హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hostel food : ఆ హాస్టల్‌లో పురుగులున్న అన్నమే పరమాన్నం.. తినలేక విద్యార్ధులు పస్తులుంటున్న వైనం

Hostel food : ఆ హాస్టల్‌లో పురుగులున్న అన్నమే పరమాన్నం.. తినలేక విద్యార్ధులు పస్తులుంటున్న వైనం

hostel food

hostel food

Hostel food: ఖమ్మం జిల్లా కామేపల్లి మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో ప్రతిరోజు పురుగులు ఉన్న అన్నం పెట్టడంతో బాలికలు అన్నం తినకుండా పస్తులు ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా ఇదే తీరుగా వ్యవహరిస్తుంటే వార్డెన్ వసంతకు బాలికలు చెప్పినప్పటికి పురుగులను పక్కకు పడేసి మిగిలిన అన్నం తినమని సలహా ఇస్తున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Khammam, India

  G.SrinivasReddy,News18,Khammam)

  ఖమ్మంనిర్లక్ష్యానికి నెలవులు.. ఆశ్రమ హాస్టల్లు

  ఆశ్రమ హాస్టల్లో అన్నంలో పురుగులుఅర్ధ ఆకలితో విద్యార్థినులు

  బియ్యంలో పురుగులు కుళ్లిన కూరగాయలు

  పురుగుల పడిన అన్నమే పరమాన్నం..

  ఆశ్రమ హాస్టళ్లు(Government hostel)నిర్లక్ష్యానికి నెలవులుగా మారాయి. ప్రభుత్వం దండిగా నిధులిస్తున్నా, పర్యవేక్షణ లోపం వల్ల ప్రభుత్వ ఆశయం నీరుగారిపోతోంది. ఉన్నతాధికారులు ఎన్ని సార్లు తనిఖీలు జరిపినా ఫలితం కనిపించడం లేదు. దీంతో సాక్షాత్తూ రాష్ట్ర హైకోర్టు (State High Court)హాస్టళ్లను తనిఖీ చేయాల్సిందిగా ఆదేశించాల్సి వచ్చింది. దీంతో ఇల్లెందు(Yellandu)కోర్టు జడ్జి ముఖేష్‌కుమార్ (Judge Mukesh Kumar)సంక్షేమ హాస్టల్ ను తనిఖీ చేసి రిపోర్ట్ (Report)పంపారు. విద్యార్దులకు అందించే ఆహారం మొదలు .. నిద్రపోయే స్తలం దాకా ఏవీ ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేల్చారు. దీన్ని బట్టే వసతి గృహాల దీనస్థితిని అర్దం చేసుకోవచ్చు.

  TS Exams Postponed: తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. ఆ పరీక్షలన్నీ వాయిదా.. పూర్తి వివరాలివే

  నిర్లక్ష్యం..

  ఖమ్మం జిల్లా కామేపల్లి మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో ప్రతిరోజు పురుగులు ఉన్న అన్నం పెట్టడంతో బాలికలు అన్నం తినకుండా పస్తులు ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్న విషయం వార్డెన్ వసంతకు బాలికలు చెప్పినప్పటికి పురుగులను పక్కకు పడేసి మిగిలిన అన్నం తినమని చెప్పేదని విద్యార్థులు వాపోయారు. అన్నంతో పాటు కిచిడీ రుచిగా ఉండదని నీటి సౌకర్యం మంచిగా లేదని దాంతో పిల్లలకు ఎలర్జీ వచ్చి బాధపడుతున్నారని తెలిపారు.

  నాణత్య లేని భోజనం..

  గత పది సంవత్సరాల నుండి వార్డెన్‌గా పనిచేస్తున్న వ్యక్తి పిల్లలకు అందించే ఆహారం పట్ల నిర్లక్ష్యంగా వహిస్తూ మౌలిక సదుపాయాలు కల్పించకుండా తనకు నచ్చినట్లు వ్యవహరిస్తుందని పిల్లలు ఆవేదనతో చెబుతున్నారు. మెనూ కూడా సక్రమంగా పాటించకుండా ఆమెకు నచ్చినట్లు చేస్తూ పిల్లలకు పుష్టికరమైన ఆహారం అందించకుండా చేయడంతో పిల్లలు వారి తల్లిదండ్రులకు తెలపడంతో తల్లిదండ్రులు వచ్చి పిల్లలకు పెట్టె భోజనం వసతులు చూసి ఆవేదనకు గురయ్యారు. చదువు కొని ఉన్నత విద్యావంతులయ్యే బాలికల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వార్డెన్ వసంతను తక్షణమే తొలగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

  Gujarat Former CM Meets KCR: మీ నాయకత్వంలో పనిచేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం: గుజరాత్​ మాజీ సీఎం

  పిల్లల ప్రాణాలతో చెలగాటం..

  వార్డెన్ వసంత సమయపాలన పాటించకుండా ఇష్టం వచ్చినప్పుడు హాస్టల్‌కు వచ్చి వెళ్తుందని విద్యార్థులు తెలిపారు. మీడియాని సైతం లోపలికి రాకుండా గేటుకు తాళం వేసి హాస్టల్ వార్డెన్లు లోపల వారికి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ లోపల జరిగే విషయాలను బయటకు తెలియనివ్వకుండా విద్యార్థులను అదుపులో పెట్టుకొని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని హాస్టల్ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి హాస్టల్లో మౌలిక వసతులపై దృష్టి పెట్టి సరైన భోజనం కల్పించి వార్డెన్ వసంతపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Hostel students, Khammam, Telangana News

  ఉత్తమ కథలు