Ponguleti Srinivas Reddy: బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తరువాత ఖమ్మం కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఏ పార్టీలో చేరతారన్నది ఇంకా క్లారిటీ రాలేదు. మొదట బీజేపీ ఆ తర్వాత వైఎస్సార్ తెలంగాణ పార్టీ అలాగే కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగింది. కానీ ఏ పార్టీలో చేరాలనేదానిపై పొంగులేటి ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అయితే ఈ ఊగిసలాటలో ఉన్న పొంగులేటి (Ponguleti Srinivas Reddy)కి ఆయన అనుచరుడు ఊహించని షాకిచ్చారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ముఖ్య అనుచరుడు మట్ట దయానంద్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తుంది. గాంధీభవన్ లో రేవంత్ రెడ్డి సమక్షంలో దయానంద్ హస్తం పార్టీ కండువా కప్పుకోనున్నారు. అయితే దయానంద్ దారిలో మరికొంతమంది కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది. కాగా పొంగులేటి (Ponguleti Srinivas Reddy) మట్ట దయానంద్ ను సత్తుపల్లి అభ్యర్థిగా గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అనుచరుడి చేరికతో పొంగులేటి అలెర్ట్ అయినట్లు తెలుస్తుంది.
బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన పొంగులేటి (Ponguleti Srinivas Reddy) మొదట కమలం కండువా కప్పుకుంటారని అంతా భావించారు. ఇందుకు అనుగుణంగా బీజేపీ పెద్దలు పొంగులేటితో చర్చలు జరిపారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ ఆయన బీజేపీలో చేరికపై స్పష్టత రాలేదు. ఆ తర్వాత షర్మిల, విజయమ్మతో పొంగులేటి భేటీ అయ్యారు. దీనితో YSRTPలోకి పొంగులేటి చేరిక ఖాయమైందనే ప్రచారం జరిగింది. ఇక ఆ తర్వాత పొంగులేటి చూపు కాంగ్రెస్ పై పడిందని..చర్చలు కూడా జరిపారనే వార్తలు వచ్చాయి. కానీ నెలలు గడుస్తున్నా పొంగులేటి (Ponguleti Srinivas Reddy) చేరబోయే పార్టీపై స్పష్టత కరువైంది.
ఇదిలా ఉంటే గురువారం హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తో పొంగులేటి,జూపల్లి కృష్ణారావు రహస్య మంతనాలు జరిపినట్లు తెలుస్తుంది. బీజేపీలో చేరాలని పొంగులేటి (Ponguleti Srinivas Reddy) ని ఆహ్వానించినట్టు తెలుస్తుంది. అయితే ఇటీవల ఢిల్లీకి వెళ్లిన ఈటెలకు అధిష్టానం ఏమైనా సంకేతాలు ఇచ్చిందా? పొంగులేటి హామీలకు ఎలాంటి క్లారిటీ ఇచ్చింది? హైకమాండ్ ఆదేశాలతోనే ఈ చర్చలు జరుగుతున్నాయా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే గతంలో బహిరంగంగా భేటీ అయిన ఈటెల ఈసారి రహస్యంగా భేటీ అవ్వడం వెనక ఉన్న మతలబు తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Khammam, Ponguleti srinivas reddy, Telangana