పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో స్ట్ఫైండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ (Stfindery Cadet Trainee Police) సబ్ ఇన్స్పెక్టర్స్ (Sub-Inspectors),కానిస్టేబుల్ (Constable) అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా డిసెంబర్ 8వ తేది గురువారం (Thursday) ప్రారంభమైన దేహదారుఢ్య పరీక్షలు(Physical Test)సజావుగా కొనసాగిందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్(Vishnu.s. Warrior) తెలిపారు. పురుష అభ్యర్థుల శారీరక దారుడ్య పరీక్షలకు 600 మంది అభ్యర్థులకు గాను 494 మంది అభ్యర్థులు హజరైయ్యారని తెలిపారు. ఇందులో 199 మంది అభ్యర్థులు తుది పరీక్షకు అర్హత సాధించారని చెప్పారు.
ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్‌లు..
ఉదయం పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకున్న అభ్యర్థులకు ముందుగా సీరియల్ నెంబర్ ప్రకారం టోకెన్ అందజేశారు. ఆనంతరం యాబై మంది అభ్యర్థులను ఒక్కొక్క బ్యాచ్ గా చేసి డాక్యుమెంట్స్ పరిశీలన కౌంటర్ వద్ద తరలించారు. అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించి రిజిస్ట్రేషన్ చేసిన తరువాత బయోమెట్రిక్ తీసుకున్నారు. ఆనంతరం రిస్ట్‌బాండ్ టాగింగ్, ఆర్ఎఫ్ఐడీ చిప్ జాకెట్ ధరింపజేశారు. అనంతరం 1,600 మీటర్ల పరుగు పందెం నిర్వహించారు.
తొలి రోజు 199మందికి అర్హత ..
1600 మీటర్ల పరుగు పోటీలో నిర్ణీత సమయంలో లక్ష్యం చేరి అర్హత సాధించినవారికే ఎత్తు కొలతలకు అనుమతించారు. వరుస క్రమంలో నిర్వహించిన ఇవెంట్లలో అర్హత సాధించలేని అభ్యర్థులను నాట్ క్వాలిఫైయింగ్ రిజల్ట్స్ షీట్ అందజేసి ఎగ్జిట్ గేటు నుండి బయటకు పంపించారు. శారీరక సామర్థ్య పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు, పొరపాట్లు జరగకుండా క్షేత్రస్ధాయిలో దృష్టి పెట్టి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ పరిసరాలలో 32 సీసీ కెమెరాల నిఘా నీడలో జరుగుతున్నాయని పోలీస్ కమిషనర్ తెలిపారు.
రన్నింగ్ టెస్ట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు..
పరుగుపందెంలో పాల్గొనే అభ్యర్థి పరుగు ప్రారంభించిన సమయంతో పాటు, లక్ష్యం చేరుకున్న సమయాన్ని స్పష్టంగా రికార్డు చేసేందుకు ప్రతి అభ్యర్థికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైస్ (ఆర్ఎఫ్ఐడీ) చిప్ తో కూడిన జాకెట్, చేతికి రిస్ట్బాండ్లను బిగించారు. అభ్యర్థుల కోసం పరేడ్ గ్రౌండ్స్ లో మొబైల్ టాయిలెట్స్, మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
జనవరి 3వరకు ..
ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో డిసెంబర్ 8వ తేది నుంచి జనవరి 3 వ తేది వరకు జరుగనున్న ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలకు 24733 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇందులో 4,700 మంది మహిళలు, 20,033 పురుషులు. వీరందరికి షెడ్యూల్ ప్రకారం ఆయా రోజుల్లో, నిర్దిష్ట సమయాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.