• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • KHAMMAM COLLECTOR ORDER TO ENQUIRY OF TWITTER COMPLAINT OF REMDESIVIR INJECTIONS TO KTR ON TWITTER VRY

Ask KTR ఫలితం .. ఖమ్మం ఆసుపత్రిలో విచారణకు కలెక్టర్ ఆదేశాలు

Ask KTR ఫలితం .. ఖమ్మం ఆసుపత్రిలో విచారణకు కలెక్టర్ ఆదేశాలు

Ask KTR ఫలితం .. ఖమ్మం ఆసుపత్రిలో విచారణకు కలెక్టర్ ఆదేశాలు

Ask KTR :మంత్రి కేటిఆర్ ట్విట్టర్ ద్వార ఫిర్యాదు చేసిన వారికి స్పందించిన కేటిఆర్ ,ఖమ్మంలోని ఓ ప్రవైటు ఆసుపత్రిలో అధిక ధరలకు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు అమ్ముతున్నారంటూ చేసిన ఫిర్యాదు పై విచారణ. ఇందుకోసం ప్రత్యేక అధికారి నియామకం

  • Share this:
మంత్రి కేటిఆర్ గురువారం సాయంత్రం ట్విట్టర్ వేదికగా పలువురు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ముఖ్యంగా కరోనా చర్యలు, ఆసుపత్రుల తీరు, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కొరతతోపాటు ఆక్సిజన్ సప్లై లాంటీ అంశాలపై నెటిజన్లు స్పందించారు. ఇందులో కొన్ని సమస్యలపై వెంటనే సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేయగా మరి కొన్నింటికి తానే స్వయంగా పరిష్కారం చూపారు.

ఈనేపథ్యంలోనే ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని కె.వి.ఆర్ జనరల్ హాస్పిటల్ లో కరోనా పాజిటివ్ కేసు గా గుర్తించి చికిత్సకోసం ఇన్ పేషెంట్ గా చేరిన ఎస్ సాయి జ్యోతి (24) అనే మహిళకు సంబంధించి చికిత్స లో భాగంగా రెమిడిసీవర్ ఇంజక్షన్ లు 6 అత్యవసరంగా అందించాలంటూ వైద్యుడు సిఫారసు   చేయడంతోపాటు, ఒక్కో ఇంజక్షన్ కు గాను 30 వేల రూపాయలు గా నిర్దారించి వసూలు చేసినట్లు బాధితురాలికి సంబంధించిన ఉమేష్ అనే వ్యక్తి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశాడు.

దీనిపై తక్షణమే స్పందించిన మంత్రి కేటీఆర్ పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించాలంటూ. జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్పందించిన కలెక్టర్ క్షేత్రస్థాయిలో సంబంధిత పిర్యాదుపై విచారణ నిర్వహించాలని ఆదేశిస్తూ ఇందుకు ప్రత్యేక అధికారిని నియమించినట్లు తెలుస్తోంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆసుపత్రులతోపాటు అందుతున్న వైద్య సేవల విషయమై కూడా పలు ఫిర్యాదులు చేశారు. అయితే వీటన్నింటిపై స్పందించిన కేటిఆర్ వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Published by:yveerash yveerash
First published: