హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : గణేష్ ఉత్సవాల్లో వెల్లివిరిసిన మత సామరస్యం ..శోభయాత్ర, నిమజ్జనంలో ముస్లిం సోదర, సోదరీమణులు

Telangana : గణేష్ ఉత్సవాల్లో వెల్లివిరిసిన మత సామరస్యం ..శోభయాత్ర, నిమజ్జనంలో ముస్లిం సోదర, సోదరీమణులు

ganesh nimajjanam

ganesh nimajjanam

Telangana: కులం, మతం అనే తేడా మా మధ్య లేదు. జాతి, వర్ణ విభేదాలకు మా పట్టణంలోని తావులేదు. మతసామరస్యానికి మేమే ఆదర్శం అని నిరూపించుకుంటున్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ముస్లింలు. చవితి ఉత్సవాలను హిందూ, ముస్లింలు సంయుక్తంగా నిర్వహించడమే కాకుండా చివరకు నిమజ్జన కార్యక్రమంలో కూడా కలిసే పాలుపంచుకున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Khammam, India

  (G.SrinivasReddy,News18,Khammam)

  కులం, మతం అనే తేడా మా మధ్య లేదు. జాతి, వర్ణ విభేదాలకు మా పట్టణంలోని తావులేదు. మతసామరస్యానికి మేమే ఆదర్శం అని నిరూపించుకుంటున్నారు ఖమ్మం(Khammam)జిల్లా సత్తుపల్లి(Sattupalli)కి చెందిన ముస్లింలు. దేవుడు ఎవరైనా అందరికి మంచి జరగాలనే భక్తులు కోరుకునేది అంటున్నారు. వినాయక చవితి ఉత్సవాలను హిందూ(Hindu),ముస్లిం (Muslim)లు సంయుక్తంగా నిర్వహించడమే కాకుండా చివరకు నిమజ్జన కార్యక్రమంలో కూడా కలిసే పాలుపంచుకున్నారు. ఈసంఘటన అందరికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నారు.

  YS Sharmila: ఆ మంత్రికి కౌంటర్‌ ఇచ్చిన వైఎస్‌ షర్మిల ..పదవికి రాజీనామా చేసి హమాలీ పని చేసుకోమని సలహా

  నిమజ్జనంలో పాల్గొన్న ముస్లింలు..

  కుల, మతాల పేరుతో కొట్టుకుంటున్న ఈరోజుల్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మాత్రం మతసామర్యాన్ని చాటుకున్నారు ముస్లింలు. పట్టణంలో హిందూ, ముస్లింలు కలిసి వినాయకునికి పూజలు జరిపించారు. చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. నిమజ్జనం ఊరేగింపులో అందరూ కలిసి పాల్గొన్నారు. సత్తుపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన గణనాథుని నవరాత్రి ఉత్సవాల మతసామరస్యం వెల్లువిరిసేలా ముస్లిం సోదర సోదరీమణులు పాల్గొని నిమజ్జనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో పాటు సినీ నటుడు,బీజేపీ నాయకుడు బాబుమోహన్‌ సైతం హాజరయ్యారు.

  మత సామరస్యానికి ప్రతీక..

  పట్టణంలో నిర్వహించిన గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ముందుగా స్థానిక శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య  కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా శోభయాత్రలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు ముస్లిం సోదరులు, సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓవైపు జోరున వర్షం కురుస్తున్నప్పటికి గణేష్ శోభయాత్రను కొనసాగించారు. వర్షం కారణంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు  జరగకుండా చూడాలని పోలీసులను ఆదేశించిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య. దీంతో బేతుపల్లి చెరువు దగ్గర నిమజ్జనం కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు పోలీసు అధికారులు.

  Telangana : నెక్స్ట్ కేసీఆర్‌ ఎంపీగా పోటీ చేసేది అక్కడి నుండేనా .. రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ

  శోభయాత్రలో కలిసి నడిచిన హిందూ, ముస్లింలు..

  శోభాయాత్రలో బాగంగా సత్తుపల్లి ప్రసన్న గణపతి లడ్డు వేలంపాటలో ప్రముఖ హాస్యనటుడు, మాజీ ఎంపీ బాబుమోహన్ పాల్గొన్నారు. సత్తుపల్లికి తనకు అనుబంధం ఉందన్నారు. తాను గతంలో సత్తుపల్లిలో రెవెన్యూశాఖలో ఉద్యోగం చేశానని తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. భారీ వర్షం కారణంగా  కారులోనే ఉండి ప్రసన్న గణపతి ఉత్సవ కమిటీకి అభినందన తెలిపారు బాబుమోహన్.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Ganesh Chaturthi​ 2022, Khammam, Telangana News

  ఉత్తమ కథలు