హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Politics: తెలంగాణలో వినూత్న రాజకీయం.. బీజేపీ కార్యకర్త కుటుంబీకులను ఓదార్చనున్న కాంగ్రెస్​ నేతలు

Telangana Politics: తెలంగాణలో వినూత్న రాజకీయం.. బీజేపీ కార్యకర్త కుటుంబీకులను ఓదార్చనున్న కాంగ్రెస్​ నేతలు

బండి సంజయ్, రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

బండి సంజయ్, రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రెండు రోజుల కిందటే ఈ కేసులు, వేధింపులు భరించలేక ఖమ్మంలోని బీజేపీ కార్యకర్త సాయి గణేశ్​ మృతిచెందిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో  సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పిన మాటలు తెలంగాణ రాజకీయాల్లో చర్చలకు దారి తీశాయి.

ఇంకా చదవండి ...

తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) వినూత్న టర్న్​ తీసుకుంటున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా తెలంగాణ కాంగ్రెస్​ పావులు కదుపుతోంది. ఇప్పటికే ఆయా పార్టీల కార్యకర్తలపై అధికార పార్టీ టీఆర్​ఎస్ (TRS)​ కేసులు పెడుతూ వేధిస్తోందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రెండు రోజుల కిందటే ఈ కేసులు, వేధింపులు భరించలేక ఖమ్మం(Khammam)లోని బీజేపీ కార్యకర్త సాయి గణేశ్​ మృతిచెందిన (sai ganesh Suicide) సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) చెప్పిన మాటలు తెలంగాణ రాజకీయాల్లో చర్చలకు దారి తీశాయి.

మా వల్ల ఓ తల్లి కొడుకు చనిపోయాడు అన్న ఫీలింగ్ టీఆర్ఎస్ నాయకులకు లేదని.. పోలీసుల భయం కూడా వారికి లేదని  ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. డీజీపీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ఆయన ప్రశ్నించారు.   ఈ నెల 21న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth reddy), సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), తాను ఖమ్మం వెళ్తున్నట్టుగా (Visit) చెప్పారు. కాంగ్రెస్ నేతలపై పెట్టిన పీడీ యాక్ట్ కేసుల సంగతి తెలుస్తానని వ్యాఖ్యానించారు. ఖమ్మలో ఎం చేస్తాం అనేది చూపిస్తామన్నారు. తమ పార్టీ నాయకుల పై కేసులు పెట్టిన పోలీసుల పై దండయాత్ర చేస్తామని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త (BJP Activist) కుటుంబంను కూడా పరామర్శిస్తామని చెప్పారు.  పార్టీ కార్యకర్త లా కాకుండా.. సాధారణ పౌరుడిగా పరామర్శ చేస్తానని జగ్గారెడ్డి తెలిపారు.

నిరుద్యోగం, రైతుల ధాన్యం తదితర సమస్యలున్నా..

అయితే ఓ పార్టీ కార్యకర్త ఇంటికి మరో పార్టీ నాయకులు వెళ్లి పరామర్శించడం అరుదుగానే జరిగేది. ఇప్పటికే దీనిపై బీజేపీ సీబీఐ డిమాండ్​ చేస్తూ అధికార పార్టీని ఇరుకున పెట్టింది. ఇపుడు కాంగ్రెస్​ కూడా తోడవడంతో బీజేపీ డిమాండ్​ను సమర్థించినట్లు అవుతుంది. ఇది రాజకీయంగా బీజేపీకి విజయం లాంటిదనే చెప్పొచ్చు. అయితే రాష్ట్రంలో నిరుద్యోగం, రైతుల ధాన్యం తదితర సమస్యలున్నా అధికార పార్టీల తీరును కాంగ్రెస్​ తెలంగాణ ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లలేకపోయిందనే విమర్శలు ఉన్నాయి. ఇది కాదని నేరుగా బీజేపీ కార్యకర్త ఇంటికి వెళ్లడం అది మరోవిధంగా బీజేపీకి మైలేజీ ఇచ్చేదిగానే ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.

CBI విచారణకు బీజేపీ డిమాండ్​..

మరోవైపు  ఖమ్మం (Khammam)లో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్యపై CBI విచారణ జరిపించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌(Tamilisai Soundararajan )ను బీజేపీ నేతలు కోరారు. బుధవారం ఉదయం రాజ్ భవన్ లో గవర్నర్ తో BJP నేతలు భేటీ అయ్యారు. ఈ మేరకు గవర్నర్ కు వినతిపత్రం సమర్పించారు.

సాయి గణేశ్​ (Sai Ganesh) ఆత్మహత్యకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిరసనలు చేపట్టింది. అదేవిధంగా ప్రజా సంగ్రామ యాత్ర (Praja Sangrama Yatra) నిర్వహిస్తున్న బండి సంజయ్ నిరసన దీక్షలో పాల్గొన్నారు. తెలంగాణ (Telangana) రాష్ట్రంలో నిజాం పాలన (Nizam regime)లో అరాచకాలు (anarchy) ఎలా ఉండేవో అదే తరహలో అరాచకాలు టీఆర్​ఎస్​ పాలన (TRS regime)లో ఉన్నాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (BJP Telangana state president Bandi Sanjay) ఆరోపించారు.

First published:

Tags: Bhatti Vikramarka, Jagga Reddy, Khammam, Revanth Reddy, Telangana bjp, TS Congress

ఉత్తమ కథలు