హోమ్ /వార్తలు /తెలంగాణ /

Khammam: బీజేపీ కార్యకర్త సాయి గణేశ్​ ఇంట మరో విషాదం.. తరలివెళుతున్న బీజేపీ నేతలు.. పోలీసుల భారీ బందోబస్తు

Khammam: బీజేపీ కార్యకర్త సాయి గణేశ్​ ఇంట మరో విషాదం.. తరలివెళుతున్న బీజేపీ నేతలు.. పోలీసుల భారీ బందోబస్తు

బీజేపీ కార్యకర్త సాయి గణేష్ (ఫైల్​)

బీజేపీ కార్యకర్త సాయి గణేష్ (ఫైల్​)

బీజేపీ కార్యకర్త సామినేని సాయిగణేష్‌ ఆత్మహత్య  జాతీయ స్థాయిలో పెద్ద ఇస్యూ అయింది. అయితే సాయిగణేష్‌ ఆత్మహత్య నుంచి ఆ కుటుంబం కోలుకోక ముందే ఆ ఇంట్లో మరో విషాదం చోటుచేసుకుంది. 

(జి.శ్రీనివాసరెడ్డి, న్యూ స్‌18 తెలుగు, ఖమ్మం జిల్లా)

బీజేపీ (BJP) కార్యకర్త సామినేని సాయిగణేష్‌ ఆత్మహత్య (sai ganesh Suicide)  జాతీయ స్థాయిలో పెద్ద ఇస్యూ అయింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సైతం సాయిగణేష్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడటం, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్వయంగా వచ్చి సాయిగణేష్‌ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. సాయిగణేష్‌ మృతికి సంబంధించి సీబీఐతో విచారణ జరిపించాలని దాఖలైన కేసులో, రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, స్థానిక కార్పొరేటర్​ భర్త ప్రసన్న కృష్ణ, త్రీటౌన్‌ సీఐ సర్వయ్యలతో బాటు సీపీకి సైతం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే సాయిగణేష్‌ ఆత్మహత్య  (sai ganesh Suicide) నుంచి ఆ కుటుంబం కోలుకోక ముందే ఆ ఇంట్లో మరో విషాదం (Another Tragedy) చోటుచేసుకుంది.

సాయి లేని బతుకు తనకు అక్కర్లేదని..

అతని ప్రియురాలు ఆత్మహత్యకు  (Lover attempted suicide) ప్రయత్నించింది.  సాయిగణేష్‌ను విజయ అనే యువతి ప్రేమించింది.  మే 4న సాయిని  పెళ్లి చేసుకోవాలని కలలు కన్నది. అయితే సాయిగణేశ్​ ఆత్మహత్య చేసుకోవడంతో  తన ప్రేమికుని ఎడబాటును తట్టుకోలేక తనువు చాలించాలని ప్రయత్నించింది విజయ (Vijaya). నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది (Sai Ganesh Lover Vijaya attempted suicide).   విజయకు ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సాయి లేని బతుకు తనకు అక్కర్లేదని తన కుటుంబ సభ్యులతో చెప్పినట్టు ప్రచారం సాగుతోంది. అంతేకాదు సాయిగణేష్‌ ఫేస్‌బుక్‌ (sai Ganesh Facebook) ఖాతాలో సాయిలేని బతుకు తనకు అక్కర్లేదని, తాను సాయి దగ్గరకే వెళ్తున్నట్టు రాసుకుంది. తాను ప్రేమించిన వ్యక్తి ఎడబాటు వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని ఆమె ఫేస్‌బుక్‌ పోస్టింగ్స్‌ను బట్టి అంచనా వేస్తున్నారు.

ఆసుపత్రిలో విజయ

ఎవరీ విజయ?

జెర్రిపోతుల విజయ (Jerripothula Vijaya). ఖమ్మం జిల్లా మహిళా మోర్చా జిల్లా అధికార ప్రతినిధిగా ఆమె బీజేపీలో క్రియాశీలంగా పనిచేస్తున్నారు. ఆదివాసీ తెగకు చెందిన విజయ, సాయిగణేష్‌లు ప్రేమించుకున్నారు (Loved each other). మే నెల 4వ తేదీన మహబూబాబాద్‌ (Mahabubabad) జిల్లా కురవిలోని వీరభద్రస్వామి దేవాలయంలో వివాహం చేసుకోవాలని ఏర్పాట్లు చేసుకున్నారు. అంతలోనే తనపై కేసులు మోపి వేధిస్తున్నారని ఆవేదనకు గురైన సాయిగణేష్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం.. మెరుగైన వైద్యం కోసం  అతన్ని హైదరాబాద్‌ తరలించినా మూడో రోజు మృతిచెందడం జరిగిపోయింది.

ఆసుపత్రి వద్ద పోలీసులు

ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు..

రాజకీయ ప్రకంపనలకు దారితీసిన సామినేని సాయిగణేష్‌ ఆత్మహత్య (sai ganesh suicide) కేసు ముగియక ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. విజయను ఐసీయూకు తరలించి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. ఆమెను పరామర్శించడానికి, ఆరోగ్య పరిస్థితి తెలుసుకోడానికి ఆసుపత్రికి వచ్చిన భాజపా నేతలను పోలీసులు వారించారు. ఎవరినీ అనుమతించలేదు. ఆసుపత్రి వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. లాఅండ్‌ ఆర్డర్‌ అడిషనల్‌ డీసీపీ సుభాష్‌ చంద్రబోస్‌ ఆధ్వర్యంలో ఇద్దరు ఏసీపీలు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయ స్టేట్‌మెంట్‌ను ఎక్సైజ్‌ కోర్టు న్యాయమూర్తి రికార్డు చేశారు.

First published:

Tags: Attempt to suicide, Bjp, Khammam, Trs

ఉత్తమ కథలు