హోమ్ /వార్తలు /తెలంగాణ /

CPI | CPM: పోరాటాల గడ్డకు అరుదైన గౌరవం.. వామపక్ష పార్టీల సారథ్య బాధ్యతలు ఖమ్మం వాసులకే

CPI | CPM: పోరాటాల గడ్డకు అరుదైన గౌరవం.. వామపక్ష పార్టీల సారథ్య బాధ్యతలు ఖమ్మం వాసులకే

వీరభద్రం, కూనంనేని సాంబ శివరావు (ఫైల్​ ఫొటోలు)

వీరభద్రం, కూనంనేని సాంబ శివరావు (ఫైల్​ ఫొటోలు)

సీపీఐ (CPI), సీపీఎం (CPM) పార్టీల రాష్ట్ర నాయకత్వం ఒకేసారి ఖమ్మం (Khammam) జిల్లా వాసులకు దక్కింది. ఇప్పటికే సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం ఉండగా, తాజాగా సీపీఐ సారధ్య బాధ్యతలు సైతం ఉమ్మడి జిల్లా వాసికే దక్కాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Khammam, India

(G. Srinivas Reddy, News18, Telugu)సీపీఐ (CPI), సీపీఎం (CPM) పార్టీల రాష్ట్ర నాయకత్వం ఒకేసారి ఖమ్మం (Khammam) జిల్లా వాసులకు దక్కింది. ఇప్పటికే సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం (Tammineni Veera Bhadram) ఉండగా, తాజాగా సీపీఐ సారధ్య బాధ్యతలు సైతం ఉమ్మడి జిల్లా వాసికే దక్కాయి.  సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు (Koonamneni Sambasiva Rao) ఎన్నికయ్యారు. శంషాబాద్ లో నిర్వహించిన సీపీఐ 3వ రాష్ట్ర మహాసభల్లో ఈ ఎన్నికకు సంబంధించి నిన్న అర్ధరాత్రి వరకు వాడీ వేడి చర్చలు నడిచాయి. రాష్ట్ర కార్యదర్శి పదవికి కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకట్ రెడ్డి పోటీ పడ్డారు. ఎన్నిక ఏకగ్రీవం కావడానికి కీలక నేతలు ప్రయత్నించినప్పటికీ ఇద్దరూ పట్టు విడవలేదు. దీంతో ఓటింగ్ నిర్వహించారు. ఎన్నికలో కూనంనేనికి 59, పల్లాకు 45 ఓట్లు పడ్డాయి. దీంతో, కూనంనేని గెలుపొందినట్టు పార్టీ వర్గాలు ప్రకటించాయి. గతంలో కొత్తగూడెం (Kothagudem) ఎమ్మెల్యేగా కూనంనేని పని చేశారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పని చేశారు.
మరోవైపు, తెలంగాణ (Telangana) ఏర్పడినప్పటి నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా చాడ వెంకట్ రెడ్డి (Chada Venkat reddy) రెండు సార్లు ఎన్నికయ్యారు. ఇప్పుడు మూడో సారి కూడా అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే, తన ఎన్నిక ఏకగ్రీవం కావాలని ఆయన పార్టీ శ్రేణులకు చెప్పారు. అయితే, ఈసారి అవకాశం తనకు ఇవ్వాలని కూనంనేని పట్టుబట్టడంతో… చాడ వెంకటరెడ్డి తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఈ క్రమంలో పల్లా వెంకటరెడ్డి (Palla Venkat redddy) తెరపైకి వచ్చారు. చివరకు కూనంనేని రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు.


గుంటూరు జిల్లా సంగుపాలెం కోడూరు గ్రామంలో జన్మించిన  కూనంనేని సాంబశివరావు విశాలాంధ్ర విలేకరిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బొగ్గు గనుల కేంద్ర కార్యాలయం ఉన్న కొత్తగూడెంకు వచ్చారు . విలేకరిగా ఉంటూనే ప్రజా ఉద్యమాలకు ఆకర్షితులైయ్యారు . తోడేటి కొమరయ్య స్పూర్తితో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. కార్మిక , కర్షక , యువజన ,విద్యార్ధి ఉద్యమాలకు చుక్కానిగా నిలిచారు . ఆటో వర్కర్స్ యూనియన్ తరుపున జరిగిన ఆందోళనలో పాల్గొని జైలుకు వెళ్లారు . కొత్తగూడెం ప్రజల పక్షాన నిలిచే ఒక నాయకుడు దొరికాడని అక్కడ ప్రజలు భావించారు . దీంతో అంచలంచలుగా ఎదిగిన సాంబశివరావు , అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు . కొత్తగూడెం ఎంపీపీ గా , కొత్తగూడం ఎమ్మెల్యేగా సిపిఐ తరుపున ఎన్నికైయ్యారు .
Governor Tamilisai: నన్ను అవమానించారు.. తెలంగాణ గవర్నర్ తమిళిసై​ సంచలన వ్యాఖ్యలు
ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన కూనంనేని జిల్లా ఉద్యమ విస్తరణలో తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకున్నారు . 1984 లో కొత్తగూడెం పట్టణ సీపీఐ కార్యదర్శి గా ఎన్నికయ్యారు .1987 లో జరిగిన ఎన్నికల్లో కొత్తగూడెం ఎం పి పి (MPP)గా ఎన్నికయ్యారు.2004 ఖమ్మంలో జరిగిన మహాసభలో అప్పటి ఖమ్మం జిల్లా కార్యదర్శి గా ఎన్నికయ్యారు 2007 లో తిరిగి కార్యదర్శి గా ఎన్నికైన సాంబశివరావు 2009 లో కొత్తగూడెం నుంచి శాసనసభ కు ఎన్నికయ్యారు. శాసనసభ లో సీపీఐ పక్ష ఉప నాయకునిగా పనిచేశారు. హైదరాబాద్ లో జరిగిన సీపీఐ తెలంగాణ రాష్ట్ర రెండవ మహాసభలో సహాయ కార్యదర్శి గా ఎన్నికయ్యారు.

First published:

Tags: CPI, CPM, Khammam, Telangana Politics

ఉత్తమ కథలు