kaleshwaram : కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభించిన సీఎం కేసీఆర్

kaleshwaram Project : 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరం ప్రాజెక్టు జాతికి అంకితమైంది.

Krishna Kumar N | news18-telugu
Updated: June 21, 2019, 12:58 PM IST
kaleshwaram : కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభించిన సీఎం కేసీఆర్
శిలాపలకం దగ్గర కేసీఆర్, జగన్
  • Share this:
వ్యవసాయ రంగంలో అద్భుత ప్రగతి సాధించి... తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కల నెరవేరుతోంది. తెలంగాణ ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ప్రారంభించారు. జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమాన్ని కేసీఆర్ దంపతులు దగ్గరుండి నిర్వహించారు. పూర్ణాహుతి సమయానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఏపీ సీఎం జగన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ హాజరయ్యారు. జగన్ చేతుల మీదుగా శిలాపలకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. రిబ్బన్ కట్ చేసి మేడిగడ్డ బ్యారేజీని కేసీఆర్ ప్రారంభించారు.

ఆ తర్వాత కన్నె పల్లి పంప్ హౌస్‌కి వెళ్లిన నరసింహన్, కేసీఆర్, జగన్, ఫడ్నవీస్... అక్కడి పూజల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత గవర్నర్ నరసింహన్ రిబ్బన్ కట్ చేసి... కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభించారు. కన్నెపల్లి పంప్ హౌస్ శిలాపలకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.

kaleshwaram project,kaleshwaram,kaleshwaram live,kaleshwaram project inauguration,kaleshwaram lift irrigation project,kaleshwaram project latest news,kaleshwaram opening,kaleshwaram project inauguration live,kaleshwaram project live,kaleshwaram project song,cm kcr kaleshwaram project,kaleshwaram news,kaleshwaram project videos,kaleshwaram project opening,kaleshwaram project updates,kaleshwaram inauguration live,kaleshwaram song,కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రారంభించిన కేసీఆర్,జగన్,ఫడ్నవీస్,కేసీఆర్,
హోమంలో పాల్గొన్న కేసీఆర్ దంపతులు


పంప్ హౌస్ ప్రారంభించడంతో ఏపీ సీఎం జగన్ షెడ్యూల్ పూర్తైంది. మధ్యాహ్న భోజనం తర్వాత తిరిగి జగన్ అమరావతి వెళ్లిపోతారు.హోమంలో పాల్గొన్న కేసీఆర్ దంపతులు


కన్నెపల్లి పంపు హౌస్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఫడ్నవీస్... తర్వాత కాళేశ్వరం ఆలయాన్ని సందర్శిస్తారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో 5 పాత రిజర్వాయర్లు, 19 నూతన రిజర్వాయర్లు, బ్యారేజిలు, పంప్ హౌజ్‌లు, సుమారు 203 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, విద్యుత్ సరఫరా చేయడానికి 17 సబ్‌స్టేషన్ల నిర్మాణం జరుగుతోంది. కాళేశ్వరం కార్పోరేషన్ ద్వారా ఇప్పటి వరకు రూ.40 వేల కోట్లకు పైగా రుణం సేకరించారు. ఇందులో రూ.29259 కోట్లు ఖర్చు చేశారు. పెద్దపల్లి జిల్లాలోని ప్యాకేజీ 6 కింద నిర్మిస్తున్న పంప్ హౌజ్, అండర్ టన్నెల్, సర్జ్ పూల్ నిర్మిస్తున్నారు. 
First published: June 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు