హోమ్ /వార్తలు /తెలంగాణ /

Khammam: ఆ పట్టణ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారనుందా?

Khammam: ఆ పట్టణ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారనుందా?

ఇల్లందు

ఇల్లందు

ఇల్లందు. ఇదొక ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రాంతం. నిజానికి ఈస్టిండియా కంపెనీ తొలి రోజుల్లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించింది ఇక్కడి నుంచి అనేది చరిత్ర. దశాబ్దాలుగా సింగరేణి బొగ్గు ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా ఉన్న ఇల్లందు పట్టణం మరికొద్ది సంవత్సరాల్లో కాలగర్భంలో కలవనుందా..? ఈ పట్టణ పురోగతి భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారనుందా..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Khammam

జి శ్రీనివాస్ రెడ్డి, న్యూస్ 18 తెలుగు, ఖమ్మం

ఇల్లందు. ఇదొక ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రాంతం. నిజానికి ఈస్టిండియా కంపెనీ తొలి రోజుల్లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించింది ఇక్కడి నుంచి అనేది చరిత్ర. దశాబ్దాలుగా సింగరేణి బొగ్గు ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా ఉన్న ఇల్లందు పట్టణం మరికొద్ది సంవత్సరాల్లో కాలగర్భంలో కలవనుందా..? ఈ పట్టణ పురోగతి భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారనుందా..? అంటే అవుననే సమాధానమే ఇప్పుడు అన్ని నోట్ల వినిపిస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే ఇక ఇల్లందు పట్టణం ఒక సాధారణ మున్సిపాలిటీగా మిగిలిపోనుంది. ఇక్కడ బొగ్గు ఉత్పత్తి, రవాణా  వ్యాపారాలన్నీ మూతపడే ప్రమాదంలో పడ్డాయి. కొన్ని వేలమంది పట్టణం విడిచి వెళ్లిపోయే పరిస్థితి తలెత్తనుంది.

Komatireddy Venkata Reddy: అది నాది కాదు.. కాంగ్రెస్ షోకాజ్ నోటీసుకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరణ..

బొగ్గు ఉత్పత్తిలో గత కొన్ని దశాబ్దాలుగా పాటిస్తున్న భూగర్భ గనుల విధానం నుంచి.. ప్రమాదాల తీవ్రతను తగ్గిస్తూ..అదేవిధంగా ఉత్పత్తి ఖర్చును కూడా తగ్గించే.. ఓపెన్ కాస్ట్ మైనింగ్ విధానాన్ని సింగరేణి సంస్థ అవలంబిస్తోంది. ఈ విధానం వల్ల వాతావరణంలో వేడి పెరగడం దుమ్ము దూళి తరచు పెరగడం వల్ల ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు ఇబ్బందులు పోలవడం జరుగుతోంది. దీంతో తమ ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ వద్దని స్థానికులు అనేకమార్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇల్లందు పట్టణ సమీపంలో ఉన్న దాదాపు అన్ని భూగర్భగనులను ఇప్పటికే మూసివేశారు. ఇక మైనింగ్ చేస్తే కేవలం ఓపెన్ కాస్ట్ ద్వారా మాత్రమే.  ఈ విధానాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో సింగరేణి సంస్థ ఏదో ఒక నిర్ణయం కఠినంగా తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఒకవేళ అదే జరిగితే సంస్థ జిఎం ఆఫీస్ తో పాటు ఇక్కడ ఉన్న దాదాపు అన్ని తరగతుల ఉద్యోగులు కూడా అటు కొత్తగూడెం మణుగూరు సత్తుపల్లి వైపు వెళ్లాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది.

Peddapalli: అవయవదానం చేసి... మానవత్వం చాటుకుంటున్న ఆ గ్రామస్తులు

ఒకవేళ ఇదే జరిగితే ఏళ్ల తరబడి ఈ వర్గాలపై ఆధారపడిన వ్యాపారులు ఇంకా ఇతరత్రా పనులు చేసుకుంటూ జీవనం సాగించే వాళ్లంతా ఉపాధి కోల్పోయే ప్రమాదం నెలకొంది. ప్రస్తుతం సింగరేణి నిర్వహిస్తున్న ఓపెన్ కాస్ట్ మైన్ జీకే 5 2023 మార్చితో మూతపడనుంది. ఈలోగా మరో ఓపెన్ కాస్ట్ మొదలుపెడితే తప్ప ఇల్లందు పట్టణానికి మనుగడ లేదని చెప్పొచ్చు. ఇప్పటికే తవ్వకాలు సాగిస్తున్నటువంటి జెకె 5 మైన్ విస్తరించడం.. లేదా మరో ఓపెన్ కాస్ట్ మైండ్ ను తవ్వకాలను ప్రారంభించడం.. ప్రస్తుతం సింగరేణి వద్ద ఈ రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ స్థానికులు సహకరించని పక్షంలో అసలు ఆ ప్రాంతంలో మైనింగ్ ఆపేయాలన్న ఆలోచన కూడా సింగరేణి ఉన్నతాధికారుల మదిలో ఉంది. సాధారణంగా ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో  ఐదు క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్త్డే ని తొలగిస్తే బొగ్గు ఉత్పత్తి అవుతుంది. కానీ ఇక్కడ జీకే 5 ఓపెన్ కాస్ట్ లో మాత్రం 11 క్యూబిక్ మీటర్ల ఓబి ని తీస్తే తప్ప బొగ్గు ఉత్పత్తయ్య పరిస్థితి లేదు. దీంతో ఉత్పత్తి వ్యయం సహజంగానే పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఇంత కష్టపడి బొగ్గు తీస్తే అది కూడా బి గ్రేడ్ బొగ్గు కావడం వల్ల ధర కూడా పెద్దగా వచ్చే పరిస్థితి లేదు. అయినా మైండ్ ని మూసేయడం ఇష్టం లేని సింగరేణి అధికారులు కొనసాగించాలని.. మైను ను విస్తరించాలని ఆలోచన చేస్తున్నారు. దీనికోసం దాదాపు 151 ఎక్టార్ ల భూమి ప్రభుత్వం నుంచి అటవీ శాఖ నుంచి అనుమతులు లభించాల్సి ఉంది. దీనికోసం నిర్వహించిన  సభల్లో స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అయింది. ఇక్కడ మరో మైన్ ను ను స్టార్ట్ చేసిన లేదా జెకె 5 మైన్ విస్తరించిన మరో 12 సంవత్సరాలు బొగ్గు ఉత్పత్తి కొనసాగించే అవకాశం ఉంది.

లేదంటే వచ్చే మార్చి నాటికి బొగ్గు ఉత్పత్తి ఆపే పరిస్థితి. దీంతోనే ఇల్లందు పట్టణ భవిష్యత్తు ముడిపడి ఉంది. ఇల్లందు పట్టణ పురోగతి మరో 12, 13 ఏళ్లు కొనసాగించాలా లేదా ఇక్కడితో ఆగిపోవాలా అనేది ప్రజల చేతుల్లో ఉందన్నది సింగరేణి అధికారుల మాట. ఈ విషయంలో తమకు ఎలాంటి పట్టుదల లేదని అన్ని సవ్యంగా ఉంటేనే బొగ్గు ఉత్పత్తి కొనసాగిస్తామని లేదంటే ఇక్కడి నుంచి తరలిపోయే అవకాశం ఉందన్నది సింగరేణి అధికారుల మాట. దీంతో ఇల్లెందు పట్టణ భవిష్యత్తు ఎటు పోతుంది అనేది ఒక ప్రశ్నగా మారింది. శతాబ్దానికి పైగా బొగ్గుకి పర్యాయపదంగా నిలిచిన ఇల్లందు పట్టణం భవిష్యత్తు ఏమవుతుందనేది ఆసక్తిగా మారింది.

First published:

Tags: Khammam, Telangana

ఉత్తమ కథలు