హోమ్ /వార్తలు /తెలంగాణ /

Big Breaking: ముగిసిన TRS ప్రస్థానం..BRS గా ఆవిర్భావం..పత్రాలపై సంతకం చేసిన దేశ్ కీ నేత కేసీఆర్

Big Breaking: ముగిసిన TRS ప్రస్థానం..BRS గా ఆవిర్భావం..పత్రాలపై సంతకం చేసిన దేశ్ కీ నేత కేసీఆర్

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా సాగితున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, సినీ నటుడు ప్రకాష్ రాజ్, పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలంతా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి, సరిగ్గా 1.20 నిమిషాలకు  ఈసి పంపిన BRS పత్రాలపై కేసీఆర్ సంతకం చేశారు. కాగా ఇప్పటివరకు TRS గా ఉన్న పార్టీ ఇకపై BRSగా జాతీయ పార్టీగా అవతరించబోతుంది. అయితే BRSగా మారిన కూడా గులాబీ జెండా రంగు, కారు గుర్తు కొనసాగనుంది. అయితే తెలంగాణ మ్యాప్ స్థానంలో భారతదేశాన్నిఉంచారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా సాగితున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్ (Cm Kcr), కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, సినీ నటుడు ప్రకాష్ రాజ్, పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలంతా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన కేసీఆర్ (Cm Kcr) ప్రత్యేక పూజలు చేశారు. సరిగ్గా 1.20 నిమిషాలకు  ఈసి పంపిన BRS పత్రాలపై కేసీఆర్ (Cm Kcr) సంతకం చేశారు. కాగా ఇప్పటివరకు TRS గా ఉన్న పార్టీ ఇకపై BRSగా జాతీయ పార్టీగా అవతరించనుంది. పత్రాలపై సంతకం చేసిన కేసీఆర్ BRS జెండాను ఆవిష్కరించారు. అయితే BRSగా మారిన కూడా గులాబీ జెండా రంగు కొనసాగించగా..కారు గుర్తు కనిపించలేదు. కేవలం తెలంగాణ మ్యాప్ స్థానంలో భారతదేశాన్నిఉంచారు.

Eatala Rajender: సమైక్యాంధ్ర వెనక సీఎం కేసీఆర్ కుట్ర.. ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

22 ఏళ్లుగా టీఆర్ఎస్ ..ఇకపై బీఆర్ఎస్..

కాగా 22 ఏళ్ల తెరాస ప్రస్థానం ఇకపై బీఆర్ఎస్ గా కార్యకలాపాలు నిర్వహించనుంది. అయితే మొదటగా BRS టార్గెట్ కర్నాటకగా తెలుస్తుంది. మొదటి నుంచి కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కేసీఆర్ (Cm Kcr) కు మద్దతుగా నిలుస్తున్నారు. ఆ రాష్ట్రంలో కుమారస్వామితో కలిసి పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక ఇప్పటివరకు తెలంగాణకు మాత్రమే పరిమితమైన కేసీఆర్ (Cm Kcr) ఇకపై దేశ వ్యాప్తంగా విస్తరించనుంది. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్ సహా పలువురితో చర్చలు కూడా జరిపారు.

కనిపించని కారు గుర్తు..

అయితే Trs Brs గా మారినప్పటికీ కూడా జెండా రంగు, కారు గుర్తును అలాగే కొనసాగిస్తారని అంతా భావించారు. BRS జెండావిష్కరణ చేసే వరకు కూడా ఈ విషయం పెద్దగా వార్తల్లోకి రాలేదు. కానీ జెండావిష్కరణ తరువాత పార్టీ కండువా, జెండాపై కారు గుర్తు ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడీ అంశం తీవ్ర చర్చనీయాంశం అయింది. కేవలం తెలంగాణ మ్యాప్ స్థానంలో భారతదేశాన్ని ఉంచారు. కానీ ఎక్కడా కూడా కారు గుర్తు కనిపించలేదు. BRS గుర్తు మార్చే యోచనలో కేసీఆర్ (Cm Kcr) ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై BRS అధినేత కేసీఆర్ (Cm Kcr) ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

First published:

Tags: BRS, CM KCR, Hyderabad, Kcr, Prakash Raj, Telangana, Telangana News, Trs