హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ..వాహనదారులకు అలెర్ట్..మారిన రూట్లు..పూర్తి వివరాలివే..

ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ..వాహనదారులకు అలెర్ట్..మారిన రూట్లు..పూర్తి వివరాలివే..

బహిరంగ సభతో రూట్లలో మార్పులు

బహిరంగ సభతో రూట్లలో మార్పులు

ఈనెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు సీఎం కేసీఆర్ సహా ఇతర రాష్ట్రాల సీఎంలు, పలువురు నాయకులు పాల్గొనున్నారు. ఈ క్రమంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో ఒక అడిషనల్ డీజీ ర్యాంకు అధికారి పర్యవేక్షణలో ముగ్గురు ఐజీలు, నలుగురు డిఐజీలు, ఇంకా వరంగల్ ఖమ్మం సీపీలు సహా భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల ఎస్పీలు ప్రత్యక్షంగా బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Khammam | Telangana

(G.SrinivasReddy,News18,Khammam)

ఈనెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు సీఎం కేసీఆర్ సహా ఇతర రాష్ట్రాల సీఎంలు, పలువురు నాయకులు పాల్గొనున్నారు. ఈ క్రమంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో ఒక అడిషనల్ డీజీ ర్యాంకు అధికారి పర్యవేక్షణలో ముగ్గురు ఐజీలు, నలుగురు డిఐజీలు, ఇంకా వరంగల్ ఖమ్మం సీపీలు సహా భద్రాద్రి కొత్తగూడెం , మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల ఎస్పీలు ప్రత్యక్షంగా బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 4,198 మంది పోలీసు బలగాలతో ఈ బహిరంగ సభకు కాపలా ఏర్పాటు చేశారు. ఢిల్లీ పంజాబ్ కేరళ ముఖ్యమంత్రి సహా  యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా హాజరు కానున్నారు. దీంతో ఈ బహిరంగ సభకు ప్రాధాన్యం పెరిగింది.

గడిచిన  వారం రోజులుగా మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన బిఆర్ఎస్ యంత్రాంగం మొత్తం బహిరంగ సభను విజయవంతం చేయడంలో నిమగ్నమైంది. ఖమ్మం నగరానికి సమీపంలో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం పక్కనే 100 ఎకరాల్లో ఈ బహిరంగ సభ జరగనుంది. దీనికోసం భారీగా బందోబస్తు ఏర్పాట్లు ట్రాఫిక్ నియంత్రణ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి ఖమ్మం మీదుగా వెళ్లే రహదారుల్లో ట్రాఫిక్ ను మళ్ళిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం మీదుగా వైజాగ్ వెళ్లే రోడ్డు రూట్ సహా..ఇతర ప్రధాన రహదారుల్లోని ట్రాఫిక్ ను వేరే రూట్ లకు మళ్ళిస్తున్నారు.

 ఏ రూట్ ఎలా అంటే...

ఈనెల  18న ఉదయం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఖమ్మంకు వచ్చు సాధారణ మరియు భారీ వాహనాల ట్రాఫిక్ ను క్రమబద్దీకరించుటలో భాగంగా ఈ క్రింద తెలిపిన రూట్లలో దారి మళ్లించటం జరుగుతుంది.

దారి మళ్లించిన వాహనాలు వెళ్ళు మార్గాలు:

సూర్యాపేట టౌన్ నుండి ఖమ్మం కొత్త బైపాస్ రోడ్డు వైపుకు (కొత్త హైవే) వచ్చు సత్తుపల్లి, రాజమండ్రి , విశాఖపట్నం వెళ్ళు వాహనాలు కోదాడ హైవే మీదుగా విజయవాడ వైపు  దారి మళ్లించడం జరిగింది.

సూర్యాపేట టౌన్ నుండి ఖమ్మం పాత రోడ్డు వైపుకు సత్తుపల్లి, రాజమండ్రి, విశాఖపట్నం వెళ్ళు వాహనాలు కోదాడ హైవే మీదుగా విజయవాడ వైపు దారి మళ్లించటం జరిగింది.

సూర్యాపేట టౌన్ నుండి ఖమ్మం పాత బైపాస్ రోడ్డు వైపునకు సత్తుపల్లి, రాజమండ్రి, విశాఖపట్నం వెళ్ళు వాహనాలు కోదాడ హైవే మీదుగా విజయవాడ వైపు  దారి మళ్లించటం జరిగింది.

కోదాడ నుండి ఖమ్మం వైపు కు వచ్చు వాహనాలు విజయవాడ హైవే వైపుకు దారి మళ్లించటం జరిగింది.

కూసుమంచికి వచ్చిన సత్తుపల్లి, రాజమండ్రి, విశాఖపట్నం వెళ్ళు వాహనాలు మూటాపురం, నేలకొండపల్లి కోదాడ హైవే మీదుగా విజయవాడ వైపు దారి మళ్లించటం జరిగింది.

ఖమ్మం రూరల్ PS లిమిట్స్ లోని వేంకటగిరి క్రాస్ రోడ్డు వైపు కు వచ్చు వాహనాలు, వేంకటగిరి/ ముదిగొండ – వల్లభి వైపు - చిల్లకల్లు హైవే మీదుగా విజయవాడ వైపు దారి మళ్లించటం జరిగింది.

ఖమ్మం రూరల్ లిమిట్స్ లోని కోదాడ క్రాస్ రోడ్డు కి వచ్చిన సత్తుపల్లి, రాజమండ్రి, విశాఖపట్నం వెళ్ళు వాహనాలు వేంకటగిరి క్రాస్ రోడ్,  నేలకొండపల్లి కోదాడ హైవే మీదుగా విజయవాడ వైపు దారి మళ్లించటం జరిగింది.

ఖమ్మం రూరల్ లిమిట్స్ లోని నాయుడుపేట జంక్షన్ కి వరంగల్ వైపు నుండి వచ్చిన సత్తుపల్లి, రాజమండ్రి, విశాఖపట్నం వెళ్ళు వాహనాలు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్,  కోదాడ క్రాస్ రోడ్డు-వేంకటగిరి  క్రాస్ రోడ్,  నేలకొండపల్లి -కోదాడ హైవే మీదుగా విజయవాడ వైపు దారి మళ్లించటం జరిగింది.

పెనుబల్లి టౌన్ కి సత్తుపల్లి, రాజమండ్రి వైపు నుండి వచ్చిన వాహనాలు తిరువూరు- మైలవరం- విజయవాడ వైపు దారి మళ్లించటం జరిగింది.

తల్లాడకు సత్తుపల్లి, రాజమండ్రి వైపు నుండి వరంగల్ వైపు వెళ్ళు వాహనాలు  ఏన్కూర్, తిమ్మారావు పేట, ముచెర్ల క్రాస్ రోడ్డు మీదుగా డోర్నకల్ వైపు  దారి మళ్లించటం జరిగింది.

ఏన్కూర్ కు కొత్తగుడెం, తల్లాడ వైపు నుండి వచ్చు వాహనాలు  ఏన్కూరు, తిమ్మారావు పేట, ముచ్చేర్ల క్రాస్ రోడ్డు మీదుగా  డోర్నకల్-మహబూబాబాద్ వైపు దారి మళ్లించటం జరిగింది.

వైరా టౌన్ కు తల్లాడ, సత్తుపల్లి, రాజమండ్రి వైపు నుండి హైదరాబాద్, వరంగల్ వైపు వెళ్ళు వాహనాలు  పాలడుగు–బోనకల్, చిల్లకల్లు హైవే వైపుకు మళ్లించటం జరిగింది.

పల్లిపాడుకు ఏన్కూర్, జన్నారం వైపు నుండి వచ్చు వాహనాలు వైరా-పాలడుగు-బోనకల్, చిల్లకల్లు హైవే వైపుకు దారి మళ్లించటం జరిగింది.

ములకలపల్లి క్రాస్ రోడ్డుకు కురవి, మహబూబాబాద్ నుండి హైదరాబద్, విజయవాడ వెళ్ళు వాహానాలు ఎదులపురం సర్కిల్ మీదుగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్-కోదాడ క్రాస్ రోడ్డు-వేంకటగిరి  క్రాస్ రోడ్, నేలకొండపల్లి -కోదాడ హైవే మీదుగా విజయవాడ వైపు  దారి మళ్లించటం జరిగింది.

వరంగల్ రోడ్డులోని ఏదులాపురం క్రాస్ రోడ్డుకు వరంగల్ వైపు నుండి సత్తుపల్లి, రాజమండ్రి, విశాఖపట్నంకు వెళ్ళు వాహానాలు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్,  కోదాడ క్రాస్ రోడ్డు-వేంకటగిరి  క్రాస్ రోడ్, నేలకొండపల్లి -కోదాడ హైవే మీదుగా విజయవాడ వైపు దారి మళ్లించటం జరిగింది.

బోనకల్ గ్రామ సెంటర్ నుండి వచ్చు వాహనాలు తిరిగి చిల్లకల్లు వైపుకు దారి మళ్లించటం జరిగింది.

ఇల్లందు రోడ్డులోని ముచ్చర్ల క్రాస్ రోడ్డు వైపు కు వచ్చిన వాహనాలు డోర్నకల్, మహబూబాబాద్ మీదుగా దారి మళ్లించటం జరిగింది.

మరిపెడ బంగ్లాకు వరంగల్ వైపు నుండి సత్తుపల్లి, రాజమండ్రి, విశాఖపట్నంకు వెళ్ళు వాహానాలు  ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ -కోదాడ క్రాస్ రోడ్డు-వేంకటగిరి  క్రాస్ రోడ్,  నేలకొండపల్లి -కోదాడ హైవే మీదుగా విజయవాడ వైపు దారి మళ్లించటం జరిగింది.

కావున ప్రజలందరికి మనవి చేయునది ఏమనగా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండుట వలన అత్యవసర ప్రయాణాలు తప్ప, అనవసర ప్రయాణాలు చేయకండి. ట్రాఫిక్ లో ఇరుక్కొని ఇబ్బంది పడవలసి వస్తుంది. కావున తేది 18.01.2023న ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు దారి మళ్లించిన మార్గాలను గుర్తించి ఆ మార్గాలలో మీ ప్రయాణాలను కొనసాగించి ఖమ్మం పోలీస్ వారికి సహకరించగలరని సీపీ విష్ణు వారియర్ కోరారు.

First published:

Tags: Kcr, Khammam, Telangan traffic police, Telangana

ఉత్తమ కథలు