Home /News /telangana /

KHAMMAM A GOVERNMENT DOCTOR IN KHAMMAM DEMANDED THE VICTIM TO GIVE CERTIFICATES ONLY IF SHE SLEPT WITH HIM KMM PRV

Criminal Doctor: ఇతనో రాక్షస వైద్యుడు.. అలా చేస్తే చాలట ఎలాంటి సర్టిఫికెట్​ కావాలన్నా ఇచ్చేస్తాడట..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అతనో డాక్టర్‌. పైగా ప్రభుత్వ వైద్యుడు. ఇంకా సేవాభావంతో పనిచేయాల్సిన ఆ వైద్యుడు చేసిన పిచ్చి చేష్టలు ఓ మహిళ ఆత్మగౌరవానికి సవాలు విసిరాయి. తన తండ్రి వైకల్యాన్ని నిర్ధరించి సర్టిఫికెట్‌ ఇవ్వాలని కోరిన ఒక యువతికి చేదు అనుభవం ఎదురైంది

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    (G. Srinivas reddy, News18, Khammam)

    అతనో డాక్టర్‌. పైగా ప్రభుత్వ వైద్యుడు (Government Doctor). ఇంకా సేవాభావంతో పనిచేయాల్సిన ఆ వైద్యుడు చేసిన పిచ్చి చేష్టలు ఓ మహిళ ఆత్మగౌరవానికి సవాలు విసిరాయి. తన తండ్రి వైకల్యాన్ని నిర్ధరించి సర్టిఫికెట్‌  (Certificates)ఇవ్వాలని కోరిన ఒక యువతికి చేదు అనుభవం ఎదురైంది. తన దగ్గర పడుకుంటేనే.. తనను సుఖపెడితేనే నువ్వు కోరినట్టు ఎలా కావాలంటే అలా సర్టిఫికెట్‌ ఇప్పిస్తానని ఆ వైద్యుడు చెప్పడంతో ఆమె షాక్‌కు గురైంది. నడవలేని దీనావస్థలో ఉన్న తండ్రిని వెంటబెట్టుకుని ఆసుపత్రికి వెళ్లిన తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వైద్యునిపై ఆ యువతి ఆసుపత్రి ఉన్నతాధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఖమ్మం (Khammam) ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో (Government Hospital) చోటుచేసుకున్న ఈ ఘటనపై వైద్యాధికారులు విచారణకు ఆదేశించారు.

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన ఓ మహిళ తమకు సమీపంలోని గవర్నమెంట్‌ జనరల్‌ ఆసుపత్రి కాబట్టి ఖమ్మం జనరల్‌ ఆసుపత్రికి  (Khammam General hospital) వచ్చారు. తండ్రికి పింఛన్‌ రావాలంటే వైద్యులు ధృవీకరించాల్సి ఉంది. దీంతో ఆమె తండ్రిని వెంటబెట్టుకుని దగ్గరిలోని ఆసుపత్రి అయిన ఖమ్మం ప్రభుత్వ ప్రధానాసుపత్రికి వెళ్లారు. ఓపీ స్లిప్‌ రాయించుకుని వైద్యుని దగ్గరకు తన తండ్రిని తీసుకెళ్లిన సదరు మహిళతో సంబంధిత వైద్యుడు మొదట చాలా ఆప్యాయంగా మాట్లాడాడు. చాలా శ్రద్ధగా వివరాలన్నీ తెలుసుకున్నాడు. టెస్టులు నిర్వహించిన అనంతరం ధృవీకరణ పత్రాన్ని ఇస్తామని చెప్పాడు. సమాచారం ఇవ్వడం కోసమంటూ ఆమె ఫోన్‌ నెంబర్‌ను కూడా అడిగి తీసుకున్నాడు. ఇక ఆరోజు నుంచి ఆమెకు ఫోన్లు చేస్తూ వేధించడం మొదలుపెట్టాడు. నిన్ను చూసిన దగ్గరి నుంచి నిద్ర పట్టడం లేదని, పదేపదే నువ్వే గుర్తొస్తున్నావని, అప్పుడప్పుడూ వచ్చిపోవచ్చు కదా అని, ఇలా పలు రకాలుగా ఆమెతో సంభాషణ సాగిస్తూ వచ్చాడు. సాయం కోసం వెళ్లినపుడు మంచిగా మాట్లాడాడు కదా అని ఆమె ఆ డాక్టర్‌ ఫోన్‌ చేసిన ప్రతిసారీ లిఫ్ట్‌ చేసి మాట్లాడేది. దీన్ని అలుసుగా తీసుకున్న ఆ వైద్యుడు ఆమెను సర్టిఫికెట్‌ను తీసుకెళ్లడానికి రావాల్సిందిగా సూచించాడు. వేరేవాళ్లు ఎవరినీ పంపించొద్దు. నువ్వొస్తేనే ఇస్తానంటూ నమ్మబలికాడు.



    తీరా ఆసుపత్రికి వెళ్లాక తనతో ఓ రాత్రి గడిపితేనే (One night stand) సర్టిఫికెట్‌ ఇస్తానంటూ మెలిక పెట్టాడు. దీంతో షాక్‌కు గురైన ఆ మహిళ (Woman) సర్టిఫికెట్‌ తీసుకోకుండానే వెనుదిరిగింది. ఇలా గత నెల 17వ తేదీ నుంచి ఆమెకు సర్టిఫికెట్‌ ఇవ్వకుండానే వేధిస్తూ వస్తున్నాడు. దీంతో విసిగిపోయిన ఆ మహిళ ఈనెల 4వ తేదీన ఆసుపత్రి సూపరెంటెండెంట్‌కు ఫిర్యాదు చేసింది. అనంతరం పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. స్పందించిన ఆసుపత్రి అధికారులు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.

    ఇక అప్పటి నుంచి సదరు వైద్యుడు ఆసుపత్రి వైపు రావడం లేదు. కనీసం విచారణకు కూడా హాజరుకావడం లేదు.  పేదరికంలో ఉన్న తండ్రికి  ప్రభుత్వం ఇచ్చే ఫించను వచ్చేలా చేయాలన్న తపనతో ఆసుపత్రికి వచ్చిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించి, ఆమెను మానసికంగా వేధించిన సదరు వైద్యునిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మరెవ్వరికీ ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Crime news, Doctors, Khammam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు