khammam crime : ప్రియురాలి కోసం యజమానిని డబ్బు డిమాండ్... నిరాకరించడంతో...ఇలా చేశాడు.. !

హత్య జరిగిన ప్రాంతం.. (ఫైల్ ఫొటో)

khammam crime : తన ప్రియురాలిని సంతోషపెట్టడం కోసం ఓ వ్యక్తి గతంలో తాను పని చేసిన యజమానిని కడతేర్చాడు.. అడిగినప్పుడు డబ్బు ఇవ్వలేదని ఆయన మెడలో ఉన్న బంగారంపై కన్నేశాడు. నమ్మించి తనవెంట తీసుకువెళ్లిన నిందితుడు బంగారు ఆభరణాల కోసం హత్య చేశాడు.

 • Share this:
  జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్‌, న్యూస్‌18 తెలుగు, ఖమ్మం జిల్లా

  బంగారం (gold) ఎప్పటికీ తిరుగులేని.. వన్నె తగ్గని.. విలువ కోల్పోని లోహం. మరి సంపద ఉంది కదా అని బీభత్సంగా నగలు దిగేసుకుంటే ఏమవుతుందో చూస్తునే ఉన్నాం.. ఎక్కడ చూసినా చెయిన్‌ స్నాచింగ్‌లు వింటూనే ఉన్నాం. జల్సాలకు అలవాటు పడిన వాళ్లు దారిన పోయే మహిళల మంగళ సూత్రాన్ని సైతం వదలకుండా లాక్కుపో్తుండడం నిత్యం ఎక్కడో ఒక చోట మీడియా ద్వారా చూస్తున్నాం.. వింటున్నాం..

  ఇలా తాజాగా ఓ వ్యక్తి మెడలో ఉన్న గొలుసు.. చేతికి ఉన్న ఉంగరాలే ఒక ఆయన ప్రాణాలు తీశాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం(kottagudem) జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. డబ్బు మనిషిని రాక్షసున్ని చేస్తున్న వైనం అర్థమవుతుంది. అది కూడా తన ప్రియురాలిని సంతోషపెట్టడం కోసం కావడం ఇక్కడి విషాధం.

  కొత్తగూడెంలో స్టీల్‌ సిండికేట్‌ యజమాని కేతపల్లి సుధాకర్‌ ఈనెల 8న హత్యకు(murder) గురయ్యాడు. దారుణంగా చంపి పడేయడంతో పోలీసులు ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్నారు. రెండు వారాలైనా దారి దొరకలేదు. వ్యాపార లావాదేవీల్లో ఎవరైనా హత్యకు పాల్పడి ఉంటారని. అందరూ భావించారు.

  ఇది చదవండి : ఆడపిల్ల పుడితే రూ.5,116 ఫిక్స్ డ్ డిపాజిట్.. వివరాలిలా..


  అయితే సుధాకర్‌ హత్యకు గురైన రెండు వారాల తర్వాత నిందితుడు వదిలిన క్లూతో పాటు స్థానికుల సమాచారం మేరకు పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు.. వివరాల్లోకి వెళితే.. నిందితుడు ఎస్‌.కె.పాషా కొత్తగూడెంలోని శీతల్‌ టెంట్‌హౌజ్‌ యజమాని భవాని ప్రసాద్‌ సంప్రదించి బంగారు నగలు పెట్టుకుని డబ్బు కావాలని అడిగాడు. అనుమానం వచ్చిన భవాని ప్రసాద్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హత్య కోణం వెలుగుచూసింది.

  కేసు సంబంధించి పోలీసులు వెలువరించిన వివరాల ప్రకారం..స్థానిక చాతకొండ డ్రైవర్స్‌ కాలనీకి చెందిన పాషా 2013 నుంచి 2017 దాకా కేతపల్లి సుధాకర్‌కు చెందిన స్టీల్‌ సిండికేట్‌లో మిషన్‌ ఆపరేటర్‌గా(operator) పనిచేశాడు. అనంతరం అక్కడ పని మానేసి డ్రైవర్‌గా(driver) చేస్తున్నాడు. పాషాకు ఓ యువతితో వివాహేతర సంబంధం(Illegal affair) ఉండడం.. ఈ మధ్య కాలంలో ఆమెను తీసుకెళ్లి భద్రాచలంలోని ఓ లాడ్జిలో పదిహేను రోజులు లాడ్జిలోనే ఉన్నారు. వెంట తెచ్చుకున్న డబ్బులు అయిపోవడంతో పాషా ఆమెను అక్కడే ఉండమని చెప్పి.. కొత్తగూడెం వెళ్లాడు. ఎలాగైనా డబ్బు సంపాదిదంచాలన్న ఆలోచనతో తన పాత యజమాని సుధాకర్‌ను కలిశాడు. తనకు మళ్లీ పనిచేసే అవకాశం ఇవ్వాలని కోరాడు. సుధాకర్‌ తన అసహాయతను వెలిబుచ్చినా.. పాషా వదల్లేదు.

  ఇది చదవండి : హయత్ నగర్ లో దారుణం.. భార్య శవాన్ని దుప్పటిలో చుట్టి.. చివరకు..


  మరుసటి రోజు ఫోన్‌(phone) చేసి కలసి మాట్లాడాలని ఉంది అనడంతో.. సుధాకర్‌ తానున్న ప్రదేశం చెప్పాడు. పాషా అక్కడకు చేరుకుని మళ్లీ డబ్బు కోసం.. పని కోసం సాయం చేయాలని అడిగాడు. సుధాకర్‌ నుంచి సానుకూల స్పందన లేకపోయే సరికి.. అతని మెడలోని బంగారు గొలుసు, చేతికి ఉన్న ఉంగరాల పై పాషా దృష్టి పెట్టాడు. వాటిని చేజిక్కించుకుంటే తన ఇబ్బందులు తీరినట్టేనని అనుకున్న పాషా.. తనకు టూవీలర్‌ లేదని, తనను ఒకచోట స్నేహితుడి వద్ద దించాలని కోరాడు. నమ్మకంగా తన వద్ద పనిచేసిన మనిషే కనుక అతనికి ఎలాంటి అనుమానం కలగలేదు. నిర్జన ప్రదేశంలో బైక్‌ను ఆపమన్న పాషా.. మెడలోని గొలుసు, ఉంగరాలను ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు.

  దీంతో ఆగ్రహించిన సుధాకర్‌ పోలీసులకు ఫోన్‌ చేస్తానని అంటుండగానే పాషా రాడ్‌తో సుధాకర్‌ తలపై కొట్టాడు. కిందపడిన సుధాకర్‌ పైన మళ్లీ దాడి చేసి తలపై మోదడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. చనిపోయిన సుధాకర్‌ వద్ద ఉన్న బంగారు గొలుసు, ఉంగరాలను తీసుకుని వెళ్లిపోయాడు. సంచలనం సృష్టించిన వ్యాపారి హత్య కేసు ముడి విప్పడం పోలీసులకు సవాల్‌గా మారింది. వ్యసనాలకు బానిస అయిన పాషా తన పాత యజమాని అనికూడా చూడకుండా హత్య చేయడం అందరినీ కలవరపరచింది.
  Published by:yveerash yveerash
  First published: