హోమ్ /వార్తలు /తెలంగాణ /

Government Hospital: ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలకు నిదర్శనం ఈ ఘటన.. మంత్రి ఏమన్నారంటే..

Government Hospital: ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలకు నిదర్శనం ఈ ఘటన.. మంత్రి ఏమన్నారంటే..

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి

Government Hospital: ఆమె ఓ ఐఏఎస్‌ అధికారిణి. ఆమె భర్త ఐపీఎస్‌ అధికారి. అనుకుంటే ఆమె ఆధునిక వసతులున్న ఏదైనా కార్పోరేట్‌ ఆసుపత్రిలో వైద్య సౌకర్యం పొందే వీలుంది. కానీ ఆమె అలా అనుకోలేదు. ఓ సాధారణ స్త్రీలాగే తానూ ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. తొలి నుంచి ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలోనే వైద్య సేవలు పొందుతూ కాన్పు కోసం ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చేరారు.

ఇంకా చదవండి ...

  (G.SrinivasaReddy,News18,Khammam)

  ఆమె ఓ ఐఏఎస్‌(IAS) అధికారిణి. ఆమె భర్త ఐపీఎస్‌ అధికారి. అనుకుంటే ఆమె ఆధునిక వసతులున్న ఏదైనా కార్పోరేట్‌ ఆసుపత్రిలో( Corporate Hospital) వైద్య సౌకర్యం పొందే వీలుంది. కానీ ఆమె అలా అనుకోలేదు. ఓ సాధారణ స్త్రీలాగే తానూ ప్రభుత్వ ఆసుపత్రిలో (Government Hospital) బిడ్డకు జన్మనివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. తొలి నుంచి ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలోనే వైద్య సేవలు పొందుతూ కాన్పు కోసం ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చేరారు. గైనకాలజిస్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. కాన్పు అనంతరం కూడా ప్రభుత్వ పరంగా ఇచ్చే కేసీఆర్‌ కిట్‌ను (KCR Kit) వైద్యులు ఆమెకు అందించారు.

  Crime News: ఈ మహిళ పోరాడి అనుకున్నది సాధించింది.. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేకపోయింది..


  ఏ ఆధారం లేనివాళ్లు.. ఆర్థిక స్థితి సరిగా లేనివాళ్లే కాదు.. వీఐపీలు (VIPs) సైతం వైద్య సేవల కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడం సహజంగానే ఖమ్మం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి వైద్య సేవల నాణ్యతను పెంచినట్లయింది. ఇప్పటికే ఈ ఆసుపత్రికి కేంద్ర ప్రభుత్వ కాయకల్ప అవార్డులు పలుమార్లు దక్కడం తెలిసిందే. తాజాగా జిల్లా అడిషనల్‌ కలెక్టర్ (లోకల్‌ బాడీస్‌) స్నేహలత మొగిలి ఈ ఆసుపత్రిలో తన తొలికాన్పు కోసం చేరడం ప్రభుత్వ ఆసుపత్రి ప్రతిష్టను పెంచినట్లయింది. ఆమె భర్త శబరీష్ మణుగూరు ఏఎస్పీగా పనిచేస్తున్నారు.

  Telangana RTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం.. వివరాలివే


  అభనిందించిన మంత్రి పువ్వాడ.. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో అడిషనల్ కలెక్టర్ (Additiona Colletor) స్నేహలత మొగిలి ప్రసవం తెలుసుకున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ (Minister Puvvada Ajaykumar) ఆమెను పరామర్శించి, అభినందించారు. పండంటి బిడ్డను ఎత్తుకొని లాలించారు. జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ఒక అడిషనల్ కలెక్టర్ కాన్పు అయితే చూడడానికి రావడం ఆనందంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ప్రభుత్వ ఆసుపత్రులకు ఇస్తున్న ప్రాధాన్యత కు ఇంతకన్నా నిదర్శనం ఏముంటుందని పేర్కొన్నారు.

  అతడికి వివాహం జరిగి నాలుగు నెలలు.. ఆ ఒక్క మాట పేపర్ పై రాసి భార్య బ్యాగులో వేశాడు.. చివరకు ఏం జరిగిందంటే..


  ఇది సీఎం కేసీఆర్ పాలనకు, రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవల నాణ్యతను చెప్పకనే చెప్పినట్లయిందన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలకు ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని, ప్రజలలో ప్రభుత్వ వైద్య సేవల పై మరింత నమ్మకం పెరిగేందుకు తన తొలి కాన్పు ను జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చేయించుకున్న స్నేహలతను ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందించారు.

  Published by:Veera Babu
  First published:

  Tags: Khammam

  ఉత్తమ కథలు