Home /News /telangana /

KCR RECIEVES COMPLAINT AGAINST ETELA RAJENDER SON ETELA NITHIN REDDY AND ORDERS PROBE SU

Etela Nithin Reddy: ఈటల రాజేందర్ కొడుకుపై సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు.. కీలక ఆదేశాలు జారీచేసిన సీఎం..

ఈటల రాజేందర్(ఫైల్ ఫొటో)

ఈటల రాజేందర్(ఫైల్ ఫొటో)

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కొడుకు నితిన్‌రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు అందింది. నితిన్ భూ కబ్జాకు పాల్పడ్డారని ఆరోపిస్తూ మహేష్ అనే వ్యక్తి సీఎంకు లేఖ రాశారు.

    తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కొడుకు నితిన్‌రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు అందింది. ఈటల నితిన్ రెడ్డి తన భూమిని కబ్జా చేశారని మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలం రావల్ కోల్ గ్రామ నివాసి పీట్ల మహేష్ ముదిరాజ్ అనే వ్యక్తి సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలంటూ సీఎం కేసీఆర్‌కు ఓ లేఖ రాశారు. దీనిపై స్పందించిన కేసీఆర్.. ఇందుకు సంబంధించిన తక్షణమే విచారణ ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం కెసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ఏసీబీ విజిలెన్స్ శాఖ, రెవెన్యూ శాఖలు సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని అన్నారు. ఇక, సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో మహేష్ పలు అంశాలను పేర్కొన్నాడు.

    ఇప్పటికే ఈటల రాజేందర్ మెదక్‌ జిల్లా అచ్చంపేట, హకీంపేటలో భూకబ్జాకు పాల్పడ్డారనే ఆరోపణలపై ప్రభుత్వం విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి తొలగించారు. మరోవైపు ఈటల రాజేందర్‌పై పలువురు రాష్ట్ర మంత్రులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. వాటిపై ఈటల కూడా అ ఈ క్రమంలోనే ఈటల నియోజకవర్గం హుజూరాబాద్ రాజకీయం వేడెక్కింది.



    ఎమ్మెల్యే పదవికి ఖచ్చితంగా రాజీనామా చేస్తానని.. ఈటల రాజేందర్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. అయితే కరోనా ముగిసిన తర్వాతే ఆ నిర్ణయం ఉంటుందని ఆయన తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల ద్వారానే కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి చెందినట్లు హైకోర్టు, సుప్రీంకోర్టు మండిపడ్డాయని ఈటల గుర్తు చేశారు. ఈటల రాజీనామా చేస్తే... అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో ఆయనను ఓడించాలనే ప్రణాళికలు రచిస్తోంది టీఆర్‌ఎస్. మరోవైపు స్థానిక టీఆర్‌ఎస్ నేతలు ఎవరూ ఈటలకు మద్దతుగా నిలవకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ బాధ్యతలను టీఆర్‌ఎస్ అధిష్టానం పలువురు పార్టీ ముఖ్య నేతలకు అప్పగించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక, తాజాగా ఈటల రాజేందర్ కొడుకుపై భూ కబ్జా ఆరోపణల చేస్తూ ఫిర్యాదు రావడం.. సీఎం విచారణకు ఆదేశించడం హాట్ టాపిక్‌గా మారింది.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: CM KCR, Etela rajender, Telangana

    తదుపరి వార్తలు