Home /News /telangana /

KHAMMAM SON IN LAW FROM KHAMMAM COMPLAINED TO THE HUMAN RIGHTS COMMISSION THAT HIS UNCLE HAD COMMITTED CRIMES AND WAS BLAMING HIM PRV KMM

Khammam: మా మామ నేరాలు చేసి నా మీద తోస్తున్నాడు.. నన్ను కాపాడండంటూ ఖమ్మంలో ఓ అల్లుడి ఆవేదన

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

అతని మామ పైరవీలు చేస్తూ పెద్ద మనిషిగా చలామణి అవుతుంటాడు. చిన్నచిన్న పంచాయతీలు చేస్తుంటాడు. ఇప్పుడదే అల్లుడికి శాపంగా మారింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Khammam, India
    (Srinivas reddy, News18, Khammam)

    వట్టికొండ శ్రీనివాసరావు (V. srinivasa rao). ఇతను పైరవీలు చేస్తూ పెద్ద మనిషిగా చలామణి అవుతుంటాడు. చిన్నచిన్న పంచాయతీలు చేస్తుంటాడు. ఇప్పుడదే అల్లుడికి శాపంగా మారింది. ఏకంగా పోలీస్టేషన్​ గడప ఎక్కాల్సిన పరిస్థితి తలెత్తింది. కొన్నాళ్ల క్రితం ఓ భార్యభర్త విడాకుల పంచాయతీలో భర్త ఇచ్చిన పరిహారం రూ.15 లక్షలను తన వద్దే డిపాజిట్‌గా పెట్టుకున్నాడు. పంచాయతీ పూర్తయ్యేలోగా, ఇరుపక్షాల సమక్షంలో ఆ  మొత్తాన్ని భార్యకు అందించడం ఒప్పందం. అయితే చేతిలో డబ్బు ఉండడంతో శ్రీనివాసరావు సొంతానికి వాడేసుకున్నాడు. తీరా విడాకుల గొడవలో ఇరుపక్షాలు వాళ్లే మాట్లాడుకుని సెటిల్‌ చేసుకున్నారు. నీ వద్ద డిపాజిట్‌గా పెట్టిన డబ్బు ఇవ్వమని అడిగారు. సొంతానికి వాడేసుకున్న శ్రీనివాసరావు చేతులెత్తేశాడు. విషయం పోలీసుల దాకా పోయింది. అయితే బ్యాంకులో ఉద్యోగం (Job in bank) చేస్తున్న తన అల్లుడు (Son in law) డబ్బులు చెల్లించగలడని శ్రీనివాసరావు స్టేషన్‌లో నమ్మబలికాడు. ఇంకేముంది.. ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న శ్రీనివాసరావు అల్లుడు వల్లభనేని సంపత్‌బాబును (Sampath babu) బాధితులు పోలీసుస్టేషన్‌కు పిలిపించారు.

    మీ మామ (Uncle) వాడుకున్న డబ్బులు (Money) కట్టి పొమ్మని పోలీసులు వాళ్ల పద్దతిలో ఆల్టిమేటం ఇచ్చారు. దీంతో తనకు ఏ పాపం తెలీదని, తనను ఇబ్బంది పెట్టొద్దని మొత్తుకున్నా వినకుండా డబ్బు కట్టాల్సిందేనని ఇబ్బంది పెడుతున్నారని సంపత్‌ ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నాడు. అయినా ఫలితం లేకపోగా, చివరకు తనను వేధిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను సంపత్‌బాబు ఆశ్రయించాడు.  ఖమ్మం జిల్లాలో ఈ ఘటన జరిగింది.



    ఫిర్యాదులో ఏం చెప్పాడంటే..?

    తన మామ వాడుకున్న డబ్బులు నన్ను చెల్లించాలని తన మామ శ్రీనివాసరావు, ఖమ్మం (Khammam) పట్టణ పోలీసు అధికారి ఒత్తిడి తెస్తున్నాడని వల్లభనేమని సంపత్ తెలంగాణా రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశాడు. తన మామ చేసిన ఆర్థిక నేరాన్ని తన మీదికి నెడుతూ, ఎటువంటి సంబంధం లేకున్నా డబ్బులు మొత్తం తనను కట్టాలని పోలీసులు గత కొద్ది రోజులుగా తనను, ఆయా బాధితుల పక్షాన ఉంటూ వేధిస్తున్నారని అయన ఆవేదన వ్యక్తం చేశారు.

    Criminal Doctor: ఇతనో రాక్షస వైద్యుడు.. అలా చేస్తే చాలట ఎలాంటి సర్టిఫికెట్​ కావాలన్నా ఇచ్చేస్తాడట..

    మొదటి ముద్దాయిగా చేరుస్తానని  బెదిరింపులు.

    ఈ విషయమై తన మామ బాధిత సంబంధీకులు సైతం గత రెండు రోజులుగా తన ఇంటికి వచ్చి పరుషంగా మాట్లాడుతూ..  నా పరువు తీస్తున్నారని అన్నాడు. ఖమ్మం పట్టణ సి.ఐ చిట్టిబాబు మా ఇంటికి, నేను పని చేస్తున్న బ్యాంక్ కు పోలీసులను పంపటం, నన్ను రోజు పోలీస్ స్టేషన్ కు పిలిపిస్తున్నాడని, తన మామ వాడుకున్న 15 లక్షల రూపాయలు చెల్లించకపోతే ఈ కేసులో మొదటి ముద్దాయిగా చేరుస్తానని  బెదిరిస్తున్నాడని వల్లభనేమని సంపత్ ఆరోపించాడు.

    ఈ విషయమై ఖమ్మం (Khammam) సిటీ పోలీస్ కమిషనర్ ఫిర్యాదు చేయగా, స్థానిక ఏ.సి.పికి విషయం నివేదించమని చెప్పారని తెలిపారు. తన గోడు ఏసీపీ వద్ద వెళ్ళబోసుకున్నా ఫలితం లేకపోవడంతో మానవ హక్కుల సంఘానికి ఈ మెయిల్ ఫిర్యాదు చేసినట్లు సంపత్‌బాబు (Sampath babu) పేర్కొన్నారు. కనీసం విచారణ చేయలేదని, విచారణ జరిపిన అనంతరం నా ప్రమేయం ఉంటే కేసు పెడితే తను ప్రమేయం ఉంటే బాధ్యుడను అవుతానని, కేవలం వట్టికొండ  శ్రీనివాస్ రావు అనే వ్యక్తి తన మామ అయితే ఇలా చేస్తారా అని ప్రశ్నించారు. తను ఒక ప్రయివేటు బ్యాంక్ ఉద్యోగి అయినందున సదరు డబ్బులు తాను అయితే చెల్లించగలను అని ఈ కేసులో బాధితులు ఫిర్యాదు చేసి ఇరికించారని లేఖలో పేర్కొన్నారు. పోలీసులు సైతం అదే పద్దతిలో ఉన్నారని వల్లభనేమని సంపత్ వాపోయాడు. చేయని నేరంలో నన్ను ఇరికించి నా పరువు తీసి, డబ్బులు తనను కట్టమని ఒత్తిడి చేస్తున్నారని వాపోయాడు. ఇలా చేస్తే తన కుటుంబం ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యమని, దీనికి వట్టికొండ  శ్రీనివాస్ రావు బాధితులు, ఖమ్మం సి.ఐ.చిట్టిబాబు బాధ్యత వహించాల్సి వస్తుందని ఈమేరకు మానవ హక్కుల సంఘానికి వల్లభనేమని సంపత్ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Crime news, Khammam, Son in law

    తదుపరి వార్తలు