Home /News /telangana /

KHAMMAM RELATIVES WHO COMPETED TO DANCE IN A WEDDING BARAT IN KHAMMAM DISTRICT WERE BEATEN UP SNR KMM

Telangana : డీజే సౌండ్‌కి డ్యాన్స్ చేయడం కోసం ఫైటింగ్ .. పెళ్లి బరాత్‌లో కత్తులు దూసుకున్నబంధువులు

wedding fight

wedding fight

Telangana: అప్పుడే పెళ్లి జరిగింది. అందరూ సంతోషంగా ఉన్నారు. పెళ్లికొడుకు, పెళ్లికుమార్తెతో బరాత్‌ మొదలైంది. డీజే సౌండ్స్‌కి అందరూ జోష్‌లో ఉన్నారు. ఈగ్యాప్‌లోనే చిన్న గొడవ మొదలై చివరకు కత్తులతో పొడుచుకునే వరకు వెళ్లింది. అసలు పెళ్లికి వచ్చిన వాళ్లంతా దేనికి కొట్టుకున్నారో తెలిసి పోలీసులే షాక్ అయ్యారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Khammam, India
  (G.SrinivasReddy,News18,Khammam)
  ఎక్కడైనా పెళ్లిలో జరిగిన సంఘటనలు సరదాగా నాలుగు రోజులు చెప్పుకునే విధంగా ఉంటాయి. కాని ఖమ్మం(Khammam)లో జరిగిన ఓ పెళ్లి వేడుక(wedding ceremony)మాత్రం నాలుగు రోజులు కాదు సంవత్సరాల తరబడి గుర్తుండిపోతుంది. పగిలిన తలలు, చిందిన నెత్తురు మరకలతో పెళ్లి ఊరేగింపును యుద్ధభూమిగా మార్చేశారు ఇరువర్గాల బంధువులు. తగిలిన గాయాలు తగ్గిపోయినా ..జన్మజన్మలకు గుర్తుండిపోయే విధంగా కొట్టుకున్నారు పెళ్లికి వచ్చిన అమ్మాయి, అబ్బాయి తరపు బంధువులు. అసలు గొడవ ఎందుకు జరిగిందో తెలిస్తే అందరూ షాక్ అవుతారు.

  Telangana : మునుగోడు టీఆర్ఎస్‌ అభ్యర్ధిగా మూడో సారి ఆయనే .. బహిరంగసభలో కేసీఆర్ ప్రకటించే ఛాన్సు  డ్యాన్స్‌ కోసం ఫైటింగ్ ..
  ఖమ్మం జిల్లా చింతకాని మండలం నామవరంలో ఓ పెళ్లిలో ఊహించని సంఘటన స్థానికుల్ని భయబ్రాంతులకు గురి చేసింది. అప్పుడే పెళ్లి జరిగింది. అమ్మాయి, అబ్బాయి తరపు బంధువులు, స్నేహితులు అందరూ సంతోషంగా గడిపారు. వివాహ వేడుక ముగియగానే అందరూ భోజనాలు చేశారు. ఇక తీరిగ్గా పెళ్లికొడుకు, పెళ్లికుమార్తె ఊరేగింపు మొదలైంది. డీజే సౌండ్స్‌ దద్ధరిల్లిపోతున్న వేళ.. మేము డ్యాన్స్‌ చేయాలంటే మేం చేస్తామంటూ ఒకరికి ఒకరు భీష్మించుకున్నారు. కాస్త మర్యాద ఇవ్వాలి కనుక, పెళ్లికొడుకు తరపు వాళ్లు మొదట డ్యాన్స్‌ చేస్తామన్నారు. ససేమిరా కుదరదు.. మేం తగ్గేదే లేదన్నారు పెళ్లికుమార్తె తరపు బంధువులు.


  డీజే సౌండ్‌ ఓవైపు మద్యం కిక్కు మరోవైపు..
  అంతే ఆ టాపిక్‌ దగ్గర మొదలైన రచ్చ జగడంగా మారింది. రెండు వర్గాలు తిట్టుకున్నారు. అంతటితో శాంతించకుండా కర్రలు, కత్తులు తీసుకొని ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. పెళ్లికి వచ్చిన వాళ్లంతా కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాని రీతిలో కొట్లాట జరిగింది. మద్యం సేవించిన బ్యాచ్‌లు ఎవరిని కొడుతున్నారో.. ఎందుకు కొడుతున్నారో అర్థం కాని రీతిలో గందరగోళం చోటుచేసుకుంది. ఈ గొడవలో కొందరి తలలు పగిలాయి. దాడిలో జిల్లేపల్లి వెంకటరావమ్మ కుమారుడు గోపి, జిల్లేపల్లి నాగేంద్రరావులకు తీవ్ర గాయాలయ్యాయి. చివరకు గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.

  Telangana : ఇప్పుడే వస్తానని తల్లిని బస్టాండ్‌లో వదిలి వెళ్లాడు .. 10రోజుల తర్వాత ఆ తల్లి పరిస్థితి ఎలా ఉందంటే  బరాత్‌లో రణరంగం..
  పెళ్లి బరాత్‌లో గాయపడిన వాళ్లను ట్రీట్‌మెంట్ కోసం ఆసుపత్రికి తరలించారు. దాడులకు పాల్పడిన వాళ్లు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ విధంగా హాయిగా సాగిన పెళ్లి వారి ఇంట్లో మోగిన డీజే సౌండ్‌ పోలీసుస్టేషన్, ఆసుపత్రి వరకు వినిపించాయి. పెళ్లి ఊరేగింపులో ఇంత గలాటా జరిగితే నూతన జంట మాత్రం ఏం పట్టనట్లుగా ముచ్చట్లు చెప్పుకోవడం చూసిన గ్రామస్తులు కథ కథలుగా చెప్పుకుంటున్నారు.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Khammam, Telangana News, Wedding

  తదుపరి వార్తలు