హోమ్ /వార్తలు /తెలంగాణ /

Poison cooking: పురుగుల మందుతో వంట చేసి కూతురు, భర్తకు తినిపించిన ఇల్లాలు.. ఆ తర్వాత ఏమైందంటే..?

Poison cooking: పురుగుల మందుతో వంట చేసి కూతురు, భర్తకు తినిపించిన ఇల్లాలు.. ఆ తర్వాత ఏమైందంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ మహిళ పురుగులమందును మంచినూనె అనుకుంది. పురుగుల మందు పోసి కూర వండింది. ఆ తర్వాత అన్నంలో కలుపుకుని తినింది. తాను తినడమే కాక భర్తకు, కూతురికి సైతం వడ్డించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Khammam, India

ఖమ్మం (Khammam) జిల్లాలో మతిస్థిమితం సరిగా లేని ఓ మహిళ (Woman) పురుగుల మందును ( insecticide) మంచినూనె అనుకుంది. పురుగుల మందు పోసి కూర (Curry) వండింది. ఆ తర్వాత అన్నంలో కలుపుకుని తినింది. తాను తినడమే కాక భర్తకు (Husband), కూతురికి (daughter) సైతం వడ్డించింది. ఈ క్రమంలో ఆమె మృత్యువాత పడింది. భర్త కూడా ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఈ సంఘటనపై ఖమ్మం (Khammam) జిల్లా తిరుమలాయపాలెం ఠాణాలో శుక్రవారం కేసు నమోదయ్యింది. పోలీసుల కథనం ప్రకారం.. మేడిద పల్లికి చెందిన బండ్ల నాగమ్మ (37) మతిస్థిమితం లేక ఇబ్బంది పడుతోంది. గురువారం ఉదయం ఇంట్లో మంచి నూనెకు బదులు దాని పక్కనే ఉన్న పురుగుల మందుతో (Poison) కూర వండింది.

ఆ తర్వాత ఆ కూరతో తాను అన్నం తిని, చేలో పనిచేస్తున్న భర్త పుల్లయ్య, కూతురు పల్లవిలకు భోజనం తీసుకు వెళ్ళింది. మద్యం మత్తులో ఉన్న పుల్లయ్య కొంతమేర ఆ అన్నం తిన్నాడు. మందు వాసన  రావడంతో అమ్మాయి అన్నాన్ని పడేసింది. నాగమ్మ ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.

ఎక్కడ చూసినా కల్తీనే..

ప్రస్తుతం ఎక్కడ చూసినా.. ఏ పదార్థంలో అయినా కల్తీ రాజ్యమేలుతోంది. పాల నుంచి తేనె వరకు, కారంపొడి నుంచి చక్కెర వరకు.. మార్కెట్లో లభించే ప్రతి సరుకూ కల్తీనే. నిజానికి కల్తీ లేని స్వచ్ఛమైన సరుకు లభిస్తుందన్న ఊహ కూడా మనకు అందదు. ప్రజలు కూడా కల్తీకి అలవాటు పడిపోయారు. అప్పటికప్పుడు అవసరానికి దొరికిందా.. అవసరం తీరిందా అన్న ఆలోచనతోనే ఉన్నారు. తర్వాత ఆసుపత్రికి క్యూ కట్టడం అలవాటు అయిపోయింది. ఇదే అదునుగా వాళ్లు కూడా రెచ్చిపోతున్నారు.

వీటిపై ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కల్తీగాళ్లు పెరుగుతున్నారు తప్పితే తగ్గడం లేదు. ప్రత్యామ్నాయం లేక, స్వచ్ఛమైన పదార్థాలు ఎక్కడ దొరుకుతాయో తెలియక దొరికినవే వాడేస్తూ ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నారు. అయితే మనం నిత్యం వాడే వస్తువుల్లో ఎక్కువగా కల్తీ జరిగే వాటిలో వంట నూనె ఒకటి.

ప్రస్తుతం వీటి ధరలు ఆకాశాన్ని అంటడంతో కల్తీ బెడద మరింత పెరిగింది. వంటనూనెలు ఆకాశాన్ని తాకడంతో కల్తీ కూడా అదే విధంగా పెరిగిపోతోంది. కల్తీ నూనెలు ఎక్కడ పడితె అక్కడ రాజ్యమేలుతున్నాయి. అసహజ పద్ధతుల్లో నూనెను తయారు చేస్తూ మార్కెట్లోకి వదులుతున్నారు. ఇక విడిగా కొనుగోలు చేస్తేనే కదా ఈ సమస్య అనుకునేరు.. ఎందుకంటే కొందరు అక్రమార్కులు మరో అడుగు ముందుకేసి ఏకంగా బ్రాండెండ్‌ కంపెనీల పేరుతో నకిలీ నూనెను మార్కెట్లోకి వదులుతున్నారు. ఇదంతా ఇలా ఉంటే.. మరి ప్రస్తుతం ఆ కల్తీని ఎలా గుర్తించాలి.. దాని కోసం ఏం చేయాలి.. పూర్తి వివరాలు తెలుసుకుందాం.. ఈ ప్రశ్నకు సమాధానంగా ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఓ వీడియోను విడుదల చేసింది. దీని ప్రకారం చిటికెలో నూనెలో కల్తీ జరిగిందో, లేదో తెలుసుకోవచ్చు.

First published:

Tags: Cooking oil, Khammam, Wife

ఉత్తమ కథలు