HOME »NEWS »TELANGANA »key changes in corona vaccination process no second chance to take vaccine hsn

Corona Vaccination: సర్కారు సంచలన నిర్ణయం.. కరోనా వ్యాక్సిన్ ను వద్దని చెప్పిన వాళ్లకు..

Corona Vaccination: సర్కారు సంచలన నిర్ణయం.. కరోనా వ్యాక్సిన్ ను వద్దని చెప్పిన వాళ్లకు..
ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియకు కొందరు సిబ్బంది గైర్హాజరవుతున్నట్టు అధికారులు గుర్తించారు. సరిగ్గా వ్యాక్సిన్ ను తీసుకోవాల్సిన రోజే కొందరు సిబ్బంది విధులకు గైర్హాజరవుతున్నట్టు తెలిసింది. దీంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

  • Share this:
    దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా జరుగుతోంది. తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ కు గురయిన వారు ఎవరూ లేరని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. లాక్ డౌన్ సమయంలో అత్యవసర సేవలను అందించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ప్రస్తుతం వ్యాక్సినేషన్ ను అందిస్తున్నారు. ఆ తర్వాత దశలవారీగా అందరికీ వ్యాక్సిన్ ను అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అదే సమయంలో వ్యాక్సిన్ గురించి సోషల్ మీడియాలో పుకార్లు వస్తుండటం కొందరిలో భయం నెలకొంది. వ్యాక్సిన్ వేసుకుంటే భవిష్యత్తులో పిల్లలు పుట్టరని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఎక్కడో వేరే దేశాల్లో వ్యాక్సిన్ వేసుకున్న వృద్ధులు సైడ్ ఎఫెక్ట్స్ తో మరణిస్తే, దాని విషయమై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయడంతో వ్యాక్సిన్ పై మన దేశంలోనూ కొందరిలో అనుమానాలు ఇంకా పోలేదు.

    తెలంగాణలో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియకు కొందరు సిబ్బంది గైర్హాజరవుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఎక్కడ, ఎవరెవరికి ఏ రోజు వ్యాక్సిన్ ఇస్తారన్నది ముందుగానే అధికారులు ఓ డేటాను సిద్ధం చేశారు. సరిగ్గా వ్యాక్సిన్ ను తీసుకోవాల్సిన రోజే కొందరు సిబ్బంది విధులకు గైర్హాజరవుతున్నట్టు తెలిసింది. వ్యాక్సిన్ పై అపనమ్మకంతోనో, భయంతోనో వారు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు గుర్తించారు. దీంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వ్యాక్సినేషన్ ప్రక్రియలో కీలకమైన మార్పులను చేసింది. వ్యాక్సినేషన్ కు ఎవరైనా రాకపోతే, వారికి బదులుగా మరొకరికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది.



    అదే సమయంలో ఒక్కసారి కరోనా వ్యాక్సిన్ ను తిరస్కరించిన వారు మరోసారి టీకాను అడిగేందుకు అర్హులు కాదని తేల్చింది. అంటే ఒక్కసారి వ్యాక్సిన్ ను తిరస్కరిస్తే ఇంకోసారి నోఛాన్స్ అన్నమాట. వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్న కేంద్రాల్లో ఎవరికి ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్ ను అందించాలన్న వివరాలు ఉంటాయనీ, గైర్హాజరయిన వారి శాతాన్ని బట్టి ఆ వివరాలను ఎప్పటికప్పుడు మార్చుకోవాలని సూచించింది. కరోనా టీకా వద్దని ఎవరైనా చెబితే వారి వివరాలను కొవిన్ యాప్ లో నమోదు చేస్తారు. దాని వల్ల మరెక్కడా కూడా భవిష్యత్తులో వ్యాక్సిన్ ను వాళ్లు తీసుకోలేరు. ప్రతీరోజూ 60 నుంచి 70 శాతం మేరకే వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోందనీ, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామనీ, అర్హులైన వారికి త్వరగా వ్యాక్సిన్ ను అందించేందుకు ఈ మార్పులు చేశామని వైద్యాధికారులు చెబుతున్నారు.
    Published by:Hasaan Kandula
    First published:January 21, 2021, 07:17 IST