హోమ్ /వార్తలు /తెలంగాణ /

Variety Murder : ఇంజక్షన్‌తో హత్య .. లిఫ్ట్ ఇచ్చిన బైకర్‌పైనే ప్రయోగం

Variety Murder : ఇంజక్షన్‌తో హత్య .. లిఫ్ట్ ఇచ్చిన బైకర్‌పైనే ప్రయోగం

verity murder

verity murder

Variety Murder: నేరాలు కూడా కొత్త తరహాలో జరుగుతున్నాయి. ప్రత్యర్ధులపై పగ తీర్చుకోవడానికి ఊహించని విధంగా హత్యోదంతానికి పాల్పడటం చూస్తుంటే సాధారణ ప్రజలకే కాదు పోలీసులకు మతి పోతోంది. ఖమ్మం జిల్లాలో జరిగిన మర్డర్ కేసులో నిందితులు వ్యక్తిని సాయం కోరి నమ్మించి విష ప్రయోగం చేసి చంపడం కలకలం రేపింది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Khammam, India

  (G.SrinivasReddy,News18,Khammam)

  నేరాలు కూడా కొత్త తరహాలో జరుగుతున్నాయి. ప్రత్యర్ధులపై పగ తీర్చుకోవడానికి ఊహించని విధంగా హత్యోదంతానికి పాల్పడటం చూస్తుంటే సాధారణ ప్రజలకే కాదు పోలీసు(Police)లకు మతి పోతోంది. ఖమ్మం(Khammam)జిల్లాలో జరిగిన మర్డర్ కేసులో నిందితులు వ్యక్తిని సాయం కోరి నమ్మించి విష ప్రయోగం (Poison experiment) చేసి చంపడం కలకలం రేపింది. అరుపులు, మారణాయుధాలతో పని లేకుండా ఎలాంటి రక్తపాతం జరగకుండా వ్యక్తి చూస్తుండగానే అతని శరీరంలోకి ఇంజక్షన్‌ (Injection)తో విషాన్ని ఎక్కించి పారిపోయారు నిందితులు. సంఘటన జరిగిన ఐదు నిమిషాల్లోనే వ్యక్తి విగతజీవిగా మారడంతో స్థానికులు, ప్రత్యక్షసాక్షులు షాక్‌ నుంచి తేరుకోలేకపోతున్నారు.

  Flexi controversy: ఫ్లెక్సీలో ఫోటో లేదని అధికారులపై ఫైర్ .. ఖమ్మం టీఆర్ఎస్‌లో మరోసారి బయటపడ్డ వర్గపోరు

  వెరైటీ మర్డర్ ..

  ఖమ్మం జిల్లా వల్లభిలో కళ్ల ముందే దారుణం జరిగింది. జిల్లాలోని మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం బొప్పారం గ్రామానికి చెందిన షేక్ జమాల్ సాహెబ్ అనే 55సంవత్సరాల వ్యక్తి వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. తన కూతుర్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా గండ్రాయిలో ఉంటోంది. షేక్ జమాల్ సాహెబ్ తన మోటర్ సైకిల్‌పై వల్లభి మీదగా గండ్రాయి వెళ్తున్న సమయంలోనే అనూహ్య రీతిలో హత్య జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ ఇవ్వమని కోరడంతో జమాల్‌ తన బైక్‌పై ఎక్కించుకున్నాడు.

  విష ప్రయోగంతో హత్య..

  బైక్‌ లిఫ్ట్ అడిగిన వ్యక్తి ముఖానికి మంకీ క్యాప్ పెట్టుకోవడం గమనించని జమాల్ సాహెబ్ లిఫ్ట్ ఇచ్చిన బైక్‌పై తీసుకెళ్లాడు. సరిగ్గా టూవీలర్ బాణాపురం దాటిన తర్వాత వల్లభి పొలాల సమీపంలో బైక్‌పై వెనుక కూర్చున్న గుర్తు తెలియని వ్యక్తి వెంట తెచ్చుకున్న ఇంజక్షన్‌ను జమాల్‌ సాహెబ్ తొంటి భాగంలో గుచ్చాడు. వెంటనే బైక్‌ తీసుకొని పారిపోయినట్లుగా స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అనుకోని సంఘటనతో షాక్ గురైన జమాల్‌ వెంటనే తేరుకొని బంధువులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పి కింద పడిపోయాడు. గ్రామస్తులు అతడిని వల్లభి ప్రాథమిక వైద్యశాల కి తీసుకెళ్లగా వెంటనే చనిపోవడం జరిగింది.

  Crime News : బీర్‌ సీసా ముక్కతో వివాహిత గొంతు కోసిన ఎమ్మెల్యే పీఏ .. ఆ కోరిక తీర్చను అన్నందుకే ..

  ఎవరో ..? ఎందుకో ..?

  స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. జమాల్‌ సాహెబ్ బైక్‌పై లిఫ్ట్ తీసుకొని ఆయన్ని హతమార్చిన వ్యక్తి చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన వాడిగా అనుమానిస్తున్నారు. ముదిగొండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ధర్యాప్తు చేస్తున్నారు. ఈ వెరైటీ మర్డర్‌ కేసులో ఇద్దరు పాల్గొన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఇంజెక్షన్ ద్వారా విష ప్రయోగం చేసి జమాల్‌ సాహెబ్‌ని చంపాల్సిన పగ ఎవరికి ఉందన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Khammam, Murder case, Telangana crime news

  ఉత్తమ కథలు