KHAMMAM DISTRICT ITSELF GOT THE TWO PADMA SHRI AWARDS VRY KMM
Khammam : ముస్లిం అయినా.. మందిరంలో నాదస్వరం.. ! అందుకే... ఆ జిల్లాకు రెండు పద్మాలు..!
పద్ర శ్రీ అవార్డులు పొందిన ఉమ్మడి శమ్మం జిల్లా వాసులు
Khammam : కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలంగాణకు చెందిన ఐదుగురికి లభించిన విషయం తెలిసిందే.. అయితే వారిలో ఒకే జిల్లాకు చెందిన ఇద్దరిని పద్మ శ్రీ అవార్డులు వరించాయి..
( జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్, న్యూస్18 తెలుగు, ఖమ్మం జిల్లా)
ఉమ్మడి ఖమ్మం జిల్లాను వరించిన పద్మాలు.. ఇద్దరు సంగీతకారులకు పద్మశ్రీ ప్రకటించిన కేంద్రం,వారిలో ఒకరు షేక్ హాసన్సాహెబ్. ముస్లిం మైనారిటీ కమ్యూనిటీకి నుంచి ఎంతో శ్రమకోర్చి సంగీత సాధన చేసి రెండు దశాబ్దాల పాటు భద్రాద్రి సీతారాములకు సంగీత సేవ చేసిన విద్వాంసుడు. నాదస్వరం ఆయన ప్రాణం. ముస్లిం అయి ఉండి హిందూ దేవాలయంలో సంగీత విద్వాంసునిగా పనిచేసిన హాసన్ సేవలకు దక్కిన గుర్తింపు ఇది.మరొకరు గిరిజన తెగకు చెందిన డోలు విధ్వాంసుడు రామచంద్రయ్య. మణుగూరు మండలం కూనవరం గ్రామానికి చెందిన ఈయనకు కూడా కేంద్రం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. కాగా వారు అందుకోసం చేసిన సేవ, కఠోర శ్రమను ఉంది.
కాగా భద్రాచలం రామాలయంలో నాదస్వర విద్వాంసుడిగా పనిచేసిన షేక్ హాసన్సాహెబ్ స్వస్థలం తిరువూరు సమీపంలోని గంపలగూడెం మండలం గోసవీడు. కానీ తనది భద్రాద్రి అన్నంతగా ఆయన సీతారాముల సేవలో తరించిపోయారు. అందుకేనేమో ఆయన కాలంచేసిన కొద్దికాలానికే జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా తిరువూరులో 1930లో గంపలగూడెం మండలం గోసవీడులో జన్మించారు హాసన్సాహెబ్. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన చిన మౌలా సాహెబ్ వద్ద సంగీత శిక్షణ పొందిన ఆయన భద్రాచలం, యాదగిరి గుట్ట దేవస్థానాల్లో నిలయ విద్వాంసులుగా పనిచేశారు. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం లో కూడా పలు కార్యక్రమాలు అందించారు. పలువురు విద్యార్థులకు సంగీతం లో శిక్షణ ఇవ్వడం తో పాటు సుమారు ఏడు దశాబ్దాల పాటు తిరువూరు త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలలో సంగీత కచేరీలు చేశారు. ఆయనను 1962లో స్వర్ణ కంకణంతో, 2007 లో త్యాగరాజ పరస్కార్ అవార్డుతో గానకళాసమితి సత్కరించింది. 2021 జూన్ 24 న హసన్ సాహెబ్ మృతి చెందారు.
మరణానంతరం పద్మశ్రీ అవార్డు ప్రకటించిన సందర్భంగా ఆయన అభిమానులు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మా ఇంట్లో అందరి పెండ్లిండ్లు ఆయన మధురామృత సన్నాయి మేళంతోనే జరిగాయి. చాల మంచి విద్వాంసుడు భద్రాచలం దేవాలయ ఆస్థాన నాదస్వర పండితుడిగా పనిచేశాడు . నాకు బాల్యం నుండి సన్నిహితుడు . శ్రీరాముడు అంటే ఆయనకు అపారమైన భక్తి ....ఎంత భక్తి అంటే ఆయన పెద్ద కొడుకు పేరు రామ్ తుల్లా అని పెట్టుకున్నాడు . ఇంట్లో రాముడి బొమ్మలు పెట్టుకుని పూజిస్తారు. హాసన్సాహెబ్తో పాటు ఐదు తరాలుగా ఈ కుటుంబానికి చెందినవారు భద్రాద్రి రామయ్యకు సన్నాయి విద్వాంసులుగా ఉన్నారు. ఇంతటి మహా విద్వాంసుడితో బాల్యం నుండి సాన్నిహిత్యం ఉండటం నా అదృష్టం . ఇప్పుడు కూడా ఆయన చిన్న కొడుకు ఖాసీం బాబా భద్రాద్రి దేవాలయంలో తాళం విద్వాంసుడుగా పనిచేస్తున్నాడు . సన్నాయి లో కూడా ప్రావీణ్యం ఉంది . . ఆయన పెద్ద కొడుకు రామ్ తుల్లా హైదరాబాద్ లో ఉంటున్నాడు ...ఇప్పుడే నాతో మాట్లాడి తమ కుటుంబానికి దక్కిన గౌరవానికి సంతోషం వ్యక్తం చేశాడని భద్రాచలం పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు కోన ఆనందకుమార్ హాసన్సాహెబ్తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.
షేక్ హసన్ సాహెబ్ ప్రొఫైల్..
పుట్టిన రోజు:- 01.01.1930 సీతారాముల ఆలయంలో పదవీ కాలం... సుమారు 20 సంవత్సరాలు. భార్య పేరు:- sk. లాల్బీ4 గురు కుమారులు,4 గురు కుమార్తెలు. వీరిలో ముగ్గురు కుమారులు వ్యాపార రంగంలోనూ, 4 వ కుమారుడు భద్రాచల దేవస్థానంలో తాళం ఉద్యోగం చేస్తూ వున్నారు..అందరూ వివాహితులు...
అవార్డులు & బిరుదులు
నాద కోకిల--త్యాగరాజ గాన కళా సమితి, తిరువూరు వారి ద్వారా సువర్ణ ఘంట కంకణం--చిన్న మోలానా సాహెబ్చిలకలూరిపేట వారి ద్వారా....గులాం నబీ ఆజాద్ వారి చేతుల మీదుగా అవార్డులు, సత్కారాలు 1972లో తిరుమల తిరుపతి దేవస్థానం వారితో సన్మానాలు... ఇంకా సుమారు 20 వరకు అనేక అవార్డులను, సత్కారాలు పొందిన మహోన్నత వ్యక్తి... భద్రాచల దేవస్థానంలో ఉద్యోగి కావడం...మాకు గర్వకారణం.....ది.23.6.2021 న వైకుంఠ ప్రాప్తి చెందినవారు....
మరోవైపు మణుగూరు మండలం కూనవరం గ్రామానికి చెందిన ఆదివాసీ కోయడోలి జాతికి చెందిన సకిని రామచంద్రయ్యకు పద్మశ్రీ పురస్కారం లభించింది. సకిని ముసలయ్య, గంగమ్మల సంతానమైన రామచంద్రయ్య చిన్నవయస్సు నుంచే ఆదివాసీలకు చెందిన చరిత్రను పూర్తిస్థాయిలో ఆదివాసీల గూడేల్లో వివరిస్తూ అందరినీ ఆకట్టుకునేవారు. తండ్రి ముసలయ్య నుంచి ఈ కళను నేర్చుకున్న రామచంద్రయ్య సమ్మక్క, సారలమ్మ చరిత్రను సైతం ఆపకుండా రోజుల తరబడి చెబుతుండేవారు. తాత ముత్తాల నుంచి వచ్చిన అబ్బిన ఈ పగిడి, డోళి కళను తన తర్వాతి తరానికి అందించాలని ఆయన తాపత్రయపడుతుంటారు.
తమ జిల్లాలోని మణుగూరు. మండలానికి చెందిన రామచంద్రయ్య పద్మశ్రీ అవార్డు కు ఎంపిక కావడం పట్ల జిల్లా కలెక్టర్ అనుదీప్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డులకు దేశ వ్యాప్తంగా 107 మందిని ఎంపిక చేసిన జాబితాను ప్రకటించగా, జాబితాలో రామ చంద్రయ్య పేరు చూసి తాను ఎంతో సంతోషపడినట్టు కలెక్టర్ అనుదీప్ చెప్పారు. మారు మూల ప్రాంతం నుండి ప్రతిష్టాత్మక పురస్కారానికి గిరిజన వ్యక్తి ఎంపిక కావడం చాలా సంతోషమని, మన జిల్లాకు దేశ స్థాయిలో లభించిన గొప్ప గౌరవమని చెప్పారు. అవార్డు లభించిన రామచంద్రయ్య ఓకల్, ఫోక్ కళాకారుడు.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.