మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా పరిధిలో అక్రమ వడ్డీ వ్యాపారులు, చట్ట విరుద్ధమైన చిట్టి వ్యాపారుల, చిట్ ఫండ్స్ ఆగడాలు (High Interest rates)శృతి మించడంతో జిల్లా పోలీసులు దాడులు నిర్వహించారు. వడ్డీ వ్యాపారుల వల్ల ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమై, మరెంతో మంది అప్పులు తీర్చలేక, వడ్డీ వ్యాపారుల వేధింపులు (Tortures) తట్టుకోలేక తమ జీవితాన్ని ముగించిన సంఘటనలు చాలా ఉన్నాయి. గతంలో పోలీసులు చట్టపరంగా కఠిన చర్యలు (Strict actions) తీసుకున్నప్పటికీ, వడ్డీ వ్యాపారులు తమ వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తు, తమ కార్యలాపాలను సాగిస్తున్న విషయం పోలీసుల దృష్టికి వచ్చింది.
రూ.5 నుంచి రూ.10 వరకు వడ్డీ..
ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) శరత్ చంద్ర పవార్ మీడియాకు వివరాలు విడుదల చేశారు.. ‘‘ మధ్య తరగతి పేద వర్గాలకు చెందిన వారు తమ ఆర్థిక అవసరాలకు (Financial needs) వడ్డీ వ్యాపారులను సంప్రదించగా, ఆ వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా రూ.5 నుంచి రూ.10 వరకు వడ్డీ వసూలు చేస్తున్నారు. మరికొంతమంది వారు ఇచ్చిన అప్పుకు సెక్యూరిటీ కింద వారి ఆస్తులను కూడా క్రమ విక్రయాల రూపంలో రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత పూర్తిగా కబ్జా చేసిన సందర్భాలు కూడా దృష్టికి వచ్చినవి. ఇంతే కాకుండా రకరకాల ఫిర్యాదులు ప్రతిరోజు పోలీస్ స్టేషన్లకు వస్తున్నవి. నేరుగా పోలీసుల వద్దకు కుడా వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు.
మరికొంతమంది అక్రమ చిట్టీలు (Chits) నడిపిస్తూ, రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ వారు కూడా చిట్టి డబ్బులు అన్ని నెలలు పూర్తిగా చెల్లించి చిట్టి ఎత్తుకున్నా, వారికి డబ్బులు చెల్లించకుండా రకరకాల తనఖాలు కావాలని వేధిస్తున్నారు. వెరిఫికేషన్ చెయ్యాలని నెలల తరబడి వారికి డబ్బులు సకాలంలో చెల్లించకుండా వేధిస్తున్న సంఘటనలు మా పోలీసు వారి దృష్టికి వస్తున్నవి. ఇటువంటి అక్రమ కార్యకలాపాలతో ఎంతోమంది ఉసురు తీసుకుంటున్న ఈ వడ్డీ వ్యాపారులు, రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించి జిల్లా వ్యాప్తంగా 22 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ఏకకాలంలో ముప్పేట దాడులు నిర్వహించడం జరిగింది. నిందితులపై తెలంగాణా మనీ లెండర్స్ యాక్ట్- 1349 లోని వివిధ సెక్షన్స్ క్రింది చీటింగ్ సెక్షన్ 420 IPC క్రింద చట్ట సత్య తగు చర్య తీసుకోనున్నారు.
ఈ మొత్తం సోదాలలో స్వాధీనం చేసుకున్న వాటి వివరాలు :
1) నగదు (52,02,740 /- )
2) ప్రామిసరి నోట్స్( 395),
3] లాంగ్ బుక్స్ - 97
4) స్మాల్ చిట్ బుక్స్ – 664
5) ల్యాండ్ డాక్యుమెంట్స్ – 16
6) బ్లాంక్ చెక్స్ – 51
7) బ్యాంకు పాస్ బుక్స్ – 07
8) చెక్ బుక్ - 01
9] ATMs – 13 స్వాధీనం చేసుకున్నారు..
ఈ ప్రత్యేక ఆపరేషన్ లో పాల్గొన్నఏడుగురు CI లు, 15 మంది SI లు మరియు సిబ్బందిని వారిని గైడ్ చేసిన అడిషనల్ SP యోగేష్ గౌతమ్ లను ప్రత్యేకంగా ఎస్పీ చంద్ర పవార్ అభినందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Gold loans, High interest rates, Khammam, Mahabubabad