(G.SrinivasReddy,News18,Khammam)
భద్రాద్రి కొత్తగూడెం (Bhadrādri kottagūḍeṁ)జిల్లాలో జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు(Srinivasa Rao)ను గుత్తికోయలు హత్య చేసిన ఘటన జరిగి పది రోజులు గడవ ముందే ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లాలో మరో ఘటన జరిగింది. పెనుబల్లి(Penuballi) మండలం బ్రహ్మళకుంట(Brahmalakunta)శివారులో ఫారెస్ట్ అధికారి బైక్(Bike)ను గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేశారు. అది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కాళీ(Forest Section Officer Kali)బైక్‌గా తెలుస్తోంది. జంతువుల కోసం వేటగాళ్లు కరెంట్ వైర్లు బిగుస్తున్నారనే సమాచారంతో ఫారెస్ట్ అధికారి అక్కడికి వచ్చాడు. అనంతరం పక్కనే వున్న వరి పొలంలో బైక్‌ని పార్క్ చేసి చుట్టుపక్కల గాలించేందుకు వెళ్లాడు.ఈ క్రమంలోనే దుండగులు ఆయన బైక్‌ను దగ్ధం చేశారు.బెండాలపాడు ఘటన మరవక ముందే రోజుల వ్యవధిలో మరో ఘటన జరగడంతో అటవీ శాఖ అధికారులు ఉలిక్కిపడ్డారు.
ఫారెస్ట్ సిబ్బందికి షాక్ ..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పోడు భూముల వివాదంలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఆయన హత్యకు బాధ్యులైన ఎర్రబోడు గుత్తికోయలను ఊరి నుంచి బహిష్కరించాలని బెండాలపాడు గ్రామపంచాయతీ తీర్పు వెలువరించింది.గుత్తి కోయల వల్ల తమకు ప్రాణ హాని వుందని అందువల్ల వారిని స్వస్థలమైన ఛత్తీస్‌గఢ్‌కు పంపించాలని గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ మేరకు బెండాలపాడు గ్రామస్తులు పంచాయితీ ఈవోకు తీర్మానం కాపీని అందజేశారు. ఓ ఫారెస్ట్ రేంజ్ అధికారిని చంపిన ఘటన నుంచి డిపార్ట్మెంట్ తేరుకోక ముందే మరో షాక్ తగిలింది.
పది రోజుల వ్యవధిలో రెండో ఘటన..
కేవలం అటవీశాఖ అధికారుల్ని హడలెత్తించడానికే కొందరు వ్యక్తులు ఉద్దేశ పూర్వకంగా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని డిపార్ట్మెంట్ భావిస్తోంది. విధి నిర్వహణలో అమరుడైన చంద్రుగొండ రేంజ్ అటవీ అధికారి (ఎఫ్ఆర్వో) చలమల శ్రీనివాస రావు మరణానంతరం ఫారెస్ట్ అధికారులు ఆత్మరక్షణతో పాటు దాడులకు తెగబడే వారి నుంచి భద్రతగా తమకు కూడా ఆయుధాలు ఇవ్వాలని చాలా కాలంగా ఫారెస్ట్ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. అడవిలో విధులు నిర్వహించాలంటే ఆయుధాలు కావాలని కోరుతున్నారు.ఈ విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రంలోని పలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదీవాసీలకు, ఫారెస్ట్ సిబ్బంది మధ్య వివాదాలు జరుగుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు వారాల వ్యవధిలోనే మరో సంఘటన జరగడంతో ఇప్పుడైన తమ డిమాండ్ నెరవేర్చాలని ఫారెస్ట్ అధికారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Khammam, Telangana News