హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద గణేష్ నిమజ్జనం పూర్తయ్యింది. క్రేన్ నెంబర్ 6వద్ద ఖైరతాబాద్ వినాయకుడ్ని నిమజ్జనం చేశారు. అత్యంత వేగంగా ఖైరతాబాద్ బొజ్జగణపయ్యను నిమజ్జనం చేశారు. కేవలం ఆరు గంటల్లోనే పూర్తిచేశారు. దీంతో గంగమ్మ చెంతకు ఖైరతాబాద్ వినాయకుడు చేరాడు.ఉదయం ఆరుగంటలకే ప్రారంభమైన వినాయకుడి శోభాయాత్ర ప్రారంభమైంది. ట్యాంక్ బండ్‌పై భక్తుల జై గణేష్ నినాదాల మధ్య 57 అడుగుల మహా గణపతిని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ganesh Chaturthi, Hyderabad