Home /News /telangana /

KHAMMAM THIEVES ARE STEALING MONEY AND MOBILE PHONES BY STOPPING MOTORISTS IN THE NAME OF HELPING THEM IN KHAMMAM SNR KMM

Crime news : వాళ్లంతా ఓ ఖతర్నాక్ బ్యాచ్ .. ఈ వీడియో చూస్తే ఇకపై ఎవరికి సాయం చేయరు

khammam Thieves

khammam Thieves

Crime news: ఆ నగరంలో సాయం చేయమని కోరుతూ జనాన్ని దోచుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. రోడ్డుపై వెళ్తున్న వాళ్లను ఆపి మరీ ..వాళ్లను పబ్లిక్‌గా నిలువుదోపిడీ చేస్తున్నారు. బాధితులు నష్టపోయామని తెలుసుకునేలోపే ఆ కేటుగాళ్లు అక్కడి నుంచి జంప్ అవుతున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Khammam, India
  (G.SrinivasReddy,News18,Khammam)
  మోసాలు(Frauds),చోరీలు(Burglaries),దొంగతనాలు(Thefts)చేసే వాళ్లు ఇప్పుడు జనం మధ్యలోకి వచ్చి మరీ పబ్లిక్‌గా పని చక్కబెట్టుకుపోతున్నారు. అవతలి వ్యక్తుల మంచితనం, సహాయగుణం, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని నిలువుదోపిడీకి పాల్పడుతున్నారు. ఖమ్మం (Khammam)జిల్లా కేంద్రంలో జరిగిన ఓ చోరీ చూస్తే వామ్మో మేకవన్నె పులులు అంటే ఇలాగేనేమో అనే సందేహాలు రాక తప్పదు. రద్దీగా ఉండే ప్రదేశంలో సాయం చేయడానికి వచ్చిన వాళ్లనే లూటీ చేశారంటే వాళ్లెంతటి దుర్మార్గులో వేరే చెక్కనక్కర్లేదు. ఖమ్మం నగరంలోని కస్పా బజార్‌లో జరిగిన చోరీ దృశ్యాలు ఇప్పుడు స్ధానికులతో పాటు పోలీసులకు మతిపోగొడుతున్నాయి. దొంగలు ఎంతో తెలివిగా అమాయకుల్ని, సాధారణ వ్యక్తులు బురిడి కొట్టిస్తున్నారు. రోడ్డుపై వెళ్తున్న కారును చేయి చూపించి ఓ వ్యక్తి సాయం కోరాడు. బైక్‌ ఆగిపోయింది. కాస్త చూడండి. సాయం చేయమని రిక్వెస్ట్‌ చేశాడు. కారులో ఉన్న వ్యక్తి మానవతధృక్పథంతో కారు దిగి సాయం చేయడానికి రోడ్డుపై ఆగిపోయిన బైక్‌ను కదిలించేందుకు ప్రయత్నం చేశారు. బైక్ స్టార్ట్ చేసుకున్న వ్యక్తులు థాంక్స్ చెప్పి అక్కడి నుంచి జారుకున్నారు.

  Telangana : మొదటి భార్య సమాధి దగ్గర భర్త ఆత్మహత్య .. అంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటంటే..  సాయం చేసే లోపే మోసం..
  కారు దిగి బైక్‌ ఆపిన వ్యక్తికి సాయం చేసేలోపే సాయం కోరిన దుర్మార్గులు తమ చోర కళను ప్రదర్శించి సదరు వ్యక్తి జేబులోని పర్సు, సెల్‌ఫోన్‌ కొట్టేసి పారిపోయారు. ఇదంతా బాధితుడు సాయం చేసి తిరిగొచ్చి కారులో ఎక్కుతుండగా జేబులో పెట్టుకున్న సెల్‌ఫోన్‌ తీసుకుందామని చూసుకోగా రెండు మాయం అయిపోయినట్లుగా తెలుసుకొని షాక్ అయ్యాడు. కస్పా బజార్‌లో జరిగిన నయా తరహా చోరీ వీడియో అంతా సీసీ కెమెరాలో రికార్డైంది. ఖమ్మం నగంరలో ఈ తరహా చోరీలు, దొంగతనాలు నిత్యకృత్యంగా మారాయి. రోజు ఏదో ఒకచోట అమాయకులు ఇదే తరహాలో మోసపోతూ విలువైన వస్తువులు, డబ్బులు పోగొట్టుకుంటున్నారు.

  వాహనదారులే టార్గెట్‌...
  ఇలాంటి చోరీలు, దొంగతనాలు చేయడానికే ప్రత్యేకంగా ఓ ముఠా ఏర్పడిందని పోలీసులు భావిస్తున్నారు. వాళ్లంతా హెల్మెట్‌ పెట్టుకుని బండి మీద తిరుగుతూ, ఇంకా తమ ఆనవాళ్లు తెలియనీయకుండా మాస్క్‌ ధరిస్తూ.. బిజీగా ఉండే రహదారుల్లో సాయం కోసం అర్ధిస్తూ.. పాపం అనుకుని వచ్చి సాయం చేసిన వాళ్లనే దోపిడీ చేస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు. ముఖ్యంగా ఈ ముఠా సభ్యులు కేవలం బైక్‌లపైన పెట్రోలింగ్‌ లేని ప్రాంతంలో రెక్కీ నిర్వహించి మరీ తమ వాహనం ఆగిపోయినట్టు నటిస్తారు. రోడ్డుపై వెళ్లే కార్లు, బైకర్‌లను అది కూడా సింగిల్‌గా ఉండే వాళ్లనే సెలక్ట్ చేసుకొని తమ పని పూర్తి చేసుకుంటున్నారు.

  BJP | Jayasudha : బీజేపీలోకి సహజనటి .. ఆ రోజునే జయసుధ పార్టీలో చేరడం ఖాయమని సంకేతాలు  హై ఫైగా చోరీలు, దోపిడీలు..
  చాలా ఫ్యాషన్‌ గా, పోష్‌గా కనిపించే ఈ గ్యాంగ్‌ సభ్యులు రిక్వెస్ట్‌ చేసే తీరు కూడా వేరే ఉంటుంది. తీరా సాయం చేసే సమయంలోనే వాళ్లు మాటల్లో పెట్టి చేతివాటం చూపుతారు. తీరా గమనించారా.. ప్రశ్నించారా..? నిలదీశారా.. గొడవ పడ్డారా..? వీళ్లకు సపోర్ట్‌గా ఫాలో అయ్యే గ్యాంగ్‌ మెంబర్లు అటుగా వస్తున్న అపరిచిత ప్రయాణికుల్లా మాటలు కలిపి, గొడవను సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తారు. ఇంకా తేడావస్తే దాడికి తెగబడతారు. ఇలా ఈ మధ్య కాలంలో ఖమ్మంలో చోటుచేసుకున్న ఘటనల తీవ్రత దృష్ట్యా పోలీసు అధికారులు సైతం పెట్రోలింగ్‌ పెంచాలని ఆదేశించారు. చిన్నచిన్న ఘటనలు చాలా సందర్భాలలో రిపోర్టు కూడా కావడం లేదు. అయినవి కూడా పెద్దగా ఫలితాలను ఇవ్వడం లేదు.ఈ తరహా ముఠాల బారిన పడి ఎందరో నష్టపోయిన వైనం నెమ్మదిగా వెలుగుచూసింది. ఖమ్మం నగరంలో తిరుగుతున్న ఈతరహా దొంగల ముఠా మోసానికి బలికావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Khammam, Telangana crime news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు