(జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్, న్యూస్ 18 తెలుగు, ఖమ్మం జిల్లా)
నమ్మించి కారెక్కించుకుని.. తోటి టీచర్ (colleague Teacher)పై అత్యాచారానికి పాల్పడిన ఉపాధ్యాయుడు అతను ఓ ఉపాధ్యాయుడు 9Teacher). పైగా ఆ కామాంధుడు ఉపాధ్యాయ సంఘానికి నాయకుడు కూడా. కానీ బుద్ధి మాత్రం ఛండాలం. తోటి మహిళా ఉపాధ్యాయినిపై కొన్నాళ్లుగా కన్నేసిన ఆ కీచక ఉపాధ్యాయుడు అదను కోసం చూశాడు. ఆమెను నమ్మించి తన కారు ఎక్కించుకున్నాడు. గుడ్డిగా నమ్మిన ఆమె అతని మాటలు నమ్మింది. వచ్చే స్టేజిలో తన భార్య కూడా కారు ఎక్కుతుంది అన్న అతని మాయమాటలను ఆమె నమ్మింది. ఆనక ఓ ఇంటికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి (Rape on Teacher) పాల్పడ్డాడు.
తనకు జరిగిన అన్యాయానికి ఆమె కుంగిపోయింది. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. పైగా ఎవరికైనా చెబితే చంపేస్తానన్న (Kill) ఆ కీచకుని బెదిరింపులు గుర్తొచ్చి ఆగపోయింది. ఎట్టకేలకు ధైర్యం చేసి భర్తకు (Told to Husband) చెప్పుకుంది. భర్త సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొలీగ్ (colleague) అన్న ఇంగితం కూడా లేకుండా ఆమెపై అతను దారుణంగా ప్రవర్తించాడు. మృగంలా ఆమెపై పడి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిందని తెలియగానే నిందితుడు పరారీలో ఉన్నాడు.
ఖమ్మం (Khammam) అర్బన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న ఈ కేసు వివరాలు పరిశీలిస్తే బాణోత్ కిషోర్ అనే టీచర్ మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా గార్ల మండలం అంకన్నగూడెం స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య కూడా టీచర్‌గానే పనిచేస్తోంది.. అతను ఓ ఉపాధ్యాయ సంఘానికి మండల అధ్యక్షునిగా కూడా ఉన్నాడు. కిషోర్ దంపతులు ఖమ్మంలో నివాసం ఉంటూ రోజూ కారులో స్కూలుకు వెళ్లొస్తుంటారు. ఇలాగే మరో ఉపాధ్యాయిని సైతం ఖమ్మం నుంచే ఈ స్కూలుకు వెళ్తుంటారు. ఒకరోజు బస్సు కోసం ఎదురుచూస్తున్న ఆమెను తన కారులో ఎక్కాలంటూ కిషోర్ అడిగాడు. ఆమె తొలుత నిరాకరించడంతో తన భార్య కూడా వచ్చే స్టేజిలో కారులో ఎక్కుతుందని, ఆమెకు ఎలాంటి సమస్య లేదని నమ్మబలికి కారులో ఎక్కించుకున్నాడు.
చెబితే ఆమె భర్త, పిల్లలను చంపేస్తానని..
అనంతరం ఆమెను పాండురంగాపురంలోని ఓ ఇంటికి తీసుకెళ్లి కామాంధుడు అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బహిర్గతం చేస్తే ఆమె భర్త, పిల్లలను చంపేస్తానని బెదిరించాడు. తనకు జరిగిన అన్యాయంపై ఆమె భర్తతో కలసి ఖమ్మం అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాధితురాలు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందని తెలియగానే కామాంధుడు పరారయ్యాడు. దీంతో అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. .
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Khammam, Mahabubabad, RAPE, Warangal