హోమ్ /వార్తలు /తెలంగాణ /

చిక్కిన చరవాణి చోరులు... ఫోన్లను పంచిన పోలీసులు

చిక్కిన చరవాణి చోరులు... ఫోన్లను పంచిన పోలీసులు

రికవరీ అయిన మొబైల్స్

రికవరీ అయిన మొబైల్స్

ఖమ్మంలో కొంతకాలంగా తాము అపురూపంగా దాచుకున్న ఫోన్లను కోల్పోయిన వారికి పోలీసులు శుభవార్త చెప్పారు. తమ చరవాణులను భద్రంగా వారికే అప్పగించారు.

  • News18
  • Last Updated :

గత కొంతకాలంగా సెల్ఫోన్ మనలో భాగమైంది. అది లేకుంటే బయటకు వెళ్లడం  దాదాపు అసాధ్యం. ఎవరిదగ్గర్నుంచి మనకు ఫోన్ రాకున్నా సరే.. జేబులో మాత్రం స్మార్ట్ ఫోన్ తళతళ మెరవాల్సిందే.  అందుబాటు ధరలలో కంపెనీలు 4 జీ ఫోన్లను అందిస్తుండటంతో చిన్న పిల్లాడి నుంచి పండు ముసలి వరకు వాటిని వాడుతున్నారు. అయితే ఇదే క్రమంలో దొంగలు కూడా తమ చేతివాటం  చూపెడుతున్నారు. ఇలా ఖమ్మం పట్టణంలో  కూడా చాలా మంది ఫోన్లు చోరికి గురయ్యాయి. అయితే..  సైబర్ సెల్, సెంటర్ క్రైమ్ నెట్‌వర్కింగ్ ద్వారా రికవరీ చేసిన సుమారు ఎనిమిది లక్షల విలువ చేసే యాబై ఐదు (55) మొబైల్ ఫోన్లను పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ బాధితులకు అప్పగించారు. గురువారం నూతన పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీసు కమిషనర్ పాల్గొని బాధితులకు వారి ఫోన్లను అప్పగించారు.

గత కొంతకాలంగా నగరంలో చోరికి గురైన, పోగొట్టుకున్న సెల్ఫోన్లను రికవరీ చేయాలని పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఆదేశాలతో సీసీఏస్ ఏసీపీ జహాంగీర్ ఆధ్వర్యంలో సిఐ రవి మరియు సైబర్ క్రైమ్ ఎస్సై రంజిత్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించి 55 సెల్ ఫోన్లను రికవరీ చేశారు.విలువైన వ్యక్తిగత సమాచారం నిక్షిప్తమై వున్న మీ సెల్ఫోన్లను అతి జాగ్రత్త వాడుకోవాలని పోలీస్ కమిషనర్ ఈ సందర్భంగా బాధితులకు సూచించారు. ఈ సందర్భంగా సిసిఎస్,సైబర్ క్రైమ్ పోలీసులను పోలీస్ కమిషనర్ అభినందించారు.

బాధితులకు ఫోన్లను అందజేస్తున్న దృశ్యం..

ఎంతో డబ్బు పెట్టి కొనుగోలు చేసిన ఫోన్లను బాధితుల అజాగ్రత్త కారణంగా లేదా దొంగలు తమ చేతి వాటం ప్రదర్శిచటంతో పోయిన మీ సెల్ ఫోన్లను రికవరీ చేయాలంటే పోలీస్ స్టేషన్ నుంచి సైబర్ క్రైమ్ , కాల్ డేటా అనాలసిస్ బృందాల ద్వారా డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్స్ (డాట్) ఆపరేటర్లు సమయస్పూర్తితో శోదన చేసి పోలీసులకు ఇచ్చే సమాచారం ద్వారా సెంటర్ క్రైమ్ స్టేషన్ , స్దానిక పోలీసు స్టేషన్ నుండి సెల్ ఫోన్‌ను రికవరీ చేయడానికి సాధ్యమవుతుందని, ఇంతటి పక్రియ వుంటుంది కాబట్టి సెల్ఫోన్ వినియోగదారులు తమ ఫోన్లను జాగ్రత్త పెట్టుకొవాలని పోలీసు కమిషనర్ సూచించారు. కార్యక్రమంలో CCS ఏసిపి జహాంగీర్, CI రవి, సైబర్ లాబ్ ఎస్సై రంజిత్ కుమార్ పాల్గొన్నారు.

First published:

Tags: Khammam, Mobiles, Telangana, Telangana Police, TS Police

ఉత్తమ కథలు