Home /News /telangana /

KHAMMAM SOFTWARE ENGINEER LEFT THE JOB AND INVENTS SOLAR POWER TRACTOR VRY

Khammam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో సౌత్ ఇండియా హెడ్‌.. అయినా ఆ ఉద్యోగాన్ని వదిలాడు.. ఎందుకంటే

Khammam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో సౌత్ ఇండియా హెడ్‌.. అయినా ఆ ఉద్యోగాన్ని వదిలాడు..

Khammam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో సౌత్ ఇండియా హెడ్‌.. అయినా ఆ ఉద్యోగాన్ని వదిలాడు..

Khammam : అత్యంత ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్న ఓ వ్యక్తి తన వ్యక్తిగత అవసరాలు కోసం చేసే ఉద్యోగాన్ని వదిలాడు.. సాఫ్టేవేర్ ఉద్యోగంలో సౌత్ ఇండియా హెడ్ స్థాయి ఉద్యోగాన్ని వదిలి తన చుట్టూ ఉండే సమాజానికి ఉపయోగపడేలా ఓ గొప్ప ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు.

ఇంకా చదవండి ...
  ( జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్, న్యూస్‌18 తెలుగు, ఖమ్మం జిల్లా)

  అతను వృత్తి రీత్యా ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ప్రవృత్తి రీత్యా ఓ ఎంటర్‌ప్రెన్యూర్‌. మరో ఔత్సాహిక సాంకేతిక వ్యవసాయ శాస్త్రవేత్త అని కూడా చెప్పొచ్చు. అవును అతనికి ఒక కల ఉంది. తన చుట్టూ ఉండే సమాజంలోని చిన్నసన్నకారు రైతులకు ఉపయోగపడేవిధంగా జీరో మెయింటెనెన్స్‌తో ఓ ట్రాక్టర్‌ తయారు చేయాలన్నదే. కొన్ని నెలలుగా చేస్తున్న అతని ప్రయత్నాలు దాదాపు ఫలితాన్నిచ్చాయనే చెప్పొచ్చు. సాధారణంగా ఉండే ట్రాక్టర్‌ టాప్‌కు సోలార్ ప్లేట్లను అమర్చి వాటి ద్వారా ఇంజిన్‌ స్థానే ఉంచిన పెద్దపెద్ద బ్యాటరీలను రీఛార్జి చేయడం ద్వారా ట్రాక్టర్‌కు శక్తిని అందిస్తున్నారు. ఇలా మొదటి స్టెప్ విజయవంతమైంది. ట్రయల్‌ రన్‌ కూడా వేశారు.

  ఓకే. సూపర్. ఇంకా దాన్ని తాను అనుకున్న విధంగా వృద్ధి చేసే పనిలో నిమగ్నమయ్యారు. దీనికోసం అతను తన ఒరాకిల్‌ జాబ్‌ను వదుకున్నారు. సౌత్‌ఇండియా హెడ్‌గా ఉన్న తన పొజిషన్‌ను సైతం పక్కన పెట్టి తన కలను సాకారం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. నిజానికి ఇది ఇతని ఒక్కడి కల మాత్రమే కాదు. ప్రపంచంలో అనేకమంది కల. అనేక పెద్ద పెద్ద ఆటోమొబైల్‌ సంస్థలు విశ్రమించకుండా చేస్తున్న పని ఒకటే. తరగని ఇందన వనరులను ఉపయోగించుకునే విధంగా ఇంజిన్‌లను రూపొందించడం. దిగ్గజ సంస్థలైన వరల్డ్‌ టాప్‌ కంపెనీ టెస్లా మొదలు మనదేశంలో ప్రసిద్ధ సంస్థలైన టాటా, మహీంద్ర, ఎస్కార్ట్స్‌ ఇంకా హీరో దాకా అన్నీ దాదాపు ఈవీ సెక్టార్‌లో పరిశోధనలను ముమ్మరం చేస్తున్నాయి.

  Khammam : ఖమ్మంలో మరో అధికార పార్టీ నేత హంగామా.. అప్పుల పేరుతో అర్థరాత్రి పూట బెదిరింపులు

  రాము స్వస్థలం వైరా. ఖమ్మం జిల్లా. ఇక్కడే చదువుకున్నారు. సాఫ్ట్‌వేర్‌ సెక్టర్‌లో సక్సెస్‌ చూశారు. తన తెలివితేటలు.. నాలెడ్జ్‌.. తన చుట్టూ ఉండే సమాజానికి ఉపయోగపడేలా ఏదో ఒకటి చేయాలనుకున్నారు. దీనికోసం అప్పటిదాకా తాను పనిచేసిన ఒరాకిల్‌ సంస్థలో తనకున్న ఉద్యోగాన్ని సైతం ఒదులుకున్నారు. సొంతంగా ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ రన్‌ చేస్తున్నారు. కానరక్స్‌ పేరిట రన్‌ చేస్తున్న ఈ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ద్వారా కొందరికి ఉపాధి చూపుతున్నారు. దీనికితోడు తన కలకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌ రూపొందిస్తూ ముందుకెళుతున్నారు.

  చిన్నచిన్న కమతాలలో సాగు చేసే సన్నకారు రైతులకు పనికొచ్చేలా పూర్తిస్థాయి సోలార్‌ ఆధారిత ట్రాక్టర్‌ను రూపొందించాలన్నదే తన లక్ష్యం అని రాము చెప్పారు. తన ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలపై రాము 'న్యూస్‌18 తెలుగు' ఖమ్మం జిల్లా ప్రతినిధితో మాట్లాడుతూ మానవ ఆధారిత శ్రమ రానురాను మరింత ప్రియం అవుతున్న కారణంగా ప్రతి రైతు తప్పనిసరిగా మెకనైజేషన్‌ను పోవాల్సి ఉందన్నారు. దీనికోసం ట్రాక్టర్‌ లాంటి దానితో ఎన్నో పనులు చేసుకోగలిగినా, చిన్నసన్నకారు రైతులకు ఇది భరించలేని స్థాయిలో వ్యయాన్ని కలిగిస్తున్నదన్నారు.

  Khammam : ఇది కదా.. భోగి సంబరాలంటే.. డూడూ బసవన్నలతో రైతు బంధు సంబరాలు..!

  దీనికి విరుగుడుగానే తాను కంప్లీట్‌ సోలార్‌ ఆధారిత ఇంజిన్‌ను రూపొందిస్తున్నట్టు చెప్పారు. ఒక్కసారి ఛార్జి అయితే కనీసం పదిగంటలు పనిచేసేలా శక్తి నిల్వ కెపాసిటీని పెంచుతున్నట్టు చెప్పారు. ఇప్పుడొస్తున్న సోలార్‌ ప్లేట్‌లు క్లౌడీగా ఉన్న వాతావరణంలోని వేడిని కూడా శక్తిగా మలచుకోగలదని.. ఇక దీన్ని నిల్వ చేసుకోవడంలోనే మన సక్సెస్‌ ఇందన్నారు. సాధారణంగా ఇప్పుడు అందుబాటులో ఉన్న అన్ని ట్రాక్టర్‌ల లానే తాను రూపొందిస్తున్న సోలార్‌ ఆధారిత ట్రాక్టర్ కూడా అదే కెపాసిటీతో నడుస్తుందన్నారు.

  నాగలి, గొర్రు దున్నడం, బరువులు లాగడం లాంటి వాటిలో ఎక్కడా తేడా రాకుండా చూస్తున్నట్టు చెప్పారు. పూర్తిగా. వ్యవసాయం కోసమే ప్రస్తుతం తాను రూపొందిస్తున్న ట్రాక్టర్‌ ఉంటుందన్నారు రాము. దీనికోసం రాము కనరాక్స్‌ అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీని స్థాపించి నిర్వహిస్తున్నారు. తన ఇంటినే ఆఫీసుగా, పరిశోధనశాలగా మలచి శ్రమిస్తున్నారు రాము. రాము కల ఫలిస్తే చిన్నసన్నకారు రైతులకు తక్కువ ఖర్చుతో, నిర్వహణ వ్యయం తక్కవయ్యే ట్రాక్టర్‌ దగ్గరైనట్టే.
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Khammam, Telangana

  తదుపరి వార్తలు