Home /News /telangana /

KHAMMAM POLICE HAVE ARRESTED SIX ACCUSED IN THE MURDER CASE OF KHAMMAM TRS LEADER TAMMINENI KRISHNAIAH PRV

Tammineni Krishnaiah Murder: తమ్మినేని హత్య కేసులో కీలక ముందడుగు.. ఆరుగురి అరెస్టు.. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌ నేత తమ్మినేని కృష్ణయ్య (Tammineni Krishnaiah) హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Khammam, India
  ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌ నేత తమ్మినేని కృష్ణయ్య (Tammineni Krishnaiah) హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. కృష్ణయ్యను దారుణంగా హతమార్చిన ఎనిమిది మంది నిందితుల్లో ఆరుగురిని అరెస్టు చేశారు. గురువారం తెల్లవారుజామున వీరిని ఆంధ్రప్రదేశ్‌లో అదుపులోకి తీసుకుని ఖమ్మంకు (Khammam) తలరిస్తున్నారు. కాగా, ప్రధాన నిందితులైన తమ్మినేని కోటేశ్వరరావు, జక్కంపూడి కృష్ణ అనే నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారు. అరెస్టయినవారిలో ఏ2 రంజాన్‌, ఏ4 గంజి స్వామి, ఏ5 నూకల లింగయ్య, ఏ6 బోడపట్ల శ్రీను, ఏ7 నాగేశ్వరరావు, ఏ8 ఎల్లంపల్లి నాగయ్య ఉన్నారు. వారివద్ద హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు.

  విబేధాలు.. ఆధిపత్య ధోరణులు..

  తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్య (Tammineni Krishnaiah murder) ఖమ్మం నగరాన్నే కాదు.. జిల్లాను సైతం ఓ కుదుపు కుదిపేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాను సైతం నివ్వెరపోయేలా చేసింది. అధికార పార్టీకి చెందిన ఓ మండల స్థాయి నేతను పట్టపగలు అత్యంత పాశవికంగా చంపడం (Murder).. అదీ వేట కొడవళ్లతో నరకడం.. పైగా చేతులు నరికి పట్టుకెళ్లడం పట్ల పగలు, ప్రతీకారాలు.. కసి ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒకే ఉమ్మడి కుటుంబంలోని వ్యక్తుల మధ్య పొడసూపిన రాజకీయ (Political) విబేధాలు.. ఆధిపత్య ధోరణులు.. వెరసి నిన్నమొన్నటి దాకా తమలో ఒకడే అయి.. నాలుగు దశాబ్దాలు కలసి నడిచినా.. చివరకు కక్షలకు బలయ్యాడు.

  ఈ హత్యకు ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన ప్రాథమిక సమాచారాన్ని బట్టి, పోలీసు జాగిలం చూపిన దారిని బట్టి చూస్తే ఈ దారుణ హత్య (Brutal Murder) వెనుక ఉన్నది తమ్మినేని కోటేశ్వరరావు అని తేలిపోయింది. నిజానిజాలు, సాక్ష్యాలు, విచారణలు ఎలా ఉన్నా ఆవేశంలో ఉన్న తమ్మినేని కృష్ణయ్య కుటుంబ సభ్యులు, బంధువులు, పార్టీ సానుభూతిపరులు చేసిన దాడిలో సీపీఎం నాయకుడు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోదరుడు తమ్మినేని కోటేశ్వరరావు నివాసం, వాహనాలు ధ్వంసం అయ్యాయి.  ఖమ్మం. ప్రశాంతతకు నిలయం. పెట్టుబడులకు స్వర్గధామం. నాటి ఉమ్మడి రాష్ట్రంలోనూ.. నేటి ప్రత్యేక రాష్ట్రంలోనూ ఖమ్మం జిల్లా అంటే ఓ ప్రత్యేకత. రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని జిల్లాలకు చెందిన ప్రజలు ఇక్కడ హాయిగా ప్రశాంతంగా జీవనం సాగిస్తుంటారు. ఒక్క తెలుగు వాళ్లే కాదు.. పొరుగున ఉన్న చత్తీస్‌ఘడ్‌, ఒడిషా, యూపీ, బీహార్‌, గుజరాత్‌, రాజస్థాన్‌.. ఇలా దాదాపు ప్రతి రాష్ట్రానికి చెందిన వాళ్లూ ఇక్కడ రకరకాల వ్యాపారాలలో సెటిల్‌ అయిపోయారు. ఎవరు ఎవరినీ పెద్దగా ప్రభావితం చేయలేని స్థాయిలో దాదాపు అంతా వాణిజ్యమయం అయిన ఖమ్మంలో ఓ ప్లాటు కొనుక్కుని అమెరికా వెళ్లిపోయి.. పాతికేళ్లకు తిరిగొచ్చినా అక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదన్నది జనం నమ్మకంగా ఉన్న పరిస్థితి. ఇలా ఖమ్మం అనగానే ఓ బ్రాండ్‌లా పేరు పడిపోయంది. మల్టిపుల్‌ పొలిటికల్‌ పార్టీలు ఉండటం.. నేతలు నడిపించిన దారి.. దార్శనికతగా చెప్పుకోవచ్చు. కానీ క్రమంగా ఆ పరిస్థితి మారుతోంది. అక్కడక్కడా కబ్జాలు కామన్‌గా మారాయి. సెటిల్‌మెంట్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆర్థిక అంశాలకు రాజకీయ విబేధాలు తోడవుతున్నాయి. చివరకు ఆధిపత్య పోరాటంలో ఒకరిని ఒకరు దారుణంగా చంపుకునేంతగా పరిస్థితి దిగజారింది. తాజాగా స్వతంత్ర దినోత్సవం నాడు తెరాస నేత తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్య దిగజారిన పరిస్థితికి నిదర్శనం.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Burtally murder, Khammam, Khammam police

  తదుపరి వార్తలు