తాత్కాలిక తృప్తి, పరాయి వ్యక్తితో పరిచయం ఆమెను నరరూప రాక్షసిని చేశాయి. అప్పటికే పెళ్లి చేసుకొని భర్తను వదిలేసిన మహిళ మరో యువకుడ్ని ప్రేమ వివాహం చేసుకుంది. అది చాలదంటూ తన ముద్దు, ముచ్చట్ల కోసం మూడో వ్యక్తిపై మనసు పడింది(Extramarital affair). చేస్తున్నది తప్పు అని తెలిసి కూడా తన స్వార్ధం, నచ్చిన పని చేయడానికి కట్టుకున్న భర్తను కూడా వద్దనుకున్న ఓ మాయలేడీ చివరకు మృతుడి శవాన్ని కూడా కనిపించకుండా చేసింది. ఈ దారుణానికి పాల్పడిన కేసులో పోలీసులు(Police)ఇద్దర్ని అరెస్ట్(Arrest)చేసి మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. కట్టుకున్న భర్తతో కాపురం చేయాల్సిన మహిళ కిరాతకంగా ప్రవర్తించిన ఘటన ఖమ్మం(Khammam)జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
భర్త వద్దు బాయ్‌ఫ్రెండే ముద్దు..
కొణిజర్ల మండలం పెద్దగోపతికి చెందిన చెందిన స్నేహలత అనే యువతి గ్రామీణం మండలం ఆరెంపులకు చెందిన సాయిచరణ్ నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఖమ్మంలో కాపురం పెట్టారు. సాయిచరణ్ కోళ్ల వ్యర్ధాలు తరలించే ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతనితో కరుణాకర్ అనే మరో వ్యక్తి కూడా కలిసి పని చేస్తున్నాడు. ఇద్దరూ ఒకే దగ్గర పని చేస్తుండటంతో స్నేహం ఏర్పడింది. ఆ క్రమంలోనే సాయిచరణ్ భార్య స్నేహలతతో కరుణాకర్‌తో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. తరచూ ఫోన్‌లో మాట్లాడటం, సాయికిరణ్ లేనప్పుడు ఇంటికి వెళ్లడం చూస్తుండే వాడు.
ప్రియుడితోనే మర్డర్ స్కెచ్..
తన భార్య కరుణాకర్‌తో క్లోజ్‌గా మూవ్ అవుతోందని తెలుసుకున్న సాయిచరణ్ ఆమెను మందలించాడు. పద్దతి మార్చుకోమని పలుమార్లు హెచ్చరించాడు. భర్తకు తన వివాహేతర సంబంధం తెలిసిపోవడంతో స్నేహలత అతడ్ని అడ్డుతొలగించుకొని ప్రియుడు కరుణాకర్‌తో జీవితాన్ని గడపాలని భావించింది. అదే విషయాన్ని ప్రియుడితో చెప్పి హత్యకు ప్లాన్ వేసింది. ఆగస్ట్ 1వ తేదిన సాయిచరణ్ , కరుణాకర్ ఇద్దరూ కలిసి ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు కోళ్ల వ్యర్ధాన్ని తీసుకొని వెళ్లారు. మార్గం మధ్యలోనే కరుణాకర్ పధకం ప్రకారం కలిసి మధ్యం తాగారు. అక్కడే తన భార్యతో ఫోన్‌లో ఎందుకు మాట్లాడుతున్నావ్, తాను లేనప్పుడు ఎందుకు ఇంటికి వస్తున్నావని సాయిచరణ్ నిలదీయడంతో ఇద్దరూ ఘర్షణ పడ్డారు.
శవం కూడా దొరకలేదు ..
చంపాలని పథకం వేసుకున్న కరుణాకర్ సాయిచరణ్‌ని తోసేసి కిందపడగానే పారతో తలపై కొట్టి చంపేశాడు. అక్కడి నుంచి మృతదేహాన్ని తీసుకొని ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కుదుపు గ్రామానికి చేరుకున్నాడు. శవానికి పెద్ద బండరాయి కట్టి చేపల చెరువులో పడేశాడు. మూడ్రోజుల తర్వాత సాయిచరణ్ శవం నీళ్లో తెలడం చూసిన చేపల చెరువు యజమానికి హత్య చేసిన కరుణాకర్‌కే ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. శవం పడిన చెరువులో చేపలను ఎవరూ కొనరని కాబట్టి విషయాన్ని గోప్యంగా ఉంచమని చెప్పడంతో కరుణాకర్ లైన్ క్లియర్ అయింది. వెంటనే మృతదేహాన్ని పక్కనే ఉన్న చెరువు మధ్యలోకి తీసుకెళ్లి ముళ్ల కంప చెట్టు వద్ద వదిలేశాడు. మృతదేహం వరద నీటిలో కొట్టుకుపోయింది.
బయటపడ్డ నంగనాచి నాటకం..
సాయిచరణ్‌ని తన ప్రియుడితో హత్య చేయించిన స్నేహలత ఏమీ తెలియనట్లుగా తన భర్త కనిపించడం లేదని ఈనెల 11వ తేదిన ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. భర్త కనిపించడం లేదని పది రోజుల తర్వాత వచ్చి కంప్లైంట్ ఇవ్వడంపై పోలీసులు ఆమెను అనుమానించారు.ఆమె ఫోన్ కాల్ డేటా తీయడంతో ఎక్కువ సార్లు ప్రియుడితో మాట్లాడినట్లుగా తేలడంతో ఇద్దర్ని అదుపులోకి తీసుకొని తమదైన శైలీలో విచారించడంతో నిజం ఒప్పుకున్నారు. అంతే కాదు నిందితురాలికి 2010లోనే మేనమామతో వివాహం జరిగితే నాలుగేళ్లు కాపురం చేసిన ఆటుపై అతడ్ని వదిలేసి సాయిచరణ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ హత్య కేసులో మొత్తం నలుగురు ప్రమేయం ఉన్నట్లుగా తేల్చారు. ఇద్దర్ని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. మృతుడి శవం మాత్రం ఇంత వరకు దొరక్కపోవడంతో పోలీసులు గాలిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Brutally murder, Extra marital affair, Khammam, Telangana crime news