గత సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఓటమికి కారణాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆమె ఓటమికి గల కారణాలను చెప్పుకొచ్చారు. ముఖ్యంగా నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన ఎంపీలపై అంచనాలు ఎక్కువగా ఉంటాయని ఎంత బాగా పనిచేస్తే అంత మేర అంచనా పెరిగిపోతుందని నర్సయ్య తెలిపారు. తాను కొత్తగా ఎంపీగా ఎన్నికైనప్పుడు ఓ ఆంధ్రా ఎంపీ సలహా ఇచ్చారని, ఎంత తక్కువ పెర్ఫార్మెన్స్ ఉంటే అంత మంచిదని చెప్పారని నర్సయ్యగౌడ్ తెలిపారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు తాము చేసే పనుల క్రెడిట్ ఎంపీకి దక్కకుండా చేసేందుకు ప్రయత్నిస్తారని, అందుకే ఎంపీలు అనే వారు ఉత్సవ విగ్రహాలుగా ఉండేందుకు మాత్రమే ఎమ్మెల్యేలు ఇష్టపడతారని చెప్పుకొచ్చారు. తాను చాలా యాక్టివ్ గా ఉండటమే కొంప ముంచిందని, దాంతో నా వ్యక్తిగత ఇమేజీ ఆధారంగా ఓటర్లు అంచనాలు పెంచుకొని, ఓట్లు వేయడంతో లెక్క తప్పిందని తెలిపారు. అలాగే సీఎం కేసీఆర్ కుమార్తె విషయంలో పసుపు బోర్డు విషయంలో రైతుల అసంతృప్తి చెందడమే ప్రధానకారణమని నర్సయ్యగౌడ్ తెలిపారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.