హోమ్ /వార్తలు /తెలంగాణ /

Injection Murder: తెలంగాణలో మరో సూది మందు హత్య.. భార్యపై ప్రయోగించిన భర్త.. ఎందుకంటే..?

Injection Murder: తెలంగాణలో మరో సూది మందు హత్య.. భార్యపై ప్రయోగించిన భర్త.. ఎందుకంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో మరో సూది మంది హత్య (Injection Murder) వెలుగు చూడటం సంచలనం రేకెత్తిస్తోంది. 4 రోజుల క్రితం చింతకాని మండలంలో కలకలం రేపిన హత్యను మరవక ముందే అదే తరహలో జరిగిన మరో మర్డర్ వెలుగు చూడటం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Khammam, India

    తెలంగాణలో మరో సూది మంది హత్య  (Injection Murder) వెలుగు చూడటం సంచలనం రేకెత్తిస్తోంది. 4 రోజుల క్రితం చింతకాని మండలంలో కలకలం రేపిన హత్యను మరవక ముందే అదే తరహలో జరిగిన మరో మర్డర్ వెలుగు చూడటం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం...భిక్షం అనే వ్యక్తి తన రెండో భార్యను (Second wife) హత్య చేసేందుకు ఈ ప్లాన్ అమలు చేశాడు. ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి డెలివరీ కోసం రెండో భార్యను తీసుకెళ్లిన భిక్షం.. సెలైన్ బాటిల్లో పాయిజన్ ఇంజెక్షన్ ఎక్కించాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే ఆమె మృతి చెందింది.  ఖమ్మం (Khammam) జిల్లాలో 50 రోజుల క్రితం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  పూర్తి వివరాల్లోకి వెళితే.. ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాకు చెందిన భిక్షం నగరంలోని ఓ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా, అనస్థీషియా వైద్యుడి వద్ద సహాయకుడిగా పనిచేస్తున్నాడు.

    చాలా ఏళ్ల కిందటే భిక్షానికి మొదట తన మేనకోడలితో వివాహం అయ్యింది. అయితే వీరికి పిల్లలు పుట్టలేదు. దీంతో భిక్షం మరో వివాహం చేసుకోవాలనుకున్నాడు. తనకంటే ఇరవై ఏళ్ల చిన్నది అయిన నవీన (23)ను రెండో పెళ్లి చేసుకున్నాడు. కొద్దిరోజులు ముగ్గురూ అన్యోన్యంగానే ఉన్నారు. నవీనకి పాప పుట్టింది. తర్వాత సవతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే నవీన రెండోసారి గర్భం దాల్చింది. గొడవలతో విసిగిపోయిన భర్త భిక్షం భార్య నవీనను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.

    ఆస్పత్రిలోనే నవీన మృతి..

    జూలై 30న నవీన ప్రసవంకోసం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో భిక్షం చేర్పించాడు. నవీనకు ఆడ శిశువు పుట్టింది.  అప్పుడే దుర్మార్గుడు భిక్షం తన పథకం అమలు చేశాడు. మరుసటి రోజు తెల్లవారేసరికి నవీన ఆస్పత్రిలోనే చనిపోయింది. సరిగ్గా వైద్యం చేయకపోవడం వల్లే తన భార్య చనిపోయిందంటూ తన బంధువులతో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగాడు భిక్షం. నవీన హఠాత్తుగా ఎందుకు చనిపోయింది అర్థం కాని వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది తీవ్ర ఆందోళన చెందారు. బిక్షం కూతుర్లు ఇద్దరికీ ఆర్థిక సాయం చేస్తామని సదరు ఆస్పత్రి యాజమాన్యం హామీ ఇచ్చింది. ఆందోళన విరమించిన భిక్షం నవీన మృతదేహాన్ని ఊరికి తీసుకు వెళ్ళకుండా ఖమ్మంలోనే స్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశాడు. నవీన అంత్యక్రియలను ఖమ్మంలో నిర్వహించడంతో ఆసుపత్రి సిబ్బందిలో అనుమానం మొదలైంది.

    హాస్పిటల్ లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. ప్రసవం జరిగిన రోజు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో బిక్షం తన భార్యకు ఇంజక్షన్ ఇవ్వడం, ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత బయటకు వెళ్లి హడావిడి చేయడం కనిపించాయి. నిర్ఘాంతపోయిన ఆస్పత్రి యాజమాన్యం ఖమ్మం టూ టౌన్ పోలీస్ లను సంప్రదించింది. స్వాతంత్ర వజ్రోత్సవాలు, వినాయక చవితి నేపథ్యంలో ఈ విషయాన్ని పోలీసులు లైట్ తీసుకున్నారు. ఇటీవల భిక్షంను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా… అసలు విషయం బయటపడింది. నవీనకు ఇంజక్షన్ ద్వారా అధిక మోతాదులో మత్తుమందు ఇచ్చి చంపినట్లు ఒప్పుకున్నాడు. రెండు వారాల క్రితమే పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.

    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Khammam, Murder

    ఉత్తమ కథలు