హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : మసకబారిన నాటి వైభవం .. నల్లబంగారం నిధికి మళ్లీ పాత రోజులొచ్చేనా ..!

Telangana : మసకబారిన నాటి వైభవం .. నల్లబంగారం నిధికి మళ్లీ పాత రోజులొచ్చేనా ..!

yellandu coal mine

yellandu coal mine

Telangana: బొగ్గు పరిశ్రమ స్థాపించిన తొలి రోజుల్లో ఇల్లందు ప్రాంతంలో సుమారు 42 బొగ్గు బావులు.. 12 వేల మంది కార్మికులతో కళకళలాడింది. బొగ్గు పరిశ్రమపై నూతన ఆర్థిక విధానాల ప్రభావంతో పాటు మరికొన్ని కారణల వల్ల పూర్వ వైభవాన్ని పూర్తిగా కోల్పోయింది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Yellandu, India

  (G.SrinivasReddy,News18,Khammam)

  భౌగోళికంగా ఎంతో చరిత్ర కలిగిన ఇల్లందు(Yellandu)ఏజెన్సీ ప్రాంతానికి నిలయంగా ఉంది. పచ్చని అడవులు, జలజల పారే సెలయేరులు, పంట పొలాలు, అమాయకత్వ ప్రజలతో మమేకమైన ఇల్లందు చరిత్ర గతమంతా ఘన కీర్తి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ అంచులను కూడా చూడలేక పోతుంది ఇల్లందు. చరిత్ర వెనుకకు వెళితే ప్రపంచ స్థాయిలోనే ఇల్లందు బొగ్గుట(Charcoal)కు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. దేశం కాదు ప్రపంచంలోనే మొట్టమొదటిసారి బొగ్గు(Coal)ను కనుగొన్నది ఈ ప్రాంతంలోనే. లండన్(London)కు చెందిన ఇంగ్లీష్(English)అధికారులు ఇల్లందు పేరు ప్రఖ్యాతులను ప్రపంచ నలు మూలల ఇనుమడింప చేశారు. అంతటి చరిత్ర ఎందుకు మసకబారిపోతుంది... దీనికి బాధ్యులు ఎవరు... పలు ప్రశ్నలు ఇల్లందు ప్రజలను వేధిస్తున్నాయి.

  TRS MP Santhoshkumar : నేనెక్కడికి వెళ్లలేదు సీఎం కేసీఆర్ వెంటే ఉన్నా .. తప్పుడు ప్రచారంపై ఎంపీ సంతోష్‌ రియాక్షన్

  ఒకప్పుడు నల్లబంగారు నిధి..

  బొగ్గు పరిశ్రమ స్థాపించిన తొలి రోజుల్లో ఇల్లందు ప్రాంతంలో సుమారు 42 బొగ్గు బావులు.. 12 వేల మంది కార్మికులతో కళకళలాడింది. ఆనాడు వ్యవసాయం అంతగా అభివృద్ధి లేకపోయినా పారిశ్రామికంగా బొగ్గు పరిశ్రమ విరజిల్లడంతో కార్మికులతో పాటు దీనిపై ఆధారపడిన వేల కుటుంబాల కొనుగోలు శక్తి బాగా పెరగడంతో ఈ ప్రాంతంలో వ్యాపారం సైతం ఎంతగానో అభివృద్ధి చెందింది. బొగ్గు పరిశ్రమపై నూతన ఆర్థిక విధానాల ప్రభావం, పాలక ప్రభుత్వాలు యజమాన్యం నూతన సాంకేతిక వ్యవస్థ వైపు అడుగులు వేయడం కారణంగా కార్మికుల సంఖ్య తగ్గిపోయి ఒకే ఒక్క ఓపెన్ కాస్ట్ తో వెయ్యి మంది కార్మికులతో ఇల్లందు ముందుకు సాగుతుంది. ఫలితంగా ఈ ప్రాంత ప్రజల కొనుగోలు శక్తి అతి దారుణంగా పడిపోయింది. వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉండిపోయాయి. ఆనాటి పరిస్థితికి నేటి పరిస్థితికి వ్యవసాయ రంగంలో మార్పులు వచ్చినప్పటికీ ప్రజల కొనుగోలు శక్తి జీవనధారాన్ని పెంచలేకపోయింది.

  అన్నీ విధాలుగా నిరాశే..

  కేవలం వర్షాధారం మీదనే ఆధారపడి వ్యవసాయం ఉండడం వలన అతివృష్టి, అనావృష్టి ఈ రంగంపై ప్రభావం చూపి నష్టాలతో కన్నీరు మున్నీరుగా రైతులు విలపిస్తున్నారు. ఏ ప్రాంతంలో అయితే పరిశ్రమలు వ్యవసాయం పుష్కలంగా అభివృద్ధి చెందుతాయో ఆ ప్రాంతంలో ప్రజల జీవన విధానం మెరుగుపడుతుందనడంలో సందేహం లేదు. మరి ఈ సూక్తి ఇల్లందుకు ఎందుకు వర్తించడం లేదు. పాలిస్తున్న పాలకుల లోపమా ఇక్కడ గెలుస్తున్న ప్రజాప్రతినిధుల లోపమా తెలియదు గాని ఇల్లందుకు శాపంగా మారింది. పరోక్షకంగావందలాది మందికి ఉపాధి చూపిస్తూ రాష్ట్రంలో ఎక్కడా లేని అటవీశాఖ ట్రైనింగ్ స్కూల్ ఇక్కడ నుండి తరలి వెళ్లిపోయింది. ఇల్లందు ప్రజలు తక్కువచార్జితో దూరప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా ఉన్న రైల్వే స్టేషన్ ఆ సంస్థ పూర్తిగా ఎత్తివేసింది.

  అటకెక్కిన అభివృద్ధి..

  కొత్త బొగ్గు బావుల ఊసు లేదు. కొత్తవి రాకపోయినా పర్వాలేదు ఉన్న వాటిని ఊడకుండా చూడలేకపోయారు. వాటిని తిరిగి మళ్లీ తెప్పిస్తామని ఇక్కడ అసెంబ్లీ నుండి పోటీ చేసిన అభ్యర్థులు పలుమార్లు హామీలు ఇచ్చి గెలిచాక ప్రయత్నాలు చేస్తున్నామని సాకుతోనే కాలం వెళ్లబుచ్చుతున్నారు. సరే ఎలాగో వాటిని సాధించ లేరని తెలుస్తుంది. తెలంగాణ వస్తే మన బతుకులు మన ప్రాంతాలు మారుతాయి అని భావించి ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఉద్యమంలో పాల్గొన్న వారి ఆశలు ఎంతవరకు నెరవేరాయన్నది ప్రతి ఒక్కరూ సమీక్షించుకోవలసిన సమయం ఆసన్నమైంది.

  Telangana: ప్రైవేట్‌ ఆసుపత్రుల దందాపై సర్కారు కొరడా .. ఆ జిల్లాలో ఎన్నింటికి నోటీసులిచ్చారంటే ..

  ఉద్యోగ, ఉపాధి అవకాశాలే లేవు..

  ఈ ప్రాంతంలో  2000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ఒక చిన్న తరహా పరిశ్రమలు కూడా స్థాపించలేని నిస్సాయస్థితిలో ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు ఉన్నారంటే అతియోశక్తి కాదు. దీనికి గిరిజన చట్టాలు ఆటంకంగా మారాయని తప్పుకుంటున్నారే తప్ప ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించలేకపోతున్నారు. ఒకవైపు సింగరేణి మసకబారిపోయింది. మరోవైపు నిరుద్యోగులు పొట్ట చేత పట్టుకుని పట్టణాలకు పరుగులు తీస్తున్నారు. మొక్కలు నాటితే రెండు రోడ్లు వేస్తే అభివృద్ధి కాదు ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలు మాత్రమే... మసక పారిపోతున్న బొగుట్ట భవితవ్యాన్ని తిరిగి నిలబెట్టేందుకు అవసరమైన ప్రాణాలికలను రూపొందించి ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచి పరిశ్రమలు స్థాపించుకుంటే తప్ప ఈ ప్రాంతం అభివృద్ధి జరగదనేది గమనలోకి తీసుకొని ఆ దిశగా గెలుస్తున్న ప్రజా ప్రతినిధులు ప్రయత్నాలను కొనసాగించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Khammam, Singareni Collieries Company, Telangana News

  ఉత్తమ కథలు