హోమ్ /వార్తలు /తెలంగాణ /

Wedding Muhurtas: పెళ్లిళ్లు, శుభకార్యాలకు దివ్యమైన ముహుర్తాలు ఇవే .. డిటెయిల్స్ చెక్ చేయండి

Wedding Muhurtas: పెళ్లిళ్లు, శుభకార్యాలకు దివ్యమైన ముహుర్తాలు ఇవే .. డిటెయిల్స్ చెక్ చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Wedding Muhurtas: డిసెంబర్ మూడో తేదీ నుంచి పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు మొదలయ్యాయి. దీంతోపాటు పుష్య మాసం మాఘ మాసం ఫాల్గుణ మాసాల్లో కలిపి మొత్తం 60 ముహూర్తాలు పైగా ఉన్నట్టు పండితులు చెప్తున్నారు. డిసెంబర్ నెలలో 3,4, 7, 8, 9, 14,17,18 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉండటంతో పురోహితులు, వ్యాపారస్తులకు చేతి నిండా పని ఉంటోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Khammam, India

(G.SrinivasReddy,News18,Khammam)

డిసెంబర్‌(December) 3వ తేది శనివారం నుంచి శుభకార్యాలు, వివాహాది కార్యక్రమాలకు ముహూర్తాలు మొదలయ్యాయి. మూడాల కారణంగా కార్తీక మాసంలో పెద్దగా ముహూర్తాలు దొరక్క పోవడంతో చాలామంది తమ ఇళ్లల్లో వివాహాలు ఇంకా ఇతర శుభకార్యాలను వాయిదా వేసుకున్నారు. మార్గశిర మాసం నవంబర్(November)24న మొదలైంది. కానీ డిసెంబర్ మూడో తేదీ ఏకాదశి నుంచి మాత్రమే మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెప్పడంతో అప్పటిదాకా కూడా వాయిదా వేసుకున్నారు. డిసెంబర్ 3 మొదలుకొని వచ్చే ఏడాది మార్చి 18వ(March 18th)తేదీ వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. మార్చి 22న శ్రీ శోభక్రుత్నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కానుంది. ఇంత సుదీర్ఘకాలం మంచి ముహూర్తాలు దొరకడం చాలా అరుదుగా ఉంటుందని పండితులు చెప్తున్నారు.

Telangana: ఫారెస్ట్ ఉద్యోగి వాహనానికి నిప్పు .. దుశ్చర్యకు పాల్పడింది ఎవరంటే..?

రెండేళ్లుగా..

కువైట్ కారణంగా గత రెండు సంవత్సరాలుగా పెద్దగా ముహూర్తాలు లేకపోవడం, చేసుకున్న వాళ్లు కూడా హడావుడిగా చిన్న పార్టీ సందడితో పెళ్లిళ్లు ముగించడం.. అన్ని వ్యాపార వర్గాల వారిని నిరాశ నిస్పృహలకు లోను చేసింది. చాలాకాలం తర్వాత నాలుగు నెలల వ్యవధిలో చాలా ముహూర్తాలు ఉండడంతో వివాహాది శుభకార్యాల రిలేటెడ్ అన్ని వర్గాల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫంక్షన్ హాల్ లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది.

భలే మంచి బేరాలు..

పండితులకు బ్యాండ్ మేళం సన్నాయి వీడియో ఫోటోగ్రాఫర్లు మండపాలు డెకరేషన్ వంట మనుషులు క్యాటరింగ్.. ఇలా వివాహాల కు సంబంధించిన అన్ని వర్గాలకు ఒక్కసారిగా గిరాకీ పెరగడంతో రేట్లు కూడా పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా పెళ్లిళ్ల షాపింగ్ లే కనిపిస్తున్నాయి. ఖమ్మం నగరంలోని ప్రధాన షోరూమ్ లలో ఇసుకేస్తే రాలని జనం కనిపిస్తున్నారు. ముఖ్యంగా బంగారు దుకాణాలు వస్త్ర దుకాణాలు శుభ ముహూర్తాలు వేళ కిటకిటలాడుతున్నాయి. ఇక హోల్‌సేల్ కూరగాయల సరఫరాదారులకు, హోల్‌సేల్ మటన్, చికెన్ సరఫరా చేసే వాళ్లకు కూడా డిమాండ్ పెరిగిపోయింది.

శుభ ముహూర్తాలు ఇవే..

మార్గశిర మాసం అయినటువంటి డిసెంబర్ మూడో తేదీ నుంచి పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు మొదలయ్యాయి. దీంతోపాటు పుష్య మాసం మాఘ మాసం ఫాల్గుణ మాసాల్లో కలిపి మొత్తం 60 ముహూర్తాలు పైగా ఉన్నట్టు పండితులు చెప్తున్నారు. డిసెంబర్ నెలలో 3,4, 7, 8, 9, 14,17,18 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నట్టు పురోహితులు చెబుతున్నారు. మళ్లీ డిసెంబర్ 24వ తేదీ నుంచి జనవరి 21 వరకు పుష్యమాసంలో మంచి ముహూర్తాలు లేవు.

Hyderabad: ఇద్దరు ట్రాన్స్‌జెండర్‌లు ప్రభుత్వ హాస్పిటల్‌లో డాక్టర్లుగా చేరారు .. ఎక్కడంటే

పెళ్లి ముహుర్తాలు ఇవిగో..

ఇక పెళ్లిళ్ల మాసంగా చెప్పుకునే మాఘమాసంలో జనవరి 22వ తేదీ నుంచి ఫిబ్రవరి 20 వరకు కొన్ని మంచి ముహూర్తాలు ఉన్నట్టు చెబుతున్నారు. వీటిలో జనవరి 26, 27.. ఫిబ్రవరి 1, 9,10,11,12, 15,16 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఇక ఫాల్గుణ మాసంలో ఫిబ్రవరి 22 నుంచి 23,24,25.. మార్చి 1, 8,9, 10,11, 15,17, 18 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి. మార్చ్ 22వ తేదీన శ్రీ శో భ కృత నామ తెలుగు సంవత్సర ఉగాది మొదలుకానుంది. ఆ తర్వాత మంచి ముహూర్తాల కోసం చైత్రమాసం దాకా ఎదురు చూడాల్సిందే. ముహూర్తాల వేళ కావడంతో అందరూ మంచి ముహూర్తం చూసుకొని తమ ఇళ్లలో శుభకార్యాలను మొదలు పెడుతున్నారు.

First published:

Tags: Andhra pradesh news, Telangana News, Wedding

ఉత్తమ కథలు