Home /News /telangana /

KHAMMAM ENCROACHMENT OF PONDS FOR 268 ACRES OF LAND IN KHAMMAM DISTRICT SNR KMM

Telangana : అందరూ చెరువు నీళ్లు తాగితే వాళ్లు 68చెరువులను మింగేశారు .. ఏ జిల్లాలో జరిగిందో తెలుసా..?

LAND GRABING(FILE PHOTO)

LAND GRABING(FILE PHOTO)

Telangana : ఆ జిల్లాలో భూఆక్రమణ విపరీతంగా పెరిగిపోయింది. ఆక్రమించుకునేందుకు పక్కవాళ్ల భూములు సరిపోవడం లేదని ఏకంగా చెరువుల పరిధిలోని వందల ఎకరాల భూమిని మాయం చేశారు. అధికారులు లోతుగా విచారించడంతో భూమి కబ్జా వ్యవహారం బయటపడుతోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Khammam, India
  (G.SrinivasReddy,News18,Khammam)
  వేరే వ్యక్తుల భూములు కాజేస్తే గొడవలు అవుతున్నాయని..కాళీగా ఉన్న చెరువుల(Ponds)పై కర్చీఫ్‌ వేసి ఆక్రమిస్తే అడిగేవాళ్లే ఉండరనేది వాళ్ల ఉద్దేశం. అందుకే చెరువుల చుట్టు పక్కల్లో ఉంటున్న వాళ్లంతా కలిసి ఏకంగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. గ్రామాలు, పట్టణాలతో సరిపెట్టుకోకుండా ఏకంగా జిల్లా కేంద్రంలోనే ఆక్రమణకు పాల్పడి అక్రమాలకు తెరతీశారు. మొత్తం ఎంత భూమిని కనిపించకుండా మాయం చేశారో తెలుసుకొని ఖమ్మం(Khammam)జిల్లా అధికారులు ఆశ్చర్యపోతున్నారు. ఇందులో ఎవరి పాత్ర ఏ మేరకు ఉందనే విషయాన్ని రాబడుతున్నారు.

  Telangana | TS RTC : ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ పంద్రాగస్ట్ గిఫ్ట్ .. వాళ్లకు ఫ్రీ జర్నీ, రూ.75కే టీ24 టికెట్  చెరువుల్నే మింగేస్తున్న భూ బకాసురులు..
  ఖమ్మం జిల్లాలోని 68 చెరువుల పరిధిలో సుమారు 268 ఎకరాల మేర భూమి ఆక్రమణకు గురైంది. ఇదంతా 353 మంది ఆక్రమణదారుల స్వాధీనంలో ఉన్నట్టు గుర్తించారు కలెక్టర్‌ వీపీ గౌతమ్‌.. కొన్నేళ్లుగా సాగుతున్న ఈ దురాక్రమణను అడ్డుకోకపోతే భవిష్యత్‌ పరిణామాలు దారుణంగా ఉండే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇరిగేషన్‌ శాఖ పనితీరుపై నిర్వహించిన సమీక్షలో కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ సమక్షంలో ఈ అంశంపైనే చర్చ జరిగింది. లెక్కల ప్రకారం 268ఎకరాలే అయినప్పటికి ఆక్రమణకు గురైన భూమి విస్తీర్ణం ఇంకా ఎక్కువే ఉంటుందన్నది మరో వాదనగా తెలుస్తోంది. ఏది ఏమైనా భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడే చెరువులు, కుంటలు, బావులు, ఇంకా చిన్న, మధ్య తరహా నీటి సామర్ధ్యం ఉన్న వాటర్‌ బాడీలను కాపాడాల్సిన ఆవశ్యకత తక్షణంగా మారిందన్న నిజాన్ని జిల్లా ఉన్నతాధికారులు గుర్తించారు. రెవెన్యూ, ఇరిగేషన్‌, సర్వేశాఖల అధికారులు జాయింట్‌ సర్వే చేపట్టి ఆక్రమణలను గుర్తించాల్సిన అవసరం ఉందని తేల్చారు. త్వరలోనే జాయింట్ సర్వే చేపట్టనున్నారు.  చెరువులతో భూమి వ్యాపారం..
  ఖమ్మం నడిబొడ్డున ఉన్న లకారం చెరువు ఇప్పటికే చుట్టుపక్కల వాళ్ల దెబ్బకు చిక్కి శల్యమైంది. మిగిలిన దాంట్లో సగానికి పైగా దీర్ఘకాలిక లీజు పేరుతో ఉంది. ఇక మిగిలిన కాస్తలోనే నీళ్లు నింపి టూరిజం డెవలప్‌ చేశారు. చదరపు గజం రూ.లక్ష దాకా ఉన్న ఈ ప్రాంతంలో ఆక్రమణలను ఆపడానికి ప్రభుత్వం ఇప్పటిదాకా పెద్దగా చర్యలు తీసుకున్నది లేదు. దీంతోపాటు అతి పెద్దదైన ధంసలాపురం చెరువు ఇప్పటికే సగానికి పైగా ఆక్రమణల్లో ఉంది. ఈ ప్రాంతంలో చదరపు గజం రూ.25 వేలకు పైగా ఉండడంతో చుట్టు పక్కల ఆక్రమణలు ఊపందుకున్నాయి. చెరువు పక్కనే చిన్న జాగా కొనుగోలు చేయడం.. కొన్నాళ్లు గ్రానైట్‌ వేస్ట్‌ను పోయడం.. అటుపై చెరువులో మట్టినే నింపి మెరక చేయడం.. ఫైనల్‌గా ప్లాట్లుగా మార్చి జనానికి టోకరా వేయడం రివాజుగా మారింది.

  Telangana : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు..అక్కడ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసి ఎన్ని సంవత్సరాలంటే..  ఇలాగే వదిలేస్తే తాగునీరుండదు..
  సమర్ధులైన అధికారులు వచ్చినపుడు ఆక్రమణదారులు కాస్త తగ్గినట్టున్నా, అవకాశం రాగానే బకాసురుల్లా ఆక్రమణలకు తెగబడతుంటారు. వందేళ్ల రికార్డు ఆధారంగా ఫుల్ ట్యాంక్‌ లెవల్‌ తీసుకుని సర్వే చేస్తేనే చెరువుల నిజమైన విస్తీర్ణం తేలుతుందంటున్నారు సర్వే నిపుణులు. తాజాగా కలెక్టర్‌ గౌతమ్‌ ఆదేశించినట్టు జాయింట్‌ సర్వేలో ఏంతేలుస్తారో తేలాల్సి ఉంది. ఇప్పటికైనా చెరువులను కాపాడుకోలేకపోతే భవిష్యత్‌లో బోర్లలో నీరు ఉండే అవకాశం ఉండదన్నది నిజం.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Khammam, Land kabja issue, Telangana News

  తదుపరి వార్తలు