హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : దసరా మామూళ్లు అడిగినంత ఇవ్వలేదని హిజ్రాలు ఏం చేశారో తెలుసా ..?

Telangana : దసరా మామూళ్లు అడిగినంత ఇవ్వలేదని హిజ్రాలు ఏం చేశారో తెలుసా ..?

transgenders attack

transgenders attack

Telangana: దసరా మామూళ్ల కోసం మధిర మండల పరిధిలోని ఇల్లందులపాడు దగ్గరున్న విజయదుర్గ కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం సిబ్బందిపై హిజ్రాలు దాడి చేశారు. అడిగినంత ఇవ్వలేదనే కోపంతో చేసిన బీభత్సం సీసీ కెమెరాలో రికార్డైంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Khammam, India

  (G.SrinivasReddy,News18,Khammam)

  అది పెళ్లైనా.. పేరంటమైనా .. చివరకు గృహ ప్రవేశమైనా ఇంకా ఏ విధమైన చిన్నపాటి శుభకార్యమైనా.. ట్రాన్స్‌జెండర్స్(Transgenders)ఓ సమూహంగా వాలిపోతారు. డబ్బు కోసం డిమాండ్ చేయడం.. అడిగినంత ఇవ్వలేదని గొడవకు దిగడం, న్యూసెన్స్(Nuisance)క్రియేట్ చేయడం ఈ మధ్య కాలంలో పరిపాటిగా మారింది. ఎక్కడెక్కడ శుభకార్యాలు జరుగుతున్నాయో ముందుగానే చూసుకుని, రష్ గా ఉన్న సమయంలో ఒక్కసారి గుంపుగా వస్తున్నారు. గొడవెందుకులే అనుకుని కొందరు అడిగినంత ఇచ్చుకుని పంపేస్తుండగా, కొందరు కాదనడంతో రగడ స్టార్ట్ చేస్తారు. అప్పటికి తమ పని కాకపోతే జగడానికి దిగాతారు.

  Telangana : బాన్సువాడలో మళ్లీ పోటీ చేసేది నేనే .. వారసుడి ఆశలపై నీళ్లు చల్లిన స్పీకర్

  హిజ్రాల దౌర్జన్యం..

  తాజాగా ఖమ్మం జిల్లా మధిర మండలం ఇల్లందులపాడు గ్రామంలో దారుణం జరిగింది. దసరా మామూళ్ల కోసం మధిర మండల పరిధిలోని ఇల్లందులపాడు దగ్గరున్న విజయదుర్గ కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం సిబ్బందిపై హిజ్రాలు దాడి చేశారు. దసరా మామూలు పేరుతో బీభత్సం సృష్టించారు. పండుగ మాములు 25,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు హిజ్రాలు. అందుకు యజమాని నిరాకరించటంతో సిబ్బందిని పరిగెత్తించి మరీ కేకలు వేస్తూ దాడి చేశారు. అడ్డొచ్చిన వారిని సైతం వదలకుండా చితకబాదారు. కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యంపై హిజ్రాలు దాడి చేసి అక్కడి సిబ్బందిని ఇష్టానుసారం కొట్టారు.

  మామూళ్ల కోసం వచ్చి దాడి..

  తీవ్రగాయాల పాలైన స్టోరేజీ సిబ్బంది హిజ్రాల సృష్టించిన బీభత్సానికి భయపడి పారిపోయారు. దాడిలో 25 మంది హిజ్రాలు పొల్గొన్నట్టు సీసీ ఫుటేజి ద్వారా వెల్లడైంది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పండుగ మామూళ్ల పేరుతో దౌర్జన్యం చేస్తే సహించేది లేదని .. ఇచ్చినంత తీసుకోవాలని పోలీసులు హిజ్రాలకు సూచిస్తున్నారు.

  Murder : ప్రియుడితో కలిసి భర్తను చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన భార్య

  ఎక్కడికి వెళ్లినా వదలరు..

  ట్రైన్లలో, రోడ్లపై ఒంటరిగా ఉండే వ్యక్తులను అడ్డగించి డబ్బులు వసూలు చేస్తూనే ఉంటారు. డబ్బులు లేవని ఎవరైనా చెప్పినా వదలిపెట్టకుండా వాళ్లతో గొడవకు దిగడం, వాళ్లపై అసభ్యపదజాలంతో దూషించడం, చివరకు వాళ్లను కొట్టినంత పని చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే సమాజంలో లింగమార్పిడి చేసుకున్న వ్యక్తులకు గౌరవం దక్కకపోవడానికి ఇలాంటివే కొన్ని కారణమవుతున్నాయని అంటున్నారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Khammam, Telangana crime news

  ఉత్తమ కథలు