హోమ్ /వార్తలు /తెలంగాణ /

Love affair : మైనర్‌ బాలికకు ప్రేమ వల వేశాడు ..మేజర్‌ కాగానే జంప్ .. ఏడాది అవుతున్న దొరకని జాడ

Love affair : మైనర్‌ బాలికకు ప్రేమ వల వేశాడు ..మేజర్‌ కాగానే జంప్ .. ఏడాది అవుతున్న దొరకని జాడ

Love couple(FILE)

Love couple(FILE)

Love affair: ఈ మధ్య కాలంలో మైనర్ బాలికలే టార్గెట్‌గా ప్రేమ వల విసురుతున్నారు కొందరు పోకిరోళ్లు. ఆ మత్తు నుంచి కోలుకునే లోగా వెనక్కు తిరిగిరాలేనంత లోతైన అగాధంలో కూరుకుంటున్నారు.  ఖమ్మంలో ఇదే తరహా కేసులో తల్లిదండ్రులు పడుతున్న మనోవేదన అంతా ఇంతా కాదు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Khammam, India

  (G.SrinivasReddy,News18,Khammam)

  ఈ మధ్య కాలంలో మైనర్ బాలిక(Minor girls)లే టార్గెట్‌గా ప్రేమ వల విసురుతున్నారు కొందరు పోకిరోళ్లు. ఆ మత్తు నుంచి కోలుకునే లోగా వెనక్కు తిరిగిరాలేనంత లోతైన అగాధంలో కూరుకుంటున్నారు.  ఖమ్మం(Khammam)లో ఈ తరహా కేసులు పెరుగుతుండడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆడ పిల్లలని కని, పెంచాలంటే ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆలోచించాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. తమ బిడ్డలను ఉన్నతంగా చూడాలనుకుంటున్న ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాశలే అవుతున్నాయి. ప్రేమ(Love)పేరుతో మాయమాటలు చెప్పి ఓ ఆడపిల్లను తల్లిదండ్రులకు దూరం చేస్తే.. ఇన్ని వ్యవస్థలు ఉన్నా బిడ్డను తమ చెంతకు చేర్చలేకపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

  YS Sharmila : ఎన్టీఆర్ హెల్త్‌ యూనివర్సిటీకి వైఎస్‌ఆర్‌ పేరు పెట్టడం ముమ్మాటికీ తప్పే : వైఎస్‌ షర్మిల

  ఏడాది క్రితం కూతురు మాయం..

  ఖమ్మం నగరంలో ఇంటర్ మీడియట్ చదువుతున్న యువతిని వేరే సామాజిక వర్గానికి చెందిన యువకుడు ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. మొదట తిరస్కరించిన ఆ యువతి కొంతకాలానికి యువకుడి మాయలో పడిపోయింది. ప్రేమపేరుతో అమ్మాయిని మైనార్టీ తీరకముందే ఎక్కడికో తీసుకెళ్లాడు. అయితే కొన్ని రోజుల తర్వాత అమ్మాయి తరపువారు తీసుకొచ్చి ఎవరింట్లో వారిని ఉంచారు. మరోసారి కూడా ఇద్దరూ ఇంట్లోంచి వెళ్లిపోతే తిరిగి తీసుకొచ్చారు. ఈసారి అమ్మాయి తల్లిదండ్రులు కొంత జాగ్రత్త పడ్డారు. తిరిగి డిగ్రీలో చేరి చదువుకుంటున్న క్రమంలో మళ్లీ ఆ యువకుడు వెంటపడ్డాడు. మైనార్టీ తీరేదాకా చూసి ఆ అమ్మాయిని మరోసారి తీసుకెళ్లాడు. ఈ ఘటన జరిగి దాదాపు సంవత్సరం. అయినా ఇంత వరకు ఆ అమ్మాయి జాడ తల్లిదండ్రులకు తెలియక పోవడం గమనార్హం. అబ్బాయి తరఫు వారిని అడిగినా తమతోనూ కాంటాక్ట్‌లో లేరంటూ చెబుతున్నారని ఆడపిల్ల తండ్రి తన బాధను వెళ్లగక్కుతున్నాడు.

  ప్రేమవ్యవహారమే కారణం..

  సంవత్సరం గడుస్తున్నా కన్నకూతురు జాడ తెలియక తల్లడిల్లిపోతున్నారు తల్లిదండ్రులు. బిడ్డ ఆచూకి కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఏడాది కాలంగా కనీసం చూడలేకపోయామంటున్నారు. పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టినా.. రాజకీయ నాయకుల వద్దకు వెళ్లి బతిమాలినా.. పెద్దమనుషుల వద్ద మొరపెట్టుకున్నా ఫలితం కనిపించడం లేదన్నారు. 18 సంవత్సరాలు అల్లారుముద్దుగా పెంచుకున్నామని.. ప్రేమ మాయలో పడి ఇలా వెళ్లిపోతే.. తల్లిదండ్రుల వద్దకు బిడ్డను చేర్చాల్సిన బాధ్యత ఎవరికీ లేదా? అంటూ కన్నీళ్లు తెచ్చుకుంటున్నారు. కనీసం అమ్మాయి ఉందా? లేదా ? అన్న విషయం మీద క్లారిటీ లేదని వాపోతున్నారు.

  Telangana : లారీపై విమానం .. రోడ్డుపై వెళ్తుంటే చూసి ఆశ్చర్యపోయిన జనం

  ఆడపిల్ల తల్లిదండ్రుల గోడు వినేదెవరు..

  మేజర్లు కాబట్టే పెళ్లి చేసుకున్నారనుకుంటే.. కనీసం ఏడాది కాలంగా జాడలేని తమ బిడ్డను చూపించాల్సిన బాధ్యత పోలీసులకు, వ్యవస్థకు లేదా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా బాధలో ఉన్న తమకు వారి కోసం వెతకొద్దంటూ కోర్టు నోటీసులు కూడా వచ్చాయంటున్నారు. పోలీసులు తలుచుకుంటే తమ బిడ్డను తీసుకొచ్చి చూపించొచ్చని.. కానీ వారిపై కొంతమంది ఒత్తిడి, కోర్టు నోటీసులు ఉండటం వల్లే తమ బిడ్డ విషయమై శ్రద్ధ చూపడం లేదన్నారు. ఎటొచ్చి సదరు యువకుడి తరుఫు వాళ్లకే వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకునే విషయంలో అబ్బాయి తరఫున అన్ని సహాయసహకారాలు అందుతుంటే.. అమ్మాయి వారికి మాత్రం అన్యాయమే జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Khammam, Love marriage, Telangana News

  ఉత్తమ కథలు