ఖైరతాబాద్ గణేశుడిని భక్తులు ఆన్లైన్లో దర్శించుకోవాలని ఉత్సవ సమితి కోరింది. కోవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉన్నందున భక్తులెవరూ దర్శనం కోసం అక్కడకు రావద్దని విజ్ఞప్తి చేసింది. భక్తులు భారీ సంఖ్యలో ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి వస్తుండటంతో భౌతిక దూరం లేకపోవడం వంటి కోవిడ్ నిబంధనల ఉల్లంఘం జరుగుతోందని ఉత్సవ సమితి నిర్వాహకులు పేర్కొన్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఖైరతాబాద్ గణేశుడిని ప్రతిష్టించిన పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. దర్శన సమయాలను కూడా కుదించారు. ప్రస్తుతం ఉదయం 5 గం.ల నుంచి 10.30 గం.ల వరకు..సాయంత్రం 4 గం.ల నుంచి 10 గం.ల వరకు తక్కువ సంఖ్యలో భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు.
ఖైరతాబాద్ గణేశుడిని ఆన్లైన్లో www.ganapathideva.org వెబ్సైట్ ద్వారా దర్శించుకోవాలని ఉత్సవ సమితి భక్తులను కోరింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.