తెలంగాణ(Telangana)లోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలపై రోజు రోజుకు విమర్శలు పెరుగుతున్నాయి. విద్యార్ధినులకు భోజన సౌకర్యాల సంగతి పక్కన పెడితే సంరక్షణ కూడా లేకుండాపోతోందనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. తాజాగా ఖమ్మం(Khammam) జిల్లా మధిర(Madhira)లోని మహాత్మ జ్యోతిబాపులే బీసీ గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. పదవ తరగతి చదువుతున్న బాలికల్ని ప్రిన్సిపల్( Principal) విచక్షారహితంగా కొట్టడంతో అమ్మాయిల శరీరాలు కమిలిపోయాయి. స్టూడెంట్స్‌ను ప్రిన్సిపల్ అకారణంగా కొట్టడంతో విద్యార్ధినులు ఆందోళనకు దిగారు. విషయాన్ని జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. హాస్టల్‌లో భోజనం కూడా సరిగాపెట్టడం లేదని ఆరోపిస్తున్నారు స్టూడెంట్స్.
ప్రిన్సిపాల్ దాష్టీకం..
ప్రభుత్వం పేద విద్యార్దులకు సంరక్షణ కల్పిస్తూ విద్యాబుద్ధులు చెప్పేందుకు ఏర్పాటు చేసిన సంక్షేమ హాస్టళ్లలో భద్రత కరువైపోతోంది. ఖమ్మం జిల్లా మధిరలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో జరిగిన దారుణ సంఘటనే ఇందుకు నిదర్శనంగా మారింది. ఈ హాస్టల్‌లో ఉంటూ పదవ తరగతి చదువుతున్న విద్యార్ధినులను ప్రిన్సిపల్ అకారణంగా చితకబాదడం సంచలనంగా మారింది. అమ్మాయిలని కూడా చూడకుండా కర్రతో కాళ్లు, పిక్కలపై కొట్టడంతో ఎర్రగా కమిలిపోయి గాయలయ్యాయి.
భోజనం కూడా సరిగా పెట్టడం లేదని..
ప్రిన్సిపల్ దాష్టీకాన్ని భరించలేకపోయిన స్టూడెంట్స్ విషయాన్ని బయటపెట్టారు. తమను అనవసరంగా కొట్టినట్లు చెబుతున్నారు విద్యార్ధినులు. తమను కొట్టడానికి కారణం లేదని స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను చితకబాదిన ప్రిన్సిపల్‌పై కఠిన చర్యలు తీసుకొని తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. హాస్టల్ దగ్గర ఆందోళనకు దిగారు విద్యార్ధినులు.
చర్యలకు డిమాండ్ ..
అంతే కాదు గత కొద్ది రోజులుగా హాస్టల్‌లో భోజనం సరిగా పెట్టడం లేదని ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న బాలికలు ఆరోపిస్తున్నారు. కూరలు సరిగా వండకపోవడంతో ..అన్నంలో నీళ్లు పోసుకొని తింటున్నామని కన్నీటిపర్యంతమయ్యారు విద్యార్ధినులు. విద్యార్ధినుల ఆందోళన విషయం తెలుసుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు, స్టూడెంట్స్ తల్లిదండ్రులు గురుకుల పాఠశాల దగ్గరకు చేరుకున్నారు. ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hostel students, Khammam, Telangana News