హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: నోటిఫికేషన్లు రావడం లేదని ఆత్మహత్య చేసుకున్న ముత్యాల సాగర్​ కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ కోమటిరెడ్డి.. లక్ష ఆర్థిక సాయం అందజేత

Telangana: నోటిఫికేషన్లు రావడం లేదని ఆత్మహత్య చేసుకున్న ముత్యాల సాగర్​ కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ కోమటిరెడ్డి.. లక్ష ఆర్థిక సాయం అందజేత

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఉద్యోగ నోటిఫికేషన్ రావడం లేదని ముత్యాల సాగర్  రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం ముత్యాల సాగర్ కుటుంబాన్ని కాంగ్రెస్​ సీనియర్​ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించారు

తెలంగాణ (Telangana)లో ఇటీవలి కాలంలో ఏ ఉద్యోగ నోటిఫికేషన్ రావడం లేదని మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా బయ్యారం గ్రామానికి చెందిన ముత్యాల సాగర్  రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం ముత్యాల సాగర్ కుటుంబాన్ని (Muthyala sagar family) కాంగ్రెస్​ సీనియర్​ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (MP Komatireddy Venkatareddy) పరామర్శించారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని ధైర్యం చెప్పి లక్ష రూపాయల ఆర్ధిక సహాయం (One lakh Rupees ) అందించారు.  తెలంగాణ ను కొట్లాడి సాధించుకున్నామని నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ..  ఆత్మహత్య చేసుకున్న ముత్యాల సాగర్ కుటుంబానికి 25 లక్షల రూపాయలు, మూడు ఎకరాల  వ్యవసాయ భూమిని ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కోమటిరెడ్డి మాట్లాడుతూ..  ‘‘ ముత్యాల సాగర్ (Muthyala sagar) తండ్రి భద్రయ్య హమాలీ పని, తల్లి కూలి పనులు చేసుకుంటూ పిల్లలను చదివించుకున్నారు. సాగర్ కూడా హమాలీ పని చేశారు. రాష్ట్రం లో ఉన్న ఖాళీగా ఉన్న రెండు లక్షల పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కేసీఆర్​ కి విజ్ఞప్తి చేస్తున్నా. 70 వేల మంది టీచర్లు రిటైర్ అయ్యారు. తెలంగాణ (Telangnana) ఉద్యమ సమయంలో 610 జీవో లో భాగంగా 70 వేల ఉద్యోగాలు ఆంధ్ర కి తరలిపోయాయని, దొంగ దీక్షలు చేసి కేసీఆర్ అందరినీ మోసం చేశారు.  ఇది న్యాయమేనా ? పదవులు శాశ్వతం కాదు తెలంగాణ కోసం ఎమ్మెల్యే, ఎంపీ,  మంత్రి పదవులకు రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేశాం.

నిరుద్యోగ భృతి మూడు వేల  నూట పదహారు రూపాయలు గత 37 నెలలుగా ఇవ్వలేదు. ప్రతీ నిరుద్యోగికి కేసీఆర్ ప్రభుత్వం లక్ష రూపాయల పైనే బాకీ ఉంది. కాంగ్రెస్ హయాంలో ఆరుసార్లు డీఎస్సీ నోటిఫికేషన్ వేశారు. ఇంత మానవత్వం లేని ప్రభుత్వాన్ని నేనెప్పుడూ చూడలేదు. సొంత పార్టీ ఎమ్మెల్యే , ఎంపీలు మంత్రులకే కేసీఆర్ అపాయింట్​మెంట్​ ఇవ్వరు. బిడ్డ, అల్లుడు, తెలంగాణ ను దోచుకోవడం ఇదే కేసీఆర్ పని.

నిరుద్యోగుల్లో ఆత్మస్థైర్యం కలిగించేలా త్వరలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేయాలి. కేసీఆర్ కు పోయే కాలం దగ్గర పడింది. నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ ఆటలు ఆడుతున్నారు. నిరుద్యోగ భృతి ఇస్తానని కేసీఆర్ మాట తప్పారు. ఒక్కొక్క నిరుద్యోగికి లక్ష రూపాయలు కేసీఆర్ బాకీ పడ్డారు. వెంటనే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి.


నిరుద్యోగ భృతి బాకీ డబ్బులు కూడా నిరుద్యోగులకు ఇవ్వాలి. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే ఓయూ లో కేసీఆర్ పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ పెడుతారా. ఓయూ లో క్రికెట్ టోర్నమెంట్ పెట్టడానికి సిగ్గుండాలి. నిరుద్యోగులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. నిరుద్యోగుల పక్షన కాంగ్రెస్ పోరాటం చేస్తుంది”అని కోమటిరెడ్డి అన్నారు.

First published:

Tags: Khammam, Komatireddy venkat reddy, Mahabubabad, Student suicide, Telangana, TS Congress

ఉత్తమ కథలు