రూ.కోటీ 10 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కీసర ఎమ్మార్వో...

కీసర ఎమ్మార్వో నాగరాజు (File)

హైదరాబాద్‌లోని ఏఎస్ రావు నగర్‌లో లంచం తీసుకుంటూ ఓ ఎమ్మార్వో రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు దొరికిపోయారు.

  • Share this:
    హైదరాబాద్‌లోని ఏఎస్ రావు నగర్‌లో లంచం తీసుకుంటూ ఓ ఎమ్మార్వో రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు దొరికిపోయారు. ఓ భూమికి సంబంధించి రూ.1.10 కోట్ల లంచం తీసుకుంటుండగా, కీసర ఎమ్మార్వో నాగరాజును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏఎస్ రావు నగర్‌లోని తన నివాసంలోనే ఆయన లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. దీంతో వెంటనే నాగరాజు ఇల్లు, ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇంత భారీ ఎత్తున లంచం తీసుకుంటూ ఓ ఎమ్మార్వో పట్టుబడడం పెద్ద సంచలనంగా మారింది. కీసర ఎమ్మార్వో పరిధిలోకి వచ్చే రాంపల్లిలో 28 ఎకరాల భూమికి సంబంధించి వివాదం ఉన్నట్టు తెలిసింది. ఆ భూ వివాదాలకు క్లియర్ చేసేందుకు నాగరాజు భారీ ఎత్తున లంచం డిమాండ్ చేసినట్టు భావిస్తున్నారు. ఈ రోజు రూ.1.10 కోట్ల లంచం తీసుకుంటుండగా ఏఎస్ రావు నగర్‌లోని ఆయన నివాసంలోనే ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.    కీసర ఎమ్మార్వో నాగరాజు ఇంట్లో ఏసీబీ తనిఖీలురాంపల్లిలో సత్య డెవలపర్స్ రియల్ ఎస్టేట్ కు చెందిన వ్యక్తుల నుంచి నాగరాజు లంచం డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. నాగరాజు మీద గతంలో కూడా ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. మూడు నెలల క్రితమే ఆ కేసు నుంచి విముక్తి పొందినట్టు సమాచారం. ఎమ్మార్వో నాగరాజు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ శ్రీనాథ్, కన్నడ అంజిరెడ్డి అనే మరో వ్యక్తిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మార్వో నివాసం, ఆఫీసులో మరింత సోదాలు జరగనున్నాయి. ఆ తర్వాత అసలు ఆయన ఆస్తులు ఎన్ని ఉన్నాయనే విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: