(G.SrinivasReddy,News18,Khammam)
వినడానికి ఒక ఇంతకు ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. 62 ఏళ్ల వయసులో ఆయన.. 28 ఏళ్ల వయసులో ఆమె.. ప్రేమలో పడ్డారు. వాళ్ళిద్దరూ అక్కడితో ఆగలేదు. ఏకంగా పెద్దల్ని కాదని ఇంటి నుంచి వెళ్లిపోయారు. రిటైర్డ్ అయిన ఆ ఉన్నాధికారి కనిపించడం లేదని ఆయన భార్య వరంగల్(Warangal)నగరంలోని సుబేదారి(Subedari)పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు తమ కుమార్తె కనిపించడం లేదని మరో మహిళ ఉద్యోగి తండ్రి మహబూబాబాద్ (Mahabubabad)పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిద్దరినీ వెతికి పట్టుకున్న పోలీసులు సుబేదారి పోలీస్ స్టేషన్(Police station)కు తరలించారు. విచారణలో వాళ్ళిద్దరూ చెప్పిన విషయాలు విని పోలీసులు ఖంగుతిన్నారు.
వింత ప్రేమజంట ..
మహబూబాబాద్ గ్రామీణ నీటి సరఫరా విభాగంలో సూపర్ ఎంటెండెంట్ ఇంజనీర్ గా పనిచేసే రిటైర్ అయిన ఓ పెద్దాయన లేటు వయసులో ఘాటు ప్రేమలో పడ్డారు. రిటైర్ అయిన తర్వాత ఆ శాఖలో ఉద్యోగులకు వచ్చే పలు సందేహాలను నివృత్తి చేస్తూ కాలయాపన చేస్తున్నారు. ఈ సందర్భంలోనే ఆయనకు ఓ మహిళ ఉద్యోగి తారసపడింది. శిక్షణలో భాగంగా కొంతకాలం ఆయనతో రెగ్యులర్‌గా కలుస్తున్నామే ఆయన మంచితనం చూసి ఆకర్షితరాలైంది.
రిటైర్డ్ ఉద్యోగస్తుడితో ప్రేమాయణం..
రిటైర్డ్ ఉద్యోగికి పరిచమైన మహిళకు గతంలోనే వివాహం జరిగింది. అయితే ఆమెకు ఆ పెళ్లి ఇష్టం లేకపోవడంతో ఇబ్బందులు పడుతోంది. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో ఆర్డబ్ల్యూఎస్ విభాగంలో పనిచేస్తుంది. తనకు ఇష్టం లేని పెళ్లి చేసి తన గొంతు కోశారని ఆమె తల్లిదండ్రులపై ఎప్పుడూ గొడవ చేస్తూ ఉండేదని తెలుస్తోంది. ఆమె తల్లిదండ్రులు సైతం ఎవరితో తమ కుమార్తె సంతోషంగా ఉండటమే కావాలని భావించారు తప్ప ఆమె గురించి పెద్దగా పట్టించుకోలేదు.
పది రోజుల క్రితమే ఇద్దరూ కలిసి..
పది రోజుల క్రితం ఆమె ఆఫీస్‌కి వెళ్తున్నానని చెప్పి వెళ్లింది. ఇంటికి తిరిగి రాకపోయినా కనీసం ఆమెకి ఏమైంది..? ఎక్కడికి వెళ్లింది ..? అనే విషయాలు పట్ల ఆమె భర్త గాని తల్లిదండ్రులు గాని కనీసం విచారణ కూడా చేయలేదు. తీరా అతని కోసం చేసిన ఎంక్వైరీలో పోలీసులకు ఈమె కూడా కనిపించడం లేదన్న విషయం వెలుగులోకి వచ్చింది. అదే విషయంపై పోలీసులు ఆమె తల్లిదండ్రులను సంప్రదిస్తే ఇంటికి రాక 10రోజులైందని భర్త, తల్లిదండ్రులు చెప్పడంతో ఆశ్చర్యపోయారు.
పెద్దాయనతో ప్రేమ ..
62ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగస్తుడితో ఆమె సాన్నిహిత్యం కొనసాగించడంపై కుటుంబ సభ్యులు ఒకలా చెబుతుంటే మహిళ మాత్రం మరోలా చెబుతోంది. తన జీతం తీసుకుంటున్న భర్త మానసీకంగా, శారీరకంగా చిత్రహింసలు పెడుతున్నాడని ఆమె ఆరోపణలు చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. అంతే కాదు తాను క్లోజ్‌గా మూవ్ అవుతున్న వ్యక్తిని తన తండ్రే పరిచయం చేశాడని ఆఫీస్ వ్యవహారాల్లో మెళకువలు నేర్పిస్తారని చెప్పినట్లుగా పోలీసులు అంటున్నారు.
పోలీసులకే ఫజిల్ ..
పది రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన తమ బిడ్డ తమపై ఆరోపణలు చేసిన వాటిలో ఏదివాస్తవం కాదని ఆమె తండ్రి కొట్టి పారేస్తున్నారు. నువ్వు మోసం చేసావంటే నువ్వే మోసం చేశావు అంటూ ఒకరిపై ఒకరు పోలీసు సమక్షంలోనే నిందలు మోపుకోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఈకేసును ఏ విధంగా తేల్చాలి. దర్యాప్తు ఎలా ముంగిచాలో తెలియడం లేదన్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చొని చర్చించుకొని ఒక అభిప్రాయానికి రావాలని సలహా ఇచ్చినట్లుగా పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Love affair, Mahabubabad, Telangana News