Home /News /telangana /

KHAMMAM TOWN CORPORATOR THREATENS TO A FAMILY FOR DEBTS VRY

Khammam : ఖమ్మంలో మరో అధికార పార్టీ నేత హంగామా.. అప్పుల పేరుతో అర్థరాత్రి పూట బెదిరింపులు

బాధితుడు శతత్

బాధితుడు శతత్

Khammam : ఖమ్మంలో అధికార పార్టీ నేతల అధికార దాహంతో సాధారణ కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే ఇటివల రాఘవ అరాచకాలు బయటపడగా తాజాగా ఓ కార్పోరేటర్ సైతం ఓ కుటుంబం వద్దకు వెళ్లి అర్థరాత్రి హంగామా సృష్టించాడు.

  ఖమ్మంలో ఇటివల వనమా రాఘవ అరాచకాలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే.. అయితే రాఘవ పోతే మరోకరు అన్నట్టు ఖమ్మం అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు.. తాజాగా ఓ కార్పోరేటర్ తన అధికారాన్ని చలాయించి ఓ దళిత కుటుంబాన్ని అర్ధరాత్రి నడిరోడ్డుపై వేసేందుకు యత్నించాడు. అప్పుల పేరుతో వారి ఇళ్లు లాక్కునే ప్రయత్నాలు చేశాడు. ఇందుకోస రౌడిలు పోలీసుల అండతో అర్థరాత్రి బాధితుడి ఇంటికి వెళ్లి నానా హంగామా సృష్టించిన ఉదంతం వెలుగు చూసింది. ఈక్రమంలోనే బాధితుడు నేరుగా మీడియా ముందుకు వచ్చాడు. తనపై అధికార పార్టీ కార్పోరేటర్ చేస్తున్న ఆగడాలను వెల్లడించాడు.

  ఈ క్రమంలోనే 50వ డివిజన్ కార్పొరేటర్ రాపర్తి శరత్ ఖమ్మంలో ఈసారి ఆగడాలకు వేదికయ్యాడు. నగరంలోని దళితుడైన మోదుగు అరుణ్ రాజ్ ఇంటిపై కన్నేసి, ఖాళీచేయాలని బెదిరింపులకు గురిచేస్తూ గురువారం అర్ధరాత్రి జేసీబీతో కొంతమంది గూండాలతో వెళ్లి ఇంటి ప్రహరి గోడను కూల గొట్టి భయబ్రాంతులకు గురిచేశారని బాధితుడు ఆరోపించాడు. ఈ సంధర్భంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో బాధితుడు నేరుగా మీడియాను ఆశ్రయించాడు.

  TS news : గ్రీన్ కవర్‌లో హైదరాబాద్ టాప్ , తెలంగాణ స్థానం మాత్రం..


  దీంతో సంఘటనకు సంబంధించిన అంశాలను శరత్ వివరించాడు.ఖమ్మం పట్టణంలోని ఇంటి నెంబర్ 11-10-782/ఏ/1 ఇల్లును అక్రమించుకోవాలనే దురుద్దేశంతో 50వ డివిజన్ కార్పొరేటర్ "రాపర్తి శరత్" పేడేటి రమేష్, గురువారం అర్ధరాత్రి సుమారు ఒంటి గంట సమయంలో ఇంటిమీదకు జేసీబీని తీసుకొని వచ్చి ఇల్లు కాళీచేయాలని, లేని పక్షంలో మిమ్మల్ని కిరాయికి ఉన్నవాళ్లను అందరిని జేసీబీతో తొక్కిస్తామని దాడి చేసి మా ఇంటి ప్రహరీ గోడను కులగొట్టారని.. ఈ క్రమంలోనే 100 డైల్ నెంబర్ కి కాల్ చేసి చెప్పినా పోలీసులు సైతం ఆలస్యం చేశారని చెప్పాడు. తాను ఉంటున్న ఇంటిని నెల 5వ తారీకున ఇల్లు కాళీచేయాలని, దీంతోపాటు కులం పేరుతో తిట్టాడని, పోలీసులకు ఫిర్యాదు చేశాడని చెప్పాడు. అయినా.. పోలీసుల సైతం తనకు న్యాయం చేయడం పోగా.. తిరిగి తననే బెదిరిస్తున్నట్టు చెప్పాడు. మరోవైపు సెటిల్మెంట్ చేసుకోవాలని కూడా సలహా ఇస్తున్నారని అన్నారు. అప్పుడే కేసు పెట్టమని చెబుతున్నారు.

  Khammam : ఇది కదా.. భోగి సంబరాలంటే.. డూడూ బసవన్నలతో రైతు బంధు సంబరాలు..!

  ఇక అర్థరాత్రి ఆ కార్పోరేటర్ దౌర్జన్యం చేయడం కరెక్ట్ కాదని స్థానికులు చెప్పిన కార్పోరేటర్ "రాపర్తి శరత్" వినలేదని పైగా తాను అధికార పార్టీ కార్పొరేటర్ ని నా ఇష్టమొచ్చినట్లు చేస్తాను అని మీరు ఎవరికి చెప్పుకున్న నన్ను ఏమి చేయలేరని బెదిరింపులకు దిగాడని వాపోయాడు..అయితే పోలీసులు కూడా బాధితుడికి రక్షణ కల్పించకుండా ఆ కార్పోరేటర్‌కు అనుకూలంగా వ్యవహరిస్తుండడంతో జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని కోరాడు.
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Khammam, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు