ద్వాదశ ఆదిత్య మహాగణపతిగా ఖైరతాబాద్ గణేష్... ఈ రూపంలో కొలిస్తే...

1954 నుంచి అంటే సుమారు 64 ఏళ్ల నుంచి ఖైరతాబాద్‌లో వినాయకుడ్ని ప్రతిష్టిస్తున్నారు.

news18-telugu
Updated: September 1, 2019, 7:49 AM IST
ద్వాదశ ఆదిత్య మహాగణపతిగా ఖైరతాబాద్ గణేష్... ఈ రూపంలో కొలిస్తే...
ఖైరతాబాద్ గణేష్
  • Share this:
దేశవ్యాప్తంగా కూడా ఖైరతాబాద్ గణేష్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. వినాయకచవితి పండగ వచ్చిదంటే తెలుగు రాష్ట్రల ప్రజలు చూసేది ఖైరతాబాద్ గణేష్ కోసమే. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఖైరతాబాద్ వినాయకుడు మరో ఘనత సాధించాడు. దేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా అరుదైన గుర్తింపు సాధించింది. అయితే ఈ ఏడాది 61 అడుగుల ఎత్తులో ద్వాదశ ఆదిత్య మహాగణపతిగా స్వామి దర్శనమిస్తున్నారు. 12 తలలు, ఏడు అశ్వాలు, 12 సర్పాలతో.. 61 అడుగుల ఎత్తులో భారీ గణపతి రూపుదిద్దుకున్నాడు. వినాయ‌కుడి కుడి వైపున మహా విష్ణువు, ఏకాదశి దేవి.. ఎడమ వైపున బ్రహ్మా, విష్ణు, మహేశ సమేత దుర్గాదేవి కొలువదీరారు. ఒక్కో తలకు ఒక్కో రకమైన రంగుతో గ‌ణ‌నాథుడు రూపుదిద్దుకున్నాడు. ఈ రూపంలో వినాయకుణ్ని పూజిస్తే సకాలంలో వర్షాలు పడి, అందరికీ మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

1954 నుంచి అంటే సుమారు 64 ఏళ్ల నుంచి ఖైరతాబాద్‌లో వినాయకుడ్ని ప్రతిష్టిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఆదేశాల ప్రకారం 2015 నుంచి ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఎత్తును తగ్గిస్తూ వస్తున్నారు. గతేడాది అంటే 2018లో మూడు అడుగుల మేర విగ్రహం ఎత్తును తగ్గించింది.. గణేష్ ఉత్సవ సమితి. గతేడాది సప్తముఖ కాళసర్ప మహాగణపతిని ఖైరతాబాద్‌లో ప్రతిష్టించారు. ఈ విగ్రహానికి 14 చేతులు, తలపై ఏడు సర్పాలు, కింద ఏడు ఏనుగులు, నమస్కరించే రూపంలో ఉన్నాయి. గణపతి విగ్రహానికి కుడివైపు 14 అడుగుల ఎత్తులో లక్ష్మీ, ఎడమ వైపున సరస్వతి విగ్రహాలు ఉన్నాయి. ఈ ఏడాది మాత్రం  ద్వాదశ ఆదిత్య మహాగణపతిగా స్వామి భక్తులందరికి కనువిందు చేయనున్నారు.
First published: September 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading