హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR New Party: కేసీఆర్ జాతీయ పార్టీ పేరు ఫైనల్? జెండా, గుర్తుపైనా కీలక నిర్ణయం

KCR New Party: కేసీఆర్ జాతీయ పార్టీ పేరు ఫైనల్? జెండా, గుర్తుపైనా కీలక నిర్ణయం

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

KCR New Party: తెలంగాణలోని సంక్షేమ పథకాలు రైతుబంధు, రైతుభీమా, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి వంటి పథకాలు దేశమంతటా తీసుకురావాలని చూస్తున్నారట.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ సీఎం కేసీఆర్  (CM KCR) పాన్ ఇండియా పార్టీపై దృష్టి సారించారు. ఈ మేరకు కొత్త పార్టీ ప్రకటనపై ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తుంది. అక్టోబర్ 5న దసరా రోజే జాతీయ పార్టీ ప్రకటన ఉండబోతుంది. ఇప్పటికే దేశంలోని పలువురు సీఎంలు, సామాజికవేత్తలతో కేసీఆర్ జాతీయ పార్టీ (KCR National Party)పై చర్చించినట్లు తెలుస్తుంది. అయితే జాతీయ పార్టీగా TRSను ప్రకటించాలని ప్రతిపాదనలు వచ్చాయి. కానీ కేసీఆర్ మాత్రం కొత్త పార్టీ ఏర్పాటుకే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.

  ఇక నేడు మంత్రులు, జిల్లా అధ్యక్షులతో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ (Pragathi Bhawan) లో భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో కొత్త పార్టీ జెండా, అజెండా పై ప్రధాన చర్చ జరగనుంది. అలాగే దసరా లోపే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో భేటీ నిర్వహించి దసరా రోజే పార్టీ ప్రకటించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇక జాతీయ పార్టీకి భారతీయ రాష్ట్ర సమితి (BRS), భారతీయ వికాస సమితి, నయా భారత్ వంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే TRS ను పోలి ఉన్న భారతీయ రాష్ట్ర సమితి (BRS) వైపే సీఎం కేసీఆర్ మొగ్గు చూపినట్లు సమాచారం. దాదాపు ఇదే పేరు ఫైనల్ కానున్నట్లు తెలుస్తుంది. అలాగే పార్టీ జెండా, గుర్తు విషయంలోనూ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. జాతీయ పార్టీకి కూడా కలిసొచ్చిన కారు గుర్తునే ఉంచబోతున్నట్టు తెలుస్తుంది. జెండా విషయంలోనూ గులాబీ జెండానే ఉండబోతున్నట్టు స్పష్టంగా సంకేతాలు కనిపిస్తున్నాయి.

  విద్యార్థులకు అలర్ట్.. తెలంగాణలో ఈ నెల స్కూళ్లు నడిచేది 18 రోజులే.. మరి

  దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్ అందుకు తగ్గట్టే కేంద్రానికి ధీటుగా పార్టీ పేరు ఫైనల్ చేయాలని భావిస్తున్నారట. అలాగే తెలంగాణలోని సంక్షేమ పథకాలు రైతుబంధు, రైతుభీమా, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి వంటి పథకాలు దేశమంతటా తీసుకురావాలని చూస్తున్నారట. ఇక జాతీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో కేసీఆర్ కొత్త ఫ్లైట్ అవసరమని భావించినట్లు తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగా పార్టీ ప్రకటన అనంతరం ఫ్లైట్ కోసం ఆర్డర్ చేయనున్నట్టు సమాచారం. అయితే 2001లో టిఆర్ఎస్ ను ప్రారంభించాక..హెలికాఫ్టర్  వినియోగం బాగా కలిసొచ్చిందని ఇప్పుడు సొంత విమానం ద్వారా కూడా అంతే గుర్తింపు వస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు.

  అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ , కాంగ్రెస్ మినహా మిగతా పార్టీలను ఏకం చేసి ముందుకెళ్లాలని కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు. కేసీఆర్ కు అనుకూలంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సహా పలువురు నేతలు తమ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. 2024లో బీజేపీ ముక్త్ భారత్ నినాదంతో ముందుకెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. అక్టోబర్ 5లోపు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీలో పార్టీ జెండా, అజెండా వంటి అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. మరి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్ కు ఎలాంటి అనుభవం ఎదురవుతుందో చూడాలి.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: CM KCR, Hyderabad, Telangana, Trs

  ఉత్తమ కథలు