హోమ్ /వార్తలు /తెలంగాణ /

Injection Murder: ట్విస్టు మామూలుగా లేదుగా.. ‘‘సూది మర్డర్‌ వెనుక కథ ఇదీ..’’

Injection Murder: ట్విస్టు మామూలుగా లేదుగా.. ‘‘సూది మర్డర్‌ వెనుక కథ ఇదీ..’’

బైక్​పై వెళుతున్న బాధితుడు, నిందితుడు

బైక్​పై వెళుతున్న బాధితుడు, నిందితుడు

ముదిగొండ  (Mudhigonda) మండలం బాణాపురం వద్ద జమాల్ ను పాయిజన్ సూదితో హత్య చేసిన సంగతి తెలిసిందే. పక్కాగా ప్లాన్‌ చేశారు. ఎవరికీ అనుమానం కూడా రాకుండా పథకం పన్నారు. అయినా బెడిసికొట్టింది. సూది మర్డర్‌ కేసును పోలీసులు 24 గంటల్లోనే తేల్చారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Khammam, India

(G. Srinivas reddy, News18, Khammam)

ఈనెల 19న ముదిగొండ  (Mudhigonda) మండలం బాణాపురం వద్ద జమాల్ ను పాయిజన్ సూదితో హత్య చేసిన సంగతి తెలిసిందే. పక్కాగా ప్లాన్‌ చేశారు. ఎవరికీ అనుమానం కూడా రాకుండా పథకం పన్నారు. అయినా బెడిసికొట్టింది. సూది మర్డర్‌ కేసును పోలీసులు 24 గంటల్లోనే తేల్చారు. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు బృందాలుగా దర్యాప్తు చేపట్టారు ముగ్గురు వ్యక్తులను  అనుమానితులుగా  పోలీసులు గుర్తించారు. చింతకాని మండలం నామవరం వద్ద ఓ అనుమానితుడ్ని అదుపులోకి తీచుకుంటుండగా పరారయ్యాడు. నామవరం కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఘటనలో పాల్గొన్నట్లుగా అనుమానిస్తున్నారు. అక్రమ సంబంధానికి (Extra Marital affair) అడ్డువస్తున్నాడనే కారణంతో  హత్య (Murder) చేసినట్లుగా సమాచారం.. మొత్తం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకునేందుకు 4 బృందాలు ఏర్పాటు చేశారు. నరిశెట్టి వెంకటేష్, మోహన్ రావు, ఆర్ఎంపీ వైద్యుడు బండి వెంకన్నలను నిందితులుగా గుర్తించారు.

ఇంజెక్షన్ ద్వారా మత్తుమందును హై డోసేజి ఇవ్వడం ద్వారా ‌హత్యకు గురైన జమాల్ (చనిపోయిన వ్యక్తి ) భార్యతో..  సూది ఇచ్చిన వ్యక్తికి గల సంబంధంపై పోలీసులు దృష్టిసారించారు. ఆ దిశగా ఆధారాలను రాబట్టారు. సీసీ ఫుటేజి, సెల్‌ఫోన్‌ లొకేషన్‌, కాల్‌డేటా ద్వారా కీలకమైన వివరాలను సేకరించారు. జమాల్ అడ్డుగా ఉన్నాడని హత్య చేసినట్లు అనుమానించిన పోలీసులకు సీన్‌ఆఫ్‌ అఫెన్స్‌లో ఉన్న తీవ్రత, ఇంటెన్షన్‌ ఆధారంగా కేసును ఓ కొలిక్కి తెచ్చారు.

సూదిగాడు తిరుగుతున్నాడు జాగ్రత్త అంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన నేపథ్యంలో.. ఈ ''ఇంజక్షన్ హత్య (Injection Murder)"లో భారీ ట్విస్ట్‌ ను పోలీసులు నిగ్గు తేల్చారు. మృతుని కుటుంబ సభ్యుల పాత్ర లేకుండా ఈ హత్య సాధ్యం కాదన్న కోణంలో వెళ్లడంతో నిజాలు వెలుగుచూశాయి. భార్య బండారం బయటపడింది. దీంతో మృతుని భార్యను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.

.ఏం జరిగింది?

ఖమ్మం (Khammam) జిల్లా ముదిగొండ మండలం వల్లభి సమీపంలో బైక్‌ లిఫ్ట్‌ (Bike lift) అడిగిన గుర్తు తెలియని వ్యక్తి, బైక్‌ పైకి ఎక్కాక ఇంజెక్షన్‌ సూది (Injection) ని గుచ్చడంతో జమాల్‌సాహెబ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. చింతకాని మండలం బొప్పారానికి చెందిన జమాల్‌సాహెబ్‌ తన కుమార్తెను చూడడానికి ఎన్టీఆర్‌ జిల్లా గండ్రాయి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. దీనిపై నిమిషాల వ్యవధిలోనే స్పందించారు పోలీసులు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ దారుణ హత్య జరిగిందని గుర్తించారు.

హత్యలో ప్రత్యక్షంగా, పరోక్ష భాగస్వామ్యం ఉన్న వారిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. చింతకాని మండలం మత్కేపల్లికి చెందిన గోద మోహనరావు, అతని స్నేహితుడైన ట్రాక్టర్‌ డ్రైవర్‌ నర్సింశెట్టి వెంకటేష్‌తో కలసి ఆర్‌ఎంపీ వైద్యుడైన బండి వెంకన్న సహకారంతో అత్యధిక డోసేజి ఉన్న మత్తుమందు ఇంజెక్షన్‌ను సిద్ధం చేసుకుని జమాల్‌ సాహెబ్ ను హత్య చేసినట్టు తేల్చారు. మొత్తం నలుగురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు తెలుస్తోంది. కేసుకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

First published:

Tags: Khammam, Murder, Wife kill husband

ఉత్తమ కథలు