హోమ్ /వార్తలు /తెలంగాణ /

Cheater : ప్రేమ,పెళ్లి రెండు సార్లు మోసపోయిన యువతి .. ఇప్పుడు ఏం జరిగిందంటే

Cheater : ప్రేమ,పెళ్లి రెండు సార్లు మోసపోయిన యువతి .. ఇప్పుడు ఏం జరిగిందంటే

KHAMMAM LOVE FIGHT

KHAMMAM LOVE FIGHT

Cheater: ప్రేమించి తప్పించుకోవాలనుకున్నాడు. మౌనదీక్షకు దిగడంతో బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. ఆరు నెలలు కాపురం చేసిన తర్వాత మళ్లీ మాయమైపోయాడు. మొదట ప్రియుడిగా ఆ తర్వాత భర్తగా రెండు సార్లు మోసం చేయడంతో బాధితురాలు మరోసారి పోరాటానికి దిగింది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Khammam, India

  (G.SrinivasReddy,News18,Khammam)
  ప్రేమ గుడ్డిది అంటారు. బహుశా అందుకేనేమో ఆమె ముందు వెనకా చూసుకోకుండా అతని ప్రేమను ఓకే చేసింది. చాలాకాలం ప్రేమించుకున్నారు. దగ్గరయ్యారు. ఆమె పైన మోజు తీరాక ముఖం చాటేశాడు. తనను పెళ్లి (Wedding)చేసుకోమని ఆమె ఎన్ని విధాలా వేడుకున్నా అతని మనసు కరగలేదు. తీరా ఆమె అతని ఇంటి ముందు దీక్షకు కూర్చున్నాక పెళ్లికి ఒప్పుకున్నాడు.  పెళ్లయ్యాక అదీ మూణ్నాళ్ల ముచ్చటే అయింది. భార్యను సరిగా చూసుకోకుండా తిరుగుతుండడంతో ఆమె మళ్లీ తన పోరాటాన్ని మొదలుపెట్టింది.ప్రేమించి పెళ్లిచేసుకుని మోసంచేశాడని ఖమ్మం(Khammam)జిల్లా కారేపల్లి(Karepalli) మండలకేంద్రంలో బార్య ఆందోళన కొనసాగిస్తుంది. భర్త ఇంటి ముందు నిరసనగా మౌన దీక్ష(Silent protest)చేపట్టింది.


  Cyber crime : పెండింగ్ కరెంట్‌ బిల్లు కట్టమని ట్రాన్స్ కో చైర్మన్‌కే ఫేక్ మెసేజ్.. అంత ధైర్యం చేసిందెవరంటే  ప్రేమించి మోసం చేశాడు..

  నిజ జీవితంలో చాలా ప్రేమ కథలు సినిమాల్లో చూపించినట్లుగానే కష్టాలు,పోరాటాల మధ్య నలిగిపోతుంటాయి. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువతి ప్రేమ పెళ్లి కాపురం అంతే సాగుతోంది. కారేపల్లి మండల కేంద్రానికి చెందిన సముద్రాల వేణు ఆదే మండలoలోని ఎర్రబోడు గ్రామానికి చెందిన సునీతను ప్రేమించాడు. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందే వేణు సునీతను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. మోసం చేసి వదిలించుకోవాలని ప్రయత్నించాడు. ప్రేమించిన వాడ్నే పెళ్లి చేసుకోవడానికి సునీత పట్టుబట్టడంతో ఊళ్లో పెద్దలు రెండు కుటుంబాలతో మాట్లాడి వారి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేశారు. ఇది జరిగి ఆరు నెలలు అవుతోంది. హైదరాబాద్‌లో కాపురం పెట్టిన ఈ ప్రేమజంట మధ్యలో వేణు తల్లి కారణంగా మనస్పర్ధలు తలెత్తాయి. అంతే ఆ కారణంతో మరోసారి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను వదిలి పెట్టి గయాబ్ అయ్యాడు వేణు.  పెళ్లి చేసుకొని మోజు తీర్చుకున్నాడు..

  సునీత భర్త వేణు ఆమెను హాస్టల్‌లో చేర్పించి మళ్లీ వస్తానని చెప్పి పత్తా లేకుండా పోయాడు. మొదటి సారి ప్రేమించి వదిలించుకోవాలని చూసినప్పుడు సునీత వేణు ఇంటి ముందు మౌనదీక్ష చేపట్టింది. ఇప్పుడు పెళ్లి చేసుకొని మోజు తీరిన తర్వాత మళ్లీ వదిలించుకోవాలని చూడటంతో మళ్లీ న్యాయపోరాటానికి దిగింది. భర్త తన దగ్గరకు రావడం లేదని బుధవారం కారేపల్లిలోని వేణు అమ్మ దగ్గరకు వెళ్లి అడిగితే ఆమెను ఇంటికి రావద్దని వేణు గురించి తమను అడగవద్దని గట్టిగా చెప్పింది. నువ్వు ఎక్కడికి పోతావో పో మాకెందుకు అని గట్టిగా చెప్పడమే కాకుండా వాళ్ల బంధువులతో దాడి చేయించిందని బాధితురాలు సునీత ఆవేదన వ్యక్తం చేసింది.


  Basara IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీ స్టూడెంట్ ఫ్యామిలీకి కోటి పరిహారం ఇవ్వాలి .. నేడు అన్నీ యూనివర్సిటీలు బంద్‌ : OU JAC  రెండోసారి న్యాయపోరాటం ..

  స్థానికులు అడ్డుకొని సునీతను కాపాడారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ప్రేమపెళ్లి వ్యవహారంపై పోలీసులు ఇరువర్గాలను స్టేషన్‌కి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే పోలీసులు చెప్పినప్పటికి వేణు కుటుంబ సభ్యుల్లో మార్పు రాకపోవడంతో గురువారం నాడు సునీత వేణు ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్తతోనే కాపురం జరిగేలా చూడాలని డిమాండ్ చేస్తోంది.సునీతకు కారేపల్లిలోని వామపక్ష పార్టీలు మహిళ నాయకురాలు మద్దతుగా నిలిచాయి.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Khammam, Love marriage, Telangana News

  ఉత్తమ కథలు