హోమ్ /వార్తలు /తెలంగాణ /

Tribal Hostels: వీళ్ల తలరాత మారదా? ఆశ్రమ హాస్టళ్లలో అన్నంలో పురుగులు.. అర్ధాకలితో విద్యార్థినులు.. 

Tribal Hostels: వీళ్ల తలరాత మారదా? ఆశ్రమ హాస్టళ్లలో అన్నంలో పురుగులు.. అర్ధాకలితో విద్యార్థినులు.. 

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆశ్రమ హాస్టళ్లు  (Ashram Hostels నిర్లక్ష్యానికి నెలవులుగా మారాయి. ప్రభుత్వం దండిగా నిధులిస్తున్నా, పర్యవేక్షణ లోపం వల్ల ప్రభుత్వ ఆశయం నీరుగారిపోతోంది. ఉన్నతాధికారులు ఎన్ని సార్లు తనిఖీలు జరిపినా ఫలితం కనిపించడం లేదు.

  • News18 Telugu
  • Last Updated :
  • Khammam, India

    (G. Srinivas Reddy, News18, Khammam)

    ఆశ్రమ హాస్టళ్లు  (Ashram Hostels నిర్లక్ష్యానికి నెలవులుగా మారాయి. ప్రభుత్వం దండిగా నిధులిస్తున్నా, పర్యవేక్షణ లోపం వల్ల ప్రభుత్వ ఆశయం నీరుగారిపోతోంది. ఉన్నతాధికారులు ఎన్ని సార్లు తనిఖీలు జరిపినా ఫలితం కనిపించడం లేదు. దీంతో సాక్షాత్తూ రాష్ట్ర హైకోర్టు (High court) హాస్టళ్లను తనిఖీ చేయాల్సిందిగా ఆదేశించాల్సి వచ్చింది. దీంతో ఇల్లెందు కోర్టు జడ్జి ముఖేష్కుమార్ సంక్షేమ హాస్టల్ ను తనిఖీ చేసి రిపోర్ట్ పంపారు. విద్యార్దులకు అందించే ఆహారం మొదలు .. నిద్రపోయే స్థలం దాకా ఏవీ ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేల్చారు. దీన్ని బట్టే వసతి గృహాల దీనస్థితిని అర్దం చేసుకోవచ్చు.

    ఖమ్మం (Khammam) జిల్లా కామేపల్లి మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో (Tribal Ashram Girls School) ప్రతిరోజు పురుగులు ఉన్న అన్నం పెట్టడంతో బాలికలు (Girl) అన్నం తినకుండా పస్తులు ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్న విషయం వార్డెన్ వసంతకు బాలికలు తెలిపినా పురుగుల పక్కకు పడేసి మిగిలిన అన్నం తినమని చెప్పేదని విద్యార్థులు వాపోయారు. అన్నంతో పాటు కిచిడీ రుచిగా ఉండదని నీటి సౌకర్యం మంచిగా లేదని దాంతో పిల్లలకు ఎలర్జీ వచ్చి బాధపడుతున్నారని తెలిపారు.

    గత పది సంవత్సరాల నుండి వార్డెన్ గా పనిచేస్తున్న వ్యక్తి పిల్లల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తూ మౌలిక సదుపాయాలు కల్పించకుండా తనకు నచ్చినట్లు వ్యవహరిస్తుందని పిల్లలు ఆవేదనతో అన్నారు. మెనూ కూడా సక్రమంగా పాటించకుండా ఆమెకు నచ్చినట్లు చేస్తూ పిల్లలకు పుష్టికరమైన ఆహారం అందించకుండా చేస్తోంది. పిల్లలు వారి తల్లిదండ్రులకు వార్డెన్​ గురించి తెలపడంతో తల్లిదండ్రులు వచ్చి పిల్లలకు పెట్టె భోజనం వసతులు చూసి ఆవేదనకు గురయ్యారు. చదువు కొని ఉన్నత విద్యావంతులయ్యే బాలికల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వార్డెన్ వసంతను తక్షణమే తొలగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

    Elections: మంత్రి కేటీఆర్ ఇలాకాలో రసవత్తరంగా ఆటో యూనియన్ ఎలక్షన్.. పూర్తి వివరాలివే 

    వార్డెన్ వసంత సమయపాలన పాటించకుండా ఇష్టం వచ్చినప్పుడు హాస్టల్ కు వచ్చి వెళ్తుందని విద్యార్థులు తెలిపారు. మీడియాని సైతం లోపలికి రాకుండా గేటుకు తాళం వేసి హాస్టల్ వార్డెన్​ లోపల వారికి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ లోపల జరిగే విషయాలను బయటకు తెలియనివ్వకుండా విద్యార్థులను అదుపులో పెట్టుకొని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని హాస్టల్ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి హాస్టల్లో మౌలిక వసతులపై దృష్టి పెట్టి సరైన భోజనం కల్పించి వార్డెన్ వసంత పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు

    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Hostel students, Khammam, Telangana students

    ఉత్తమ కథలు