదువుతున్నాడు. త్రివేది చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్‌ మనీని రూ.5 నాణేలుగా మార్చి దాచుకునే అలవాటు ఉండేది. తల్లిదండ్రులు ఎందుకు దాస్తున్నావని అడిగినా ఎప్పుడూ సమాధానం చెప్పలేదు. వివాహానికి ముందు సోదరి అడిగినా చెప్పలేదు.



    పెళ్లి తర్వాత తొలిసారి ‘రక్షాబంధన్‌’కు..

    పెళ్లి (Marriage) తర్వాత అక్క అత్తారింటికి వెళ్లింది. క్రమంగా త్రివేది దాచిన నాణేలతో ఒక బస్తా నిండింది. తాజాగా తల్లిదండ్రులకు నాణేలు (Coins) ఎందుకు దాస్తున్నాడో చెప్పాడు మన త్రివేది. పెళ్లి తర్వాత తొలిసారి ‘రక్షాబంధన్‌’కు ఇంటికి వస్తున్న సోదరికి నాణేలను ‘తులాభారం (weighed)’ ఇస్తానన్నాడు. కుమారుడి కోరికకు పొంగిపోయిన తల్లిదండ్రులు అంగరంగ వైభవంగా వేడుక నిర్వహించాలనుకున్నారు. ఈ తులాభారం వేడుకకు బంధుమిత్రులకు ఆహ్వానం పంపారు.

    త్రివేది శుక్రవారం వారి స్వగృహంలో అక్కకు (Sister) తులాభారం వేసి ఆమె బరువుకు సరపడిన ఐదు రూపాయల నాణేలను కానుకగా ఇచ్చాడు. ఆమె బరువు 61 కిలోలు కాగా తులాభారంలో 11,200 వేల నాణేలు తూగాయి. అంటే వాటి విలువ అక్షరాలా రూ.56 వేలు. సోదరుడి సర్‌ప్రైజ్‌కు సోదరి, బావ ఉప్పొంగిపోయారు. వేడుకకు వచ్చిన బంధువులు వారిని ఆశీర్వదించారు.

    చెట్టుకు రాఖీ కట్టిన చిన్నారి..

    రాఖీ పండుగను పురస్కరించుకుని 75 రాఖీలను తయారుచేసి చెట్లకు కట్టింది బ్లేస్సి అనే చిన్నారి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన డాక్టర్ ప్రకృతి ప్రకాష్ కూతురు బ్లేస్సికి 9 సంవత్సరాలు. ఈ పాప నాంపల్లి నిర్మల స్కూల్లో మూడో తరగతి చదువుతోంది. తన తండ్రి ప్రకృతి ప్రకాష్ ప్రకృతి ప్రేమికుడు కావడంతో తన కూతురు సైతం అదే బాటలో నడుస్తోంది. చిన్ననాటి నుండి పర్యావరణ పరిరక్షణకై తాను సైతం ముందుకు సాగుతోంది. గతంలో చెట్ల క్రింద రాలిపడ్డ 65 వేల విత్తనాలను సేకరించి విత్తనవంతులుగా చేసి తన తండ్రి సహాయంతో అడవిలో వేసింది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Khammam, Rakhi purnima 2021, Thank you brother

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు